Nagarjuna invites: టాలీవుడ్ నటుడు నాగార్జున బిజిబిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన అమరావతి వెళ్లారు. సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తన కొడుకు వివాహానికి హాజరుకావాలని ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందజేశారు. ఇరువురు కాసేపు పలు అంశాలపై చర్చించుకున్నారు.
అక్కినేని కుటుంబంలో వివాహ వేడుక మొదలుకానుంది. హీరో అక్కినేని అఖిల్ వివాహం జూన్ 6న జరగనుంది. ఈ నేపథ్యంలో వివాహానికి ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు నాగార్జున. మంగళవారం అమరావతి వెళ్లారు. తన కొడుకు వివాహానికి సంబంధించి ఆహ్వానం పత్రికను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు.
సీఎం చంద్రబాబు-నటుడు నాగార్జున ఇరువురు కాసేపు పలు అంశాలపై మాట్లాడు కున్నారు. నార్మల్‌గా సీఎం చంద్రబాబుతో నాగార్జున సమావేశం అయ్యే సందర్భాలు చాలా తక్కువ. ఆయన్ని ముఖ్యమంత్రి ఇంటి వద్ద చూసి షాకయ్యారు పోలీసులు. ఉన్నట్లుండి నాగార్జున ఇటువైపు రావడం ఏంటని చర్చించుకున్నారు కూడా.
అఖిల్ వివాహానికి ఏర్పాట్లు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగు తున్నాయి. గతంలో నాగచైతన్య-శోభిత ధూళిపాళ మ్యారేజ్ అక్కడే జరగడంతో ఆ ప్రాంతాన్ని అక్కినేని ఫ్యామిలీ ఓకే చేసింది. అఖిల్ పెళ్లి చేసుకోనున్న యువతి ఎవరోకాదు. బిజినెస్‌మెన్ జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె జైనబ్. ఒన్స్ అపాన్ ది స్కిన్ అనే స్కిన్‌కేర్ బ్రాండ్‌తో ఎంట్రప్రెన్యూర్‌గా ఓ గుర్తింపు తెచ్చుకుంది ఆమె.
ALSO READ: అమరావతి కోసం మరో 40 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్
గతేడాది నవంబర్ 26న ఆమెతో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. రీసెంట్‌గా నాగార్జున, అమల దంపతులు ఆదివారం (జూన్ 1న) సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ కొడుకు వివాహానికి రావాలని ఆహ్వానించారు. జూన్ 8న రిసెప్షన్ హైదరాబాద్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచే కాకుండా బాలీవుడ్ నుంచి, తెలుగు రాష్ట్రాల రాజకీయ నేతలు హాజరుకానున్నారు. అక్కినేని కుటుంబం ఇప్పటికే ఆహ్వానాలు పంపడం మొదలుపెట్టింది.
సీఎం చంద్రబాబును కలిసిన సినీ నటుడు నాగార్జున
తమ కుమారుడు అఖిల్ వివాహానికి హాజరు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించిన నాగార్జున #NagarjunaAkkineni #ChandrababuNaidu pic.twitter.com/JWNm7r96CM
— BIG TV Breaking News (@bigtvtelugu) June 3, 2025