AB de Villiers: బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన ఐదవ టెస్ట్ కి ముందు భారత డ్రెస్సింగ్ రూమ్ లో ఏదో జరుగుతుందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వినిపించిన విషయం తెలిసిందే. సిడ్నీ టెస్ట్ కి ముందు కోచ్ గౌతమ్ గంభీర్ – భారత ఆటగాళ్ల మధ్య విభేదాలు తలెత్తినట్లు రూమర్స్ వినిపించాయి. భారత ఆటగాళ్లు వ్యూహం ప్రకారమే ఆడలేదంటూ వాళ్లపై గంభీర్ మండిపడ్డట్లుగా ఈ న్యూస్ వెలువడ్డాయి.
Also Read: Sunil Gavaskar: గవాస్కర్ ను అవమానించిన ఆస్ట్రేలియా?
ఆ సందర్భంలో కోచ్ కి, ఆటగాళ్లకి మధ్య జరిగిన చర్చలు మీడియాకు లీక్ అవడంపై కోచ్ గంభీర్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. డ్రెస్సింగ్ రూమ్ చర్చలు అక్కడికే పరిమితం కావాల్సిందేనని.. అవి బయటకు రాకూడదని కోచ్ గౌతమ్ గంభీర్ స్పష్టం చేశారు. ఆ చర్చలు ఆటగాళ్ల ప్రదర్శన పైనేనని, అక్కడ ఆట తీరుపై నిజాయితీగానే చర్చిస్తామని తెలిపాడు. తాము ఎలా గెలవాలన్న దాని పైనే డ్రెస్సింగ్ రూమ్ లో చర్చించామని.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో వ్యక్తిగతంగా ఎటువంటి విషయాలు మాట్లాడలేదని గంభీర్ చెప్పుకొచ్చారు.
అయితే ఈ చర్చల అనంతరం అనూహ్యంగా సిడ్నీలో జరిగిన చివరి టెస్ట్ కి రోహిత్ శర్మ దూరమయ్యాడు. వరుస ఓటములు, పేలవ ఫామ్ తో బాధపడుతున్న రోహిత్ శర్మని పక్కన పెట్టాలని మేనేజ్మెంట్ నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. కానీ తనంతట తానే ఐదవ టెస్ట్ నుంచి తప్పుకున్నానని రోహిత్ శర్మ ప్రెస్ మీట్ లో స్పష్టం చేశాడు. అయితే తాజాగా సౌత్ ఆఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబి డివిలియర్స్ భారత డ్రెస్సింగ్ రూమ్ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశాడు.
భారత డ్రెస్సింగ్ రూమ్ లో ఏదో జరుగుతుందని అనుమానం వ్యక్తం చేశాడు. నిప్పు లేనిదే పొగరాదని ఆయన పేర్కొన్నారు. విదేశాలకు వెళ్లి ఆడేటప్పుడు ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుందని.. కుటుంబాన్ని వదిలేసి వారాల తరబడి ఉండడం వారిని కుంగదీస్తుందని అన్నారు ఏబీ డివిలియర్స్. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వరుస ఓటములు భారత ఆటగాళ్లలో విభేదాలు సృష్టించి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశాడు.
Also Read: Rishi Dhawan Retirement: రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఆల్ రౌండర్ !
క్రికెటర్లు అత్యుత్తమ ఆట ఆడినప్పుడు ఇలాంటి రూమర్స్ సహజమేనని చెప్పుకొచ్చాడు. అలాగే విరాట్ కోహ్లీ ఆట తీరుపై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ తన కెరీర్ ని తన చేజేతులా నాశనం చేసుకుంటున్నాడని అన్నాడు. ప్రతి బంతిపై ఫోకస్ చేయలేక కష్టాలు కొని తెచ్చుకుంటున్నాడని.. అతడు ఏయే తప్పులు చేస్తున్నాడో గ్రహించి సరిదిద్దుకోవాలని సూచించాడు. అలాగే తన మైండ్ ని కూడా రీసెట్ చేసుకోవాలని సూచించాడు.
Australia have won the #BGT to book a spot in the #WTCFinal against my Proteas. Hop on to today’s #360Live and let’s talk about what went wrong for India and what else is on in the world of cricket… https://t.co/OydSB92xZE
— AB de Villiers (@ABdeVilliers17) January 5, 2025