BigTV English

Heeramandi Trailer: వేశ్యలుగా మారిన స్టార్ హీరోయిన్లు!

Heeramandi Trailer: వేశ్యలుగా మారిన స్టార్ హీరోయిన్లు!
Heeramandi
Heeramandi

Heeramandi Trailer Released: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గంగూభాయ్ కతియావాడీ లాంటి సినిమాతో ఎన్నో అవార్డులను అందుకున్న ఈ డైరెక్టర్ మరోసారి అలాంటి కథతోనే ఓటిటీ ఎంట్రీ ఇస్తున్నాడు. హీరామండి: ది డైమండ్ బజార్.. ఈ సిరీస్ ను ఎప్పుడైతే నెట్ ఫ్లిక్స్ అనౌన్స్ చేసిందో అప్పటినుంచి దీనిపై ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు అభిమానులు. మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావ్ హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్, షార్మీన్ సేగల్ లాంటి స్టార్ హీరోయిన్లను రంగంలోకి దింపాడు.


ఒక్క అందగత్తెను చూడడానికే కళ్లు సరిపోవు అంటే.. దాదాపు అరడజను అందగత్తెలతో ఒక సిరీస్ ప్లాన్ చేస్తే.. ప్రేక్షకులు ఆగుతారా.. ? ఇక ఈ సిరీస్ నుంచి విడుదలైన ప్రతి పోస్టర్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నేడు ఉగాది పండగ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఈసిరీస్ అంతా స్వాతంత్య్రం రాకముందు జరిగినట్లు తెలుస్తోది. బ్రిటిష్ రాజులు పాలించే కాలంలో లాహోర్ లోని హీరామండీ అనే వేశ్యా గృహంలో ఉన్న వేశ్యలు.. తమ స్వేచ్ఛ కోసం , స్వాతంత్య్రం కోసం ఏం చేశారు.. ? ఎన్ని కష్టాలు అనుభవించారు అన్నదే ఈ సిరీస్.

Also Read: Update on F3 Movie: ఎఫ్ 3 కాంబో.. ఇక అధికారికం!


ఆడవారికి విలువ కూడా ఇవ్వని పురుషుల మధ్య ఈ వేశ్యలు ఎలాంటి బాధలు పడ్డారు.. చివరికి తమ స్వేచ్ఛను దక్కించుకున్నారా.. ? లేదా.. ? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే. ఈ అందమైన హీరోయిన్లు మహారాణులుగా దర్శనమిచ్చారు. వేశ్య గృహ పెద్దగా మనీషా కొయిరాలా కనిపించింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. మే 1 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. మరి ఈసారి సంజయ్ లీలా భన్సాలీ.. ఈ మహారాణులతో కలిసి ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×