Sai Pallavi: ప్రముఖ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) తన నటనతో, డాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఎంతోమంది యంగ్ హీరోలతో నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమె.. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత చేసిన కామెంట్లు విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనేను సాయి పల్లవి పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పాకిస్థాన్ కి పారిపో అంటూ లేడీ పవర్ స్టార్ కి ఉప్పల్ బాలు (Uppal balu) బ్యాచ్ వార్నింగ్ ఇస్తూ.. ఒక వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఒళ్ళు దగ్గర పెట్టుకో.. లేకపోతే పాకిస్తాన్ కి పార్సిల్ చేస్తాం – వైజాగ్ సత్య
ఇక ఆ వీడియోలో ఉప్పల్ బాలు బ్యాచ్ వైజాగ్ సత్యం మాట్లాడుతూ.. “సాయి పల్లవి.. తమిళ నటి.. ఈమె గురించి అందరికీ తెలుసు కదా.. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అవుతోంది. బాలనటిగా చిన్నప్పటి నుంచే ఇండస్ట్రీలోనే కొనసాగుతోంది. ఈమె నటన ఏమంత బాగుండదు. అందుకే తమిళనాడు గవర్నమెంట్ నుంచి కూడా ఈమెకు ఏ అవార్డు రాలేదు. సొంత రాష్ట్రం నుండే రాలేదు. ఇక మన రాష్ట్రం నుండి ఈమెకు ఏమి అవార్డు వస్తుంది. ఇక నేషనల్ అవార్డు కూడా రాలేదు. ఈమె పెద్ద నటి ఏమి కాదు. ఇక డాన్స్ అంటారా మాలాంటి వాళ్ళ వద్ద కాపీ కొట్టి , ఏదో కొద్దో గొప్పో పేరు తెచ్చుకుంది.ఈమేమి ఐశ్వర్యరాయ్ లాగా పెద్ద అందగత్తె కూడా కాదు. ఆమె ఫేస్ ఎలా ఉంటుందో తెలుసా పాకిస్తాన్లో గుంతల రోడ్లు ఉంటాయి కదా.. అలా ఉంటుంది. ఈమె ఇప్పుడు ఏమంటుంది.. మనం పాకిస్తాన్ వాళ్లను టెర్రరిస్టులు అనకూడదు అంట.. అలా అంటే వాళ్లు కూడా మనల్ని టెర్రరిస్టులు అంటారు అంటోంది. మరి అలాంటి పాకిస్తాన్ కి వెళ్ళిపోవచ్చు కదా.. కరాచీ బేకరీ పెట్టుకోవచ్చు కదా. అక్కడే బతుకవచ్చు కదా.. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. లేదంటే మేమందరం నిన్ను పార్సిల్ చేసి పాకిస్థాన్లో వదిలేస్తాం.. సాయి పల్లవి కన్నన్ ఒళ్ళు దగ్గర పెట్టుకో” అంటూ కామెంట్లు చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారుతోంది.
also read: Trisha Krishnan: హీరోయిన్ కాకపోయింటే ఏమయ్యేదో తెలుసా..అందుకేనా ఇదంతా..?
పాపులారిటీ కోసమేనా..?
ఇదంతా ఇలా ఉండగా ఈ వీడియో వైరల్ అవుతుండడంతో పలు అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. ఈరోజు సాయి పల్లవి పుట్టినరోజు.. సాయి పల్లవి ఈ మాటలు ఇప్పుడు అన్నవి కాదు.. ఎప్పుడో గతంలో అన్నవి. పైగా ఇప్పుడు పాకిస్తాన్ – భారతదేశం మధ్య యుద్ధం జరుగుతోంది. ఇలాంటి సమయంలో అదును చూసే ఆమెను టార్గెట్ గా చేసుకొని పాపులారిటీ సంపాదించుకోవడానికి ఉప్పల్ బాలు బ్యాచ్ చేసిన ప్రయత్నమే ఈ వీడియో అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా పాపులారిటీ కోసం ఇంత దిగజారుతారా అంటూ ఉప్పల్ బాలు బ్యాచ్ పై నెటిజన్స్ ఫైర్ అవుతూ పలు రకాల కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. సాయి పల్లవి ఫాన్స్ దాడికి ఉప్పల్ బాలు తట్టుకుంటుందో లేదో.