BigTV English
Advertisement

Ooru Peru Bhairavakona: సైలెంట్‌గా ఓటీటీలోకి ‘ఊరుపేరు భైరవకోన’.. ఇది ఎవరూ ఊహించి ఉండరు..

Ooru Peru Bhairavakona: సైలెంట్‌గా ఓటీటీలోకి ‘ఊరుపేరు భైరవకోన’.. ఇది ఎవరూ ఊహించి ఉండరు..

Ooru Peru Bhairavakona OTT Release date


Ooru Peru Bhairavakona OTT Release date(Latest movies in tollywood): వుడ్ యంగ్ అండ్ టెలెంటెడ్ నటుడు సందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో కావ్యా థాపర్, వర్ష బొల్లమ్మ కథానాయికలుగా నటించారు. ఫాంటసీ అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా రూపొందింది.

ఎన్నో అంచనాల నడుమ ఈ మూవీ ఫిబ్రవరి 16న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుంచే ఈ మూవీ మంచి పాజిటివ్ టాక్‌ను అందుకుంది. దీంతో ఈ మూవీ చూసేందుకు ప్రేక్షకాభిమానులు థియేటర్లకు బారులు తీరారు. కాగా ఈ మూవీ ఫస్ట్ డే అద్భుతమైన కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది. ఏకంగా తొలిరోజు రూ.6 కోట్ల వరకు గ్రాస్ రాబట్టింది.


దీంతో ఊరుపేరు భైరవకోన మూవీ సందీప్ కిషన్ కెరీర్‌లోనే మొదటి రోజు హయ్యెస్ట్ వసూళ్లను రాట్టిన మూవీగా నిలిచింది. ఇకపోతే ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరగినట్లు సమాచారం. దాదాపు రూ.10 కోట్ల వరకు థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయని తెలుస్తోంది.

READ MORE: ఊరుపేరు భైరవకోన ఫస్ట్ డే కలెక్షన్స్.. 45రోజుల తరువాతే ఓటీటీలోకి!

ఇక థియేటర్లలో ప్రేక్షకాభిమానులను విపరీతంగా అలరించిన ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను భారీ ధరకు కొనుగోలు చేసిందని ఆ మధ్య వార్తలు చక్కర్లు కొట్టాయి. థియేటర్ రన్ తర్వాత ఈ మూవీ జీ5లో స్ట్రీమింగ్ అవుతుందని అంతా అనుకున్నారు.

కానీ అనూహ్యంగా.. ఎలాంటి హడావిడి లేకుండా ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ఈ రోజు మహా శివరాత్రి సందర్భంగా ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

జీ5 ఓటీటీలో వస్తుందని అంతా అనుకుంటే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌వీడియలో ప్రసారమై అందరినీ ఆశ్చర్యపరచింది. కాగా ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. మరి ఈ చిత్రాన్ని అప్పుడు థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో చూసేయొచ్చు.

కాగా ఈ మూవీ తర్వాత సందీప్ కిషన్ ఎలాంటి జానర్ మూవీ ఎంచుకుంటాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సందీప్ కూడా ప్రేక్షకాభిమానులకు ఎలాంటి స్టోరీ అయితే నచ్చుతుందో అలాంటి కథలనే ఎంపిక చేసుకుంటున్నాడు. ఎప్పుడూ ఓకే జానర్ సినిమాలను కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌లను సెలెక్ట్ చేసుకుంటున్నాడు. మరి ఈ సారి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×