BigTV English
Advertisement

Dolly Sohi: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ టీవీ నటి మృతి

Dolly Sohi: ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ టీవీ నటి మృతి


TV actress Dolly Sohi passes away(Film news in telugu today): ఇండస్ట్రీలో మరో విషాదం. ప్రముఖ టీవీ నటి డాలీ సోహి (48) తాజాగా కన్నుమూశారు. ఆమె గతకొంతకాలంగా గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడుతూ.. చివరికి ఈ రోజు తుదిశ్వాస విడిచారు. కాగా ఆమె సోదరి అమన్‌దీప్ సోహిని కామెర్ల చికిత్స తీసుకుంటూ మరణించిన కొన్ని గంటలకే.. డాలీ సోహి మరణం అందరనీ కలచివేస్తోంది.

కొన్ని గంటల వ్యవధిలోనే ఒకే కుటుంబం నుంచి ఇద్దరు మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. అంతేకాకుండా వినోద పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. భారతీయ చలన చిత్రం, టెలివిజన్‌కు వారు చేసిన సేవలను గుర్తుంచుకుంటున్నారు.


కాగా అమన్‌దీప్, డాలీ సోహి ఇద్దరూ కూడా ముంబైలోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స తీసుకున్నారు. ఇక అమన్‌దీప్ నిన్న అంటే గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఇక డాలీ ఈరోజు అంటే శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు అని వారి కుటుంబ సభ్యులు విచారం వ్యక్తం చేస్తున్నారు.

READ MORE: సైలెంట్‌గా ఓటీటీలోకి ‘ఊరుపేరు భైరవకోన’.. ఇది ఎవరూ ఊహించి ఉండరు..

ఇక డాలీసోహి ఒక ప్రసిద్ధ భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటి. ఆమె వివిధ టీవీ సీరియల్స్, చిత్రాలలో తన పాత్రలకు ప్రజాదరణ పొందింది. ‘భాభి’, ‘కసౌతీ జిందగీ కే’, ‘క్కుసుమ్’, ‘కహానీ ఘర్ ఘర్ కి’ వంటి సీరియల్‌లో ఆమె ప్రముఖ రచనలలో కొన్ని. ఆమె విభిన్నమైన పాత్రలు చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

డాలీ సోహి పనిచేసిన ముఖ్యమైన సీరియల్స్‌లో ఒకటి ‘ఝనక్’. దురదృష్టవశాత్తూ ఆమె గర్భాశయ క్యాన్సర్‌తో పోరాడడం వల్ల ఆ సీరియల్‌ను మధ్యలోనే వదిలివేయవలసి వచ్చింది. కాగా ఆమె ఈ సీరియల్ ద్వారానే బాగా జనాదరణ పొందింది. అంతేకాకుండా డాలీ తన పాత్రను పోషించిన తీరు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ అందుకుంది.

మరోవైపు.. అమన్‌దీప్ సోహి కూడా ఒక నటి. ఆమె టీవీ సీరియల్స్, చిత్రాలలో కనిపించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె సోదరి డాలీ వలె ఎక్కువ పాపులారిటీ లేకపోయినా.. పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. పలు సీరియల్స్‌లో నటించి మంచి పేరు సంపాదించుకుంది.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×