BigTV English

NTR-Prasanth Neel : ఎన్టీఆర్ మూవీలో ఇద్దరు స్టార్ నటులు.. నీల్ మామ నువ్వు కేక..

NTR-Prasanth Neel : ఎన్టీఆర్ మూవీలో ఇద్దరు స్టార్ నటులు.. నీల్ మామ నువ్వు కేక..

NTR-Prasanth Neel : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆ సినిమా మిక్స్డ్ టాక్ ని అందుకుంది. కలెక్షన్స్ మాత్రం బాగానే వసూల్ చేసింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వార్ 2 ను చేస్తున్నాడు. బాలీవుడ్ ప్రముఖ స్టార్ హృతిక్ రోషన్తో పోటీ పడబోతున్నాడు. ఈ సినిమా తర్వాత తెలుగులో ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయనున్నాడని ఎప్పుడో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో వినిపిస్తుంది. ఈ మూవీని సంక్రాంతి తర్వాత సెట్స్ మీదకు తీసుకెళ్లే ఆలోచనలో ప్రశాంత్ నీల్ ఉన్నారని టాక్.. తాజాగా మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన ఇద్దరు భామలు నటించబోతున్నారని తెలుస్తుంది. ఆ ఇద్దరు ఎవరో తెలుసుకుందాం..


ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ తర్వాత కొరటాల శివ కాంబోలో దేవర మూవీ చేశాడు. ఆ మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. కానీ కలెక్షన్స్ పరంగా దుమ్ము దులిపేసింది.. ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ బాలీవుడ్ ఓ సినిమా చేస్తున్నాడు. స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. చివరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటుంది.. సమ్మర్ లో రిలీజ్ కాబోతుంది. ఇక ఈ మూవీ తర్వాత సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.. ఈ మూవీ గురించి ఈ మధ్యనే అనౌన్స్ చేశారు. ఇప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు.

మలయాళం స్టార్స్..? 


స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సిరీస్ లను తెరకేక్కించారు. ఆ మూవీస్ కన్నడతో పాటుగా అన్ని ఇండస్ట్రీలలో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన ప్రభాస్ సలార్ తో మరో రికార్డు ను బ్రేక్ చేస్తూ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్నాడు. మైత్రీ మూవీస్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. ఈ నెల మూడో వారంలో కర్ణాటకలో తొలి షెడ్యూల్‌ మొదలు కానుందని తెలిసింది. ఇక ఎన్టీఆర్‌ వచ్చే నెలలో సెట్స్‌లోకి అడుగు పెట్టనున్నారని సినీ వర్గాల నుంచి సమాచారం. ఈ మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ లో తారక్‌ ఇంతకుముందు చేయని పవర్ ఫుల్ పాత్రలో సందడి చేయనున్నారు.. హీరోయిన్ గా రుక్మిణీ వసంత్ ను ఫిక్స్ చేశారు. అలాగే రెండు కీలక పాత్రల కోసం మలయాళం నుంచి టోవినో థామస్, బీజూ మీనన్ ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.. వచ్చే ఏడాదికి ఈ మూవీని ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. సమ్మర్ లేదా దసరాకు మూవీని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×