Formula E Race Case Update: ఫార్ములా ఈ కారు రేసు విచారణ నుంచి తప్పించుకునే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కేటీఆర్. ఏదో ఒకటి చూపించి తప్పించుకునేందుకు ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. ఏసీబీ నోటీసు ఇచ్చినట్టుగా సోమవారం ఉదయం 10 గంటలకు ఆఫీసుకు చేరుకున్నారు కేటీఆర్.
తన న్యాయవాదితో కలిసి ఏసీబీ ఆఫీసులోకి వెళ్లాలని భావించారు. సమీపంలో పోలీసులు.. కేటీఆర్ వాహనాన్ని ఆపారు. అడ్వకేట్లకు లోపలికి అనుమతి లేదని, కేటీఆర్ ఒక్కరికే అనుమతి ఉందన్నారు. ఈ విషయాన్ని ఏసీబీ డీజీతో మాట్లాడి చెబుతామని అన్నారు. అందుకు అధికారులు ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. దీంతో ఏసీబీ ఆఫీసు నుంచి వెనుదిరిగారు కేటీఆర్. అక్కడిని పార్టీ ఆఫీసుకు వెళ్లిపోయారు.
పోలీసులతో మాట్లాడుతున్న సమయంలో కేటీఆర్ కొన్ని కామెంట్స్ చేశారు. చట్టాన్ని గౌరవించే సాధారణ పౌరుడిగా ఏసీబీ కార్యాలయానికి వచ్చానని తెలిపారు. కానీ, రాజ్యాంగబద్ధంగా తనకు దక్కిన హక్కులను కాలరాసేలా విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో భారత రాజ్యాంగం నడుస్తుందా లేదా అంటూ ప్రశ్నించారు.
గతంలో మా పార్టీ నేత నరేందర్ రెడ్డిని విచారణకు పిలిచి అసత్యాలతో కూడిన ఒక స్టేట్మెంట్‌ని మీడియాకు వదిలారని కొత్త డ్రామాకు తెరలేపారు. ఇప్పుడు అదే విధంగా చేసే అవకాశం ఉందన్నారు. అయినా తన వెంట న్యాయవాదులుంటే సమస్య ఏంటో చెప్పాలన్నారు. ఒక పౌరుడిగా న్యాయవాదుల సహకారం తీసుకునే హక్కు లేదనే విషయాన్ని రాత పూర్వకంగా రాసి ఇవ్వాలన్నారు.
ALSO READ: ఫార్ములా ఈ కారు రేసు కేసు.. కేటీఆర్‌ను అడిగే ప్రశ్నలివే
ప్రస్తుతం విచారణ పేరుతో తనను ఇక్కడికి పిలిచి, తన ఇంటిపై దాడులు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు కేటీఆర్. చట్ట వ్యతిరేకమైన వస్తువులను ఉంచే కుట్ర జరుగుతోందన్నారు. తనకు ఏసీబీ ఇచ్చిన నోటీసులకు రాతపూర్వకంగా సమాధానం ఇచ్చేందుకు వచ్చానని వివరించారు. లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు తెలిపారు కేటీఆర్.
కేటీఆర్ వ్యవహారశైలిపై నోరు విప్పారు ఏసీబీ అధికారులు. న్యాయవాదులను తీసుకువచ్చి హైడ్రామా క్రియేట్ చేసారంటున్నారు. విచారణను తప్పించుకోవడానికి న్యాయవాదులను తీసుకొచ్చారని అంటున్నారు. హైకోర్టు ఆదేశాలను ఆయన ఉల్లంఘించారని తెలిపారు. దర్యాప్తుకు సహకరించాలని న్యాయస్థానం చెప్పినా వినలేదని, ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్తామంటున్నారు ఏసీబీ అధికారులు. ఈ నేపథ్యంలో మరోసారి నోటీస్ ఇవ్వాలని భావిస్తోంది ఏసీబీ.
ఏసీబీ కార్యాలయం నుంచి పార్టీ ఆపీసుకు చేరుకున్నారు కేటీఆర్. అక్కడ న్యాయవాదులతో సంప్రదింపుల జరిపిన తర్వాత తదుపరి అడుగులు వేయనున్నారు. విచారణకు కేటీఆర్ వస్తారా? లేదా? అనేది వెయిట్ అండ్ సీ.