Dispatch Movie : బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పేయి (Manoj Bajpayee) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. ‘ఫ్యామిలీ మెన్శి’ సిరీస్ తో ఆయన టాలీవుడ్ ఆడియన్స్ కి దగ్గరైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ‘డిస్పాచ్’ (Despatch Movie) అనే కొత్త మూవీతో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటిదాకా అతన్ని ‘ఫ్యామిలీ మెన్’ గా చూసిన ఆడియన్స్ ‘డిస్పాచ్’ లో మనోజ్ బాజ్ పేయి హద్దులు దాటి నటించడం చూసి షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆ వీడియోలు తెగ వైరల్ అవుతుండడంతో ఏకిపారేస్తున్నారు.
‘ఫ్యామిలీ మెన్’ సిరీస్ ఇప్పటికే రెండు సీజన్లు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్ లో గాని లేదంటే అంతకుముందు సినిమాలలో గానీ ఎక్కడా మనోజ్ బాజ్ పేయి (Manoj Bajpayee) ఇంతటి దారుణమైన సన్నివేశాలలో నటించలేదు. నిజానికి అందరూ ఆయనను ‘ఫ్యామిలీ మెన్’ గానే చూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఓటిటి అంటే ఇలాంటి సీన్లు ఉన్న సిరీస్ లకు కొదవలేదు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. అందరు యాక్టర్స్ చేస్తుంటే నేనేం తక్కువ అనుకున్నాడో ఏమో గాని మనోజ్ ఈ ‘డిస్పాచ్’ సినిమాలో రెచ్చిపోయి మరీ అలాంటి సీన్స్ లో నటించారు.
మనోజ్ బాజ్ పేయి (Manoj Bajpayee) ప్రధాన పాత్రలో నటించిన ఈ ‘డిస్పాచ్’ (Despatch Movie) సినిమా జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. డిసెంబర్ 13న ఈ సిరీస్ రిలీజ్ అయింది. దీనికి తిట్లి, ఆగ్రా వంటి సినిమాలను తీసిన కను బెహళ్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ లో హీరోయిన్ గా షహన గోస్వామి నటించింది. అయితే వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఇంటిమేట్ సీన్స్ చూస్తే నోళ్ళు వెళ్ళబెట్టడం ఖాయం. ముఖ్యంగా మనోజ్ ఈ రేంజ్ లో ఇలాంటి సీన్స్ లో నటిస్తాడని కనీసం ఊహించను కూడా ఊహించలేరు.
ముఖ్యంగా కార్ లో, బెడ్ రూమ్ లో, బాత్రూం లో ఉన్న సీన్స్ ను చూసి ఏకిపారేస్తున్నారు నెటిజన్లు. ఈ మూవీలో దాదాపు షహన గోస్వామి ఒంటిపై నూలు పోగు లేకుండా నటించినట్టు కనిపిస్తోంది. ఆమె ఇప్పటిదాకా గేమ్, రాక్ ఆన్, రా వన్ వంటి సినిమాలో నటించింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి ఇంస్టాగ్రామ్ లో 107కే ఫాలోవర్స్ ఉన్నారు. నిజానికి ఈ ‘డిస్పాచ్’ (Despatch Movie) మూవీ తర్వాతే చాలామంది ఫాలోవర్లు పెరిగారు. 18 ఏళ్ల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉన్న షహానా గోస్వామి గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కానీ ఈ సిరీస్ రిలీజ్ అయ్యాక ఆమె గురించి తెగ వెతుకుతున్నారు. ‘డిస్పాచ్’ మూవీలోని ఆ సీన్లతో ఈ హీరోయిన్ ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది.
కానీ మరోవైపు మనోజ్ బాజ్ పేయి (Manoj Bajpayee) నుంచి ఇలాంటి సన్నివేశాలు ఊహించని నెటిజన్లు బండ బూతులు తిడుతున్నారు. ఏంటి భయ్యా ఈ అరాచకం ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ సీన్లే వైరల్ అవుతున్నాయి. దీంతో చాలామంది ఇక ఓటిటికి కూడా సెన్సార్ పెట్టాల్సిన టైం వచ్చేసింది అంటూ మండిపడుతున్నారు.