Jr NTR WAR 2 : ‘బ్రహ్మాస్త్ర’ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం వార్ 2 (War 2). హృతిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి ఆదిత్య చోప్రా కథ అందించగా.. శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే సమకూర్చారు. ఇకపోతే ఈ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR ) బాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తున్నారు.’ ఆర్.ఆర్.ఆర్’ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసిన ‘దేవర’ భారీ విజయాన్ని అందుకుంది. అటు నార్త్ లో కూడా మంచి మార్కెట్ అందించింది. ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ ఆడియన్స్ ను మెప్పించడానికి అక్కడే నేరుగా సినిమా చేయడానికి సిద్ధమయ్యారు ఎన్టీఆర్. అందులో భాగంగానే ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కి ధీటుగా పోటీ పడడానికి సిద్ధమయ్యారు.
మొదటి టీజర్ తోనే నెగిటివిటీ..
ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కానీ అదే రోజు రజనీకాంత్(Rajinikanth ) ‘కూలీ’ సినిమా కూడా విడుదల కాబోతుండడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ చేస్తున్న తొలి హిందీ సినిమా కావడంతో అటు నార్త్ లోనే కాకుండా ఇటు సౌత్ లో కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. కానీ ఒక్క టీజర్ ఆ అంచనాలను మార్చేసింది అని చెప్పాలి. ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వార్ 2 నుంచీ ఎన్టీఆర్ ని పరిచయం చేస్తూ టీజర్ విడుదల చేశారు మేకర్స్. కానీ అందులో హృతిక్ రోషన్ హవా కనిపించిందే తప్ప ఎన్టీఆర్ పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ లుక్స్ ఆయన చేసిన స్టంట్స్ పై విమర్శలు కురిసాయి. పైగా హృతిక్ రోషన్ ముందు ఎన్టీఆర్ తేలిపోయారు అనే వార్తలు కూడా వచ్చాయి. దీంతో కొంతమంది ఎన్టీఆర్ ను కొంత మంది ట్రోల్ కూడా చేశారు. ఇక దీంతో ఎలాగైనా సరే మళ్లీ రీ వర్క్ చేయాలి అని ఎన్టీఆర్ పాత్రను హైలైట్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారట.
వార్ 2 తెలుగు రైట్స్.. నిర్మాతపై విమర్శలు..
ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర కేవలం 30 నుంచి 45 నిమిషాలు మాత్రమే ఉంటుందట. అయితే ఈ సినిమా తెలుగు హక్కులను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధినేత నాగ వంశీ (Naga Vamsi) ఏకంగా రూ.85 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ విషయం తెలిసి నెటిజన్స్ నిర్మాతను ఏకిపారేస్తున్నారు. ఎన్టీఆర్ పాత్ర 30 నిమిషాలే ఉంది ఈ మాత్రం దానికి రూ.85 కోట్లు పెట్టారా? అంటూ నాగ వంశీని ఏకిపారేస్తున్నారు నెటిజన్స్. ఏది ఏమైనా ఇన్ని కోట్లు పెట్టారు అంటే అది ఎన్టీఆర్ కోసం కాదు హృతిక్ కోసమే అంటూ స్పష్టంగా కామెంట్లు కూడా చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ఎన్టీఆర్ పై నమ్మకంతోనే నాగ వంశీ ఈ రేంజ్ ఖర్చు పెట్టారా ? లేక హృతిక్ రోషన్ ను నమ్ముకొని ఆయన ఈ రేంజ్ ఖర్చు పెట్టారా? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ALSO READ:HHVM: వీరమల్లు హీరోయిన్ పాత్రపై బిగ్ ట్విస్ట్… ఫస్ట్ పార్ట్‌లో ఆమె ఉండదట!