Bank of Baroda: బ్యాంకింగ్ ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1267 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ (bankofbaroda.in) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 1267
బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్మెంట్- పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి.
దరఖాస్తు ప్రారంభ తేది: 2024 డిసెంబర్ 28
దరఖాస్తు చివరి తేది: 2025 జనవరి 17
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి విద్యార్హతలున్నాయి. అభ్యర్థులు సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. పలు ఉద్యోగాలకు బీటెక్ఎం బీఏ/సీఏ/సీఎఫ్‌ఏ వంటి కోర్సులు ఉంటే ప్రాధాన్యత ఉటుంది. కొన్ని పోస్టులకు నిర్దిష్ట అనుభవం కూడా అవసరం ఉంటుంది.
Also Read: Central Bank Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్స్.. ఎగ్జామ్ లేదు..!
ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా జరుగుతుంది.
దరఖాస్తు ఫీజు: ఈడబ్ల్యూఎస్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు రూ.600(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి)
అఫీషయల్ వెబ్‌సైట్: https://ibpsonline.ibps.in/bobsodec24/
జీతం: ఉద్యోగాన్ని బట్టి రూ.48,480 నుండి రూ. 1,35,020 వరకు ఉంటుంది .
ఈ బ్యాంకు ఉద్యోగం పొందిన వారికి అదనపు ప్రయోజనాలు కూడా ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్, లీవ్ సదుపాయాలు, పెన్షన్ ,ప్రావిడెంట్ ఫండ్ వంటి ప్రయోజనాలను పొందవచ్చు.