Big Stories

Upasana : హీరో ఆఫ్ ది ఇయర్ అతడే.. ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

Share this post with your friends

Upasana : టాలీవుడ్ హీరో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తూ ఉంటారు. విదేశీ టూర్ల విశేషాలను షేర్ చేస్తారు. అలాగే రామ్ చరణ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ ఉంటారు. తాజాగా ఉపాసన చెర్రీ గురించి చాలా విషయాలు చెప్పారు. ఈ ఏడాది తానెంతో ఆనందంగా ఉన్నానని తెలిపారు.

ఉపాసన చెప్పిన సంగతులు ఇవే..
తన జీవితంలో ప్రతి సందర్భంలోనూ రామ్ చరణ్ మద్దతుగా నిలిచాడని ఉపాసన ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చారు. తాను కూడా చెర్రీకి అన్ని విషయాల్లో సపోర్ట్‌గా ఉన్నానని పేర్కొన్నారు. షూటింగ్ కోసం వెళ్లినా, ఇంట్లోనైనా ఇలా ఎక్కడైనా సరే చెర్రీకి వెన్నంటే ఉన్నానని చెప్పారు. తాను చెర్రీకి ఎంతో సహాయ పడుతుంటానని అన్నారు. ఇక చరణ్‌కు ఈ ఏడాది ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, తన వర్క్‌పరంగా ఎంతో సంతృప్తిగా ఉన్నాడని ఇలా చాలా విషయాలను ఉపాసన పంచుకున్నారు. ఈ సంవత్సరం చరణ్‌ ఎన్నో ప్రశంసలను అందుకున్నాడని.. ఈ ఏడాది తనదేనని స్పష్టం చేసింది.

రామ్‌ చరణ్‌ సినిమాల ప్రమోషన్స్‌ లో ఉపాసన చురుగ్గా పాల్గొంటారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్ తో కలిసి విదేశాల్లో సందడి చేశారు. నాటు నాటు పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వచ్చిన సమయంలో ఉపాసన, చరణ్‌తో కలిసి సందడి చేశారు. కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్‌ వేదికగా జరిగిన ఆ అవార్డుల ప్రదానోత్సవంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్ తోపాటు ఉపాసన పాల్గొన్నారు. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ అమెరికాలో ఉన్నాడు. అక్కడ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా రీ రిలీజ్ అయిన సందర్భంగా ఆడియన్స్‌తో కలిసి ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఈ సమయంలో ఉపాసన చెర్రీ గురించి ఇలా చాలా ఇంట్రెస్ట్ విషయాలు చెప్పడం ఫ్యాన్స్ లో మరింత ఉత్సాహం నింపింది. ఉపాసన చెప్పిన చెప్పినట్టుగానే హీరో ఆఫ్ ది ఇయర్ రామ్ చరణే అని అభిమానులు అంటున్నారు. ఈ ఏడాదే చెర్రీ తండ్రి కాబోతున్న విషయాన్ని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Latest News