సాధారణంగా అభిమాన హీరోల సినిమాలకు సంబంధించి ఏదైనా ఈవెంట్ నిర్వహిస్తున్నారు అంటే.. అభిమానులు వేలాది మంది వచ్చి ఆ ఈవెంట్ ను సక్సెస్ చేస్తారు. అయితే తిరుగు ప్రయాణంలో కూడా అంతే సేఫ్ గా ఇంటికి చేరుకోవాలని, ఎన్టీఆర్ (NTR) లాంటి స్టార్ హీరోలు తమ అభిమానులకు సూచిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎంతో మంది హీరోలు ఈవెంట్ లు నిర్వహించిన తర్వాత తమ అభిమానులు చాలా జాగ్రత్తగా ఇంటికి చేరుకునే వరకు గుండెల్లో రాయిగా టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ అనూహ్యంగా జరిగే పరిణామాలు అటు అభిమానుల కుటుంబాలకే కాదు హీరోలకి కూడా దుఃఖాన్ని మిగిలిస్తూ ఉంటాయి. అంతేకాదు ఫలానా హీరో సినిమా ఈవెంట్ కు వెళ్లి ఫలానా అభిమాని మరణించాడు అనే మచ్చ కూడా హీరోలు మోయాల్సి ఉంటుంది. అందుకే హీరోలు ఎంత జాగ్రత్త పడినా అప్పుడప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి.
వెను తిరుగు ప్రయాణంలో ఇద్దరు ఫ్యాన్స్ మృతి..
ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. జనవరి 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కూడా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దాదాపు లక్ష మందికి పైగా అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరైనట్లు సమాచారం. ఇంత ఘనంగా ఈవెంట్ జరిగింది. తమ అభిమాన హీరోని నేరుగా చూడడానికి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి అభిమానులు ఈ ప్రాంతానికి తరలివచ్చారు. అయితే ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అభిమానులు తిరుగు ప్రయాణం పట్టారు. అందులో ఇద్దరు అభిమానులు రోడ్డు యాక్సిడెంట్లో మరణించినట్టు సమాచారం.
మృతుల కుటుంబాలకు ఆర్థిక సహాయం ప్రకటించిన దిల్ రాజు..
ఇకపోతే వెంటనే స్పందించిన గేమ్ ఛేంజర్ చిత్ర నిర్మాత దిల్ రాజు(Dilraju) ఒక్కొక్క అభిమాని కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక్కడ దిల్ రాజు ఆర్థిక సహాయం చేసిన విషయం కంటే ముందు జాగ్రత్త తీసుకున్నారు అనే విషయం స్పష్టంగా కనిపిస్తోందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇటీవలే ‘పుష్ప 2’ బెనిఫిట్ షో సందర్భంగా రేవతి అనే మహిళ మరణించింది. దీనిపై వెంటనే అల్లు అర్జున్ స్పందించి ఉంటే ఇంత జరిగేది కాదు. కానీ ఆయన స్పందించకపోవడంతో జైలు వరకు వెళ్లొచ్చాడు. ఇక ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకూడదని అటు ప్రభుత్వాలు కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక అందులో భాగంగానే తమ ప్రమేయం లేకపోయినా.. తమ సినిమాకు వచ్చి వెను తిరిగిన సమయంలోనే ఇలా జరిగింది కాబట్టి తన వంతు బాధ్యతగా దిల్ రాజు ఇద్దరికీ ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దిల్ రాజు నిర్మాతగా, శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. జనవరి 10వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.