Marco movie Trailer:ప్రముఖ మలయాళ యంగ్ హీరో ఉన్ని ముకుందన్(Unni mukundan) మొదటిసారి ఎన్టీఆర్ (NTR ) హీరోగా నటించిన ‘జనతా గ్యారేజ్’ సినిమాలో నటించి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తర్వాత అనుష్క (Anushka) ‘భాగమతి’ , రవితేజ (Raviteja) ఖిలాడి సినిమాలలో కూడా నటించి మెప్పించిన ఈయన.. సమంత (Samantha) లేడీ ఓరియంటెడ్ గా వచ్చిన ‘యశోద’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. చివరిగా యశోద సినిమాతో ఆకట్టుకున్న ఈయన.. ఇప్పుడు నటించిన చిత్రం మార్కో(Marco). హనీఫ్ అదేని (Hanif Adeni) దర్శకత్వం వహిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాను క్యూబ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై షరీఫ్ మహమ్మద్ నిర్మించారు. ఇందులో యుక్తి తరేజా, కబీర్ దుహాన్ సింగ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే కేరళలో విడుదలైన ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాను ‘ఎన్వీఆర్ సినిమాస్’ తెలుగులో జనవరి ఒకటవ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. విడుదలకు కేవలం మూడు రోజులే ఉన్న నేపథ్యంలో సినిమాపై అంచనాలు పెంచడానికి తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్.
ఆకట్టుకుంటున్న మార్కో ట్రైలర్..
తాజాగా మూవీ మేకర్స్ విడుదల చేసిన మార్కో తెలుగు ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ట్రైలర్ ప్రారంభం అవ్వగానే.. “జీవితంలో మనల్ని బాధపెట్టే విషయం ఏమిటో తెలుసా? మన కళ్ళముందే మనకు ఎంతో ఇష్టమైన వాళ్లను చిత్రహింసలు పెట్టి చంపడం” అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతుంది. ఇందులో ఉన్ని ముకుందన్ వేట మొదలుపెట్టి, శత్రువులతో భీకరంగా యుద్ధం చేస్తాడు. చివరికి కత్తితో అందరినీ నరికేసి నోట్లో ఏదో ముక్క పెట్టుకొని రక్తంతో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ మార్కో ట్రైలర్ ప్రేక్షకులలో ఆసక్తిని విపరీతంగా పెంచుతోంది. ఇందులో ఉన్ని ముకుందన్ చాలా వైల్డ్ లుక్ లో కనిపించారు. సాఫ్ట్ కార్నర్ లో చూసిన ఉన్ని ముకుందన్ ను ఒక్కసారిగా వైల్డ్ లుక్ లో చూసేసరికి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మార్కో మూవీ కచ్చితంగా విజయం సాధిస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
ఉన్ని ముకుందన్ సినిమాలు..
ఉన్ని ముకుందన్ తొలిసారి 2011లో ‘సీదన్’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక తర్వాత పలు చిత్రాలలో నటించే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన చివరిగా 2022లో మాలికాపురం సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు మార్కో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటివరకు ఈయన నటించిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.