Chiranjeevi : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పెద్దదిక్కు ఎవరు అంటే అందరూ ఆలోచనల్లో మరియు మాటల్లో వినిపించే మొదటి పేరు మెగాస్టార్ చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి అన్నిటికీ హాజరవ్వకపోవచ్చు కానీ కన్నీటికి మాత్రం తప్పకుండా హాజరవుతారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు మరణించినప్పుడు మెగాస్టార్ వెళ్లి ఆ కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలియజేసి ఓదార్పునిచ్చిన రోజులు ఉన్నాయి. కేవలం సినిమా పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే కాకుండా, కొంతమంది రాజకీయ ప్రముఖు వ్యక్తుల కుటుంబ సభ్యులు మరణించినప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి తమ సంతాపాన్ని తెలియజేసి కుటుంబాలకి ఓదార్పుని ఇస్తారు.
ఇక కొద్దిసేపటి క్రితమే కడప జిల్లా టిడిపి సీనియర్ నాయకులు ఎమ్మెల్సి రామచంద్రయ్య తనయుడు సి.విష్ణు స్వరూప్ హైదరాబాద్ లో గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా విష్ణుస్వరూప్ మరణించారు. రామచంద్రయ్య కుటుంబాన్ని సినీ నటుడు చిరంజీవి పరామర్శించారు.
ఎమ్మెల్సీ రామచంద్రయ్య విషయానికి వస్తే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీలుగా వైకాపాకు రాజీనామా చేసి తెదేపాలో చేరారు. తెదేపా సీనియర్ నేత సి. రామచంద్రయ్యకు ఎన్డీఏ కూటమి మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. రామచంద్రయ్య కుమారుడు విష్ణుస్వరూప్ మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న విష్ణుస్వరూప్ గుండెపోటుతో మరణించడంపై సీఎం విచారం వ్యక్తం చేశారు. కుమారుడి మృతితో విషాదంలో ఉన్న రామచంద్రయ్య కుటుంబానికి దేవుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరారు. రామచంద్రయ్య కుటుంబ సభ్యులకు సీఎం చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.