BigTV English

Allu Arjun Case : సంధ్యా థియేటర్ కేసులో ట్విస్ట్… బన్నికి రేవతి డెత్ ముందే తెలుసా..?

Allu Arjun Case : సంధ్యా థియేటర్ కేసులో ట్విస్ట్… బన్నికి రేవతి డెత్ ముందే తెలుసా..?

Allu Arjun Case : అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ పుష్ప 2.. ఈ మూవీ భారీ సక్సెస్ ను అందుకుంది. కానీ అల్లు అర్జున్ కు ఒకదాని వెంట మరొక సమస్య పలకరిస్తుంది. ఈ మూవీ డిసెంబర్ 4 ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ షో టైమ్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్డు దగ్గరున్న సంధ్య థియేటర్ దగ్గరకు అల్లు అర్జున్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సడెన్ గా ఎంట్రీ ఇచ్చారు. దాంతో ఆయనను చూసేందుకు అభిమానులు ఆతృత కనిపించారు. ఫ్యాన్స్ భారీగా అక్కడకు చేరుకోవడంతో థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది.. అక్కడ ఓ మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది.. మహిళ మృతి చెందడంతో ఆమె బంధువులు సంధ్య థియేటర్ పై, హీరో పై పోలీస్ కేసు పెట్టారు. ఆ కేసులో ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది..


అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రాగానే అభిమానులు ఎగబడ్డారు. ఆ సమయంలో క్రౌడ్ ఎక్కువగా అవ్వడంతో తొక్కిసలాట జరిగింది. మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. అలాగే మరో ముగ్గిరికి గాయాలు తగిలాయని తెలుస్తుంది. అయితే ఇన్ని రోజుల తర్వాత ఓ నిజం వెలుగు చూసింది. పుష్ప -2 ప్రీమియర్ షో కు హీరో, హీరోయిన్స్ చిత్ర యూనిట్ వస్తున్నట్లు పోలీసుల అనుమతిని సంధ్య థియేటర్ యాజమాన్యం కోరినట్లు తెలుస్తుంది. అయితే అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉందని పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదట.. కానీ పోలీసుల మాట వినకుండా అక్కడకు హీరో వచ్చారు. అల్లు అర్జున్ అక్కడకు రావడం మాత్రమే కాదు బయటకు నుంచే ర్యాలీతో వచ్చారు. హీరో రావడంతో ఒక్కసారిగా అభిమానులు అక్కడకు చేరుకున్నారు. దాంతో అక్కడ పరిస్థితి పోలీసుల చెయ్యి దాటిందని తెలుస్తుంది. ఆ క్రౌడ్ వల్ల రేవతి ఆమె కుమారుడు శ్రీతేజ్ స్పృహ కోల్పోయారు. వెంటనే రేవతి కి వారి బాబు శ్రీ తేజ్ కు PCR చేసిన చిక్కడపల్లి పోలీసులు. అనంతరం స్థానిక హాస్పిటల్ కు తరలించారు పోలీసులు.

అయితే హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సమయంలో ఆమె మృతి చెందింది. ఆ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అల్లు అర్జున్ అక్కడ నుంచి సైలెంట్ గా బయటకు పంపించినట్లు తెలుస్తుంది. ఇక మళ్ళీ వెళ్లే సమయం లో కార్ ఎక్కి ర్యాలీ ద్వారా అభిమానులకు అభివాదం తెలిపాడు అల్లు అర్జున్.. ఈ విషయాన్ని అల్లు అర్జున్ ను విచారించిన్నప్పుడు ఆయనే స్వయంగా చెప్పారు. అల్లు అర్జున్ రీమాండ్ వాదనల సమయం ఇదే అంశాన్ని కోర్టు పిపి తెలిపింది. ఆ విషయం వల్లే అల్లు అర్జున్ కు 14 రోజుల జ్యూడిషియల్ రీమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. అయితే ఈ కేసు పై ముందే అల్లు అర్జున్ హైకోర్టు ను ఆశ్రయించాడు.. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన అనంతరం హీరోకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేశారు.. ఈ విషయం ఇంకా కోర్టులో రుజువు కాలేదట.. ఒకవేళ దీనిపై హైకోర్టు విచారణ జరిపిన తర్వాత ఏం జరుగుతుంది? అల్లు అర్జున్ ను మళ్లీ జైలుకు వెళ్తాడా చూడాలి..


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×