BigTV English

AA22xA6 Movie Story : మొత్తం యాక్షన్.. మధ్యలో ఓ ట్విస్ట్ అండ్ సెంటిమెంట్

AA22xA6 Movie Story : మొత్తం యాక్షన్.. మధ్యలో ఓ ట్విస్ట్ అండ్ సెంటిమెంట్

AA22xA6 Movie Story : అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న హై బడ్జెట్ మూవీ AA22xA6. ఇప్పటికే అట్లీ ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేశాడు. మొన్నటి వరకు దుబాయ్ లో ఉండి ప్రీ ప్రొడక్షన్ పనులు చూసుకున్నాడు. ఇప్పుడు ఇండియాలోనే ఉండి వాటిని పర్యవేక్షిస్తున్నాడు. ఇదింతా పక్కన పెడితే… ఈ మధ్య సినిమాలో ఉండే అల్లు అర్జున్ పాత్రల గురించి ఓ న్యూస్ తెగ వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.


ఈ సినిమాలో బన్నీ మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడట. అందులో ఒకటి వారియర్, మరొకటి గ్యాంగ్‌స్టార్.. మొత్తం CGతో చేసిన మరో పాత్ర. ఈ న్యూస్ ఇండస్ట్రీలో రావడంతో సినిమాపై ఇప్పటికే ఉన్న బజ్ రెండింతలు అయిపోయింది.

ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో వార్త ఇండస్ట్రీ సర్కిల్స్‌లో తిరుగుతుంది. దీని ప్రకారం.. AA22xA6 మూవీలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఉంటుందట. అట్లీ నుంచి గతంలో వచ్చిన జవాన్ కంటే ఎక్కువ యాక్షన్ సీన్స్ ఈ మూవీలో ఉంటాయని తెలుస్తుంది.


యాక్షన్‌తో పాటు ఓ ట్విస్ట్.. సెంటిమెంట్ ?

AA22xA6లో యాక్షన్ సీక్వెన్స్‌తో పాటు ఓ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ కూడా ఉంటుందట. అల్లు అర్జున్ చేస్తున్న మూడు పాత్రల్లో రెండు పాత్రల మధ్య డైరెక్టర్ అట్లీ బ్రదర్ సెంటిమెంట్ పెడుతున్నారట. ఆ సెంటిమెంట్ సినిమాకు ఓ హైలైట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట అట్లీ.

డైరెక్టర్ అట్లీ నుంచి గతంలో వచ్చిన సినిమాల కంటే… ఈ AA22xA6 మూవీలో సెంటిమెంట్ డెప్త్ డీప్‌గా ఉంటుదని సమాచారం. ఇవి అన్నీ కూడా ఇంటర్నెషనల్ అప్పిల్ ఉండేలా అట్లీ డిజైన్ చేస్తున్నారట.

పార్ట్ 2 కూడా నా..?

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి మరో గాసిప్ కూడా వైరల్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ పై అట్లీ చాలా పెద్ద ప్లాన్ చేస్తున్నారట. AA22xA6 ఒక్క మూవీతోనే సరిపెట్డడం లేదట. దీని తర్వాత ఈ సినిమా సీక్వెల్స్ కూడా వస్తాయట. ఇంకా చెప్పాలంటే.. ఈ కాన్సెప్ట్‌తోనే ఓ ఫ్రాంచైజీని బిల్డ్ చేస్తున్నారని సమాచారం. ఇది నిజమే అయితే… ఇండస్ట్రీలో మరో భారీ సినిమాటిక్ యూనివర్స్ ఇది నిలవడం గ్యారంటీ అని చెప్పొచ్చు.

అల్లు అర్జున్ మేకోవర్..

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న ప్రాజెక్ట్ ఇది. దీనికి దాదాపు 800 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించారు సెన్ పిక్ఛర్స్. 800 కోట్ల బడ్జెట్ అంటే.. ఇండియన్ సినీ చరిత్రలో రెండో హైయెస్ట్ బడ్జెట్ మూవీ అన్నట్టు. మొదటి హైయెస్ట్ బడ్జెట్ మూవీగా రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో వస్తున్న SSMB 29 అని చెప్పొచ్చు. ఆ మూవీని దాదాపు 1000 కోట్లు పెట్టి నిర్మిస్తున్నారట.

ఇంత బడ్జెట్‌తో వస్తున్న AA22xA6 మూవీ గురించి అల్లు అర్జున తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమా స్టోరీకి అనుగుణంగా తనను, తన బాడీని మార్చుకుంటున్నాడు. ప్రముఖ ఫిజికల్ ట్రైయినర్ లాయిడ్ స్టీవెన్స్‌తో కలిసి తన శరీరాకృతిపై దృష్టి పెట్టాడు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×