Trisha Krishnan: అందాల తార ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష (Trisha Krishnan) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి జతకట్టిన ఈమె, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా అంతే బిజీగా దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వరుసగా సీనియర్ హీరోలతో అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. ఇటీవలే విజయ్(Vijay ), విక్రం (Vikram) వంటి హీరోల సరసన నటించిన ఈమె.. ఇప్పుడు మళ్లీ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తో ‘విశ్వంభర’ సినిమా కోసం పనిచేస్తోంది. ఈ సినిమా వచ్చే నెల విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మరో కొంతమంది సీనియర్ హీరోలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ సినిమాలన్నీ కూడా హిట్ అయితే త్రిష కెరియర్ కి ఇంకో కొన్ని ఏళ్లు తిరుగుండదు అని చెప్పవచ్చు. వయసుతో సంబంధం లేకుండా ఎంతమంది ఇండస్ట్రీలోకి వచ్చినా.. తనకు పోటీ లేదంటూ వ్యవహరిస్తోంది. అంతేకాదు కొత్త అవకాశాలు కూడా అందుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది త్రిష.
నటి కాకపోయి ఉండుంటే సైకాలజిస్ట్ అయ్యేదాన్ని – త్రిష
ఇకపోతే నటిగా త్రిష ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవాన్ని కూడా సంపాదించుకుంది. ఇకపోతే ఇదంతా కాస్త పక్కన పెడితే.. నటిగా త్రిష సక్సెస్ కాకపోయి ఉంటే.. ఇంకే రంగంలో ఉండేది? అనే ప్రశ్న ఆమె ముందు నిలవగా.. దీనికి ఈమె చెప్పిన సమాధానం విని అందరూ ఆశ్చర్యపోతున్నారు. త్రిష మాట్లాడుతూ..” నటిగా నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకపోయి ఉండి ఉంటే, మంచి సైకాలజిస్ట్ అయ్యేదాన్ని. నటన కంటే ముందే సైకాలజిస్ట్ అవ్వాలని అనుకున్నాను. ఆ రకమైన చదవులు కూడా పూర్తి చేశాను. అయితే అదే సమయంలో అందాల పోటీలు ఏర్పాటు చేయడం.. అత్యుత్సాహంతో పాల్గొనడం , అక్కడ సక్సెస్ అవ్వడంతో.. మళ్లీ యాడ్స్ లో నటించే అవకాశం రావడం.. అదే సమయంలో సినిమాలకు కూడా అవకాశం రావడంతో.. నేను ఊహించని విధంగా నా జీవితం ఒక కొత్త మలుపు తీస్తోంది. ఇక అదే నన్ను ఈ స్టేజ్ కి తీసుకొస్తోందని ఊహించలేకపోయాను అంటూ త్రిష తెలిపింది.
also read: India vs Pakistan: భీకర యుద్ధ వేళ ఆర్మీలో ఉన్న తండ్రి కోసం కమెడియన్ పోస్ట్..!
త్రిష సినిమాలు..
మొత్తానికైతే నటి కాకపోయి ఉండుంటే సైకాలజిస్ట్ గా మారేది త్రిష. అందుకేనేమో ఆ ఆలోచనలన్నింటినీ తన మనసులో పెట్టుకొని, ఇప్పుడు పెళ్లి పై తనమీద ఎన్ని రూమర్స్ వినిపించినా.. అన్నింటిని తేలికగా తీసుకుంటూ హ్యాపీగా సంతోషంగా కెరియర్ ను లీడ్ చేస్తోంది త్రిష. త్రిష సినిమాల విషయానికొస్తే.. ‘నీ మనసు నాకు తెలుసు’ అనే తెలుగు చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తర్వాత ప్రభాస్ తో వర్షం, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా, అతడు, పౌర్ణమి, స్టాలిన్ వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇకపోతే ఇండస్ట్రీకి వచ్చి రెండు దశాబ్ధాలకు పైగానే అవుతున్నా.. తెలుగులో కెరియర్ ను కొనసాగిస్తోంది. ఇప్పటికే యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తోంది త్రిష. మొత్తానికి అయితే త్రిష కు సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.