BigTV English

Peace of Mind: మానసిక ప్రశాంతత కావాలా? అయితే ఇది మీ కోసం..

Peace of Mind: మానసిక ప్రశాంతత కావాలా? అయితే ఇది మీ కోసం..

Peace of Mind: ప్రస్తుత కాలంలో మానసిక ప్రశాంతత అందరికి కరువై పోయింది. ఉదయం లేచింది మొదలు.. బిజీ బీజీగా లైఫ్ సాగుతుంది. పల్లెటూర్లు అయినా పట్నాలైనా ప్రస్తుతం ఎవరు పనులు వాళ్లవే అయ్యాయి. ఒత్తిడి లేకుండా ఏ పనీ ఉండటం లేదు. ఇలా బయటకు వెళ్లాక అనేక టెన్షన్స్ ఉంటాయి. తిరిగి ఇంటికి వచ్చాక కూడా వాటి ఒత్తిడి కాస్తైనా కనిపించక మానదు. కానీ వాటిని పక్కకు పెట్టి ఇంట్లో ప్రశాంతంగా ఉండాలని ఎవరైనా సరే అనుకుంటూ ఉంటారు. కానీ కొందరి ఇళ్లల్లో అది కరువు అవుతుంది. దీంతో భార్య భర్తల మధ్యల మనస్పర్థలు, గొడవలు ఇలా ఉంటూ ఉంటాయి.


యోగా, ధ్యానం చేయాలి

ఆవేశం, ఆతృత వంటివి ఎప్పటికీ ప్రమాదమే. మనపై మనకు కంట్రోల్ ఉండాలి. యోగాసనాలు… మనలో కోపం, ఉద్రేకం తగ్గిస్తాయి. నిద్ర బాగా పట్టేలా చేస్తాయి. పాజిటివ్ ఆలోచనలను పెంచుతాయి. తద్వారా ఒత్తిడి సమయాల్లో మీరు టెన్షన్ పెంచుకోకుండా… నిలకడగా ఉండగలుగుతారు. యోగా వల్ల ఆత్మ, మనసు, శరీరం అన్నీ బాగవుతాయని అంటారు. యోగా చేయడం వల్ల రక్త నాళాల్లో ఆక్సిజన్ పెరుగుతుంది. ఇది ఆస్తమా లక్షణాలను తగ్గిస్తుంది. ఒత్తిడి, టెన్షన్, ఆత్రుత వంటివి తగ్గుతాయి. మానసికంగా ఫిట్ అవుతారు.


పక్కవారి మీద దృష్టి తగ్గించాలి

ప్రస్తుత కాలంలో చాలా మంది పక్కవారి మీద దృష్టి ఎక్కువగా పెడుతుంటారు.. దీని వల్ల మన ఆరోగ్యం పాడవుతుంది తప్ప.. వారికి ఏమి జరగదు. ఏవరైన ఏమన్నా అంటే నువ్వు అది పట్టించుకోవాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే పని లేని వాళ్లు, నువ్వు అంటే పడని వాళ్లు చాలా అంటారు.. వాటన్నింటిని నువ్వు దాటి ముందుకు వెళ్లాలి. అంతే తప్ప వారు ఏదో అన్నారు అని నువ్వు అక్కడే ఆగి పోతే నీకే నష్టం జరుగుతుంది. దీంతో నీ అనారోగ్యం పాడవుతుంది.

చాలా మంది కొందరు మంచిగా ఉంటే తట్టుకోలేక లేని విషయాల్లో ఆసక్తి చూపించి వారిని మానసికంగా ప్రశాంతత లేకుండా చేస్తుంటారు. ఇలాంటి వాటిని పట్టించుకోని మీరు ఒత్తిడికి గురైతే.. మీ ప్రశాంతతే తగ్గుతుంది. ముఖ్యంగా ఇవి గుర్తించుకోవాలి..

ఆడేమనుకుంటాడో,
ఈడేమనుకుంటాడో కాదు..
నువ్వేమనుకుంటున్నావో అదే చేసేయ్..
నిన్ను అన్నోడెవడు నీకు కష్టం వస్తే సాయం చేయడు.
ఇష్టమో.. కష్టమో.. నష్టమో ఏదైనా
నీకు అనుభవాన్నిస్తుంది తప్ప
నీవు ఏవరి మాట పట్టించుకోవాల్సిన అవసరం లేదు..

శాంతంగా ఉంటేనే జీవితంలో మీరు దృఢంగా ఉండగలరు గుర్తించుకోండి..
చల్లగా ఉన్నప్పుడు
అత్యంత దృఢంగా ఉండే ఇనుము కూడా..
వేడెక్కితే బలహీనం అయిపోతుంది.. జాగ్రత్తా..

అన్నింటికంటే ఇది బాగా గుర్తించుకోండి.. దారిలో వెళుతున్న కుక్క మనల్ని చూసి బాగా మోరుగుతుంది.. అలా అని వాటిని పట్టించుకుంటే మన ప్రశాంతతే తగ్గుతుంది. సో.. మనం మన ఆరోగ్యం.. మన జీవితం.. గురించి మాత్రమే ఆలోచించాలి. దీంతో మన మనస్సు ప్రశాంతంగా.. ఒత్తిడి లేకుండా.. ఆరోగ్యంగా ఉంటుంది.

సమయం గడపడం

మీకు ఇష్టమైన పని చేయడంలో సమయం గడపడం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు.. మీకు నచ్చిన పనిని చేయడం ద్వారా మీరు ఆనందించవచ్చు, మీ మనస్సును ప్రశాంతంగా ఉంచవచ్చు. అలాగే తగినంత నిద్ర తీసుకోవడం మానసిక ప్రశాంతతను పెంచడానికి సహాయపడుతుంది.

Also Read: నల్లేరా.. మజాకా..! నయం కాని రోగాలకు సంజీవని..!

నవ్వడం

నవ్వడం ఓ భోగం, నవ్వించడం ఓ యోగం. నవ్వకపోవడం ఓ రోగం అన్నారు పెద్దలు. కొన్నిసార్లు నవ్వు అనేది ఉత్తమ ఔషధంగా పని చేస్తుంది. మానసిక స్థితిని పెంపొందించుకోవడానికి టీవీ షో లేదా మూవీని చూస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు. స్నానం చేస్తున్నప్పుడు పాడడం వల్ల కూడా మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. డ్యాన్స్ చేసినా కూడా మనలోని ఒత్తిడి స్థాయిని కంట్రోల్ చేసుకోవచ్చని పేర్కొంటున్నారు.

ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో సమయాన్ని గడపడం

మన వర్క్ అయ్యాక కచ్చితంగా ప్రతి రోజు ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీతో సమయాన్ని గడపడం వల్ల మానసికంగా మేలు కలుగుతుంది. ఇలా చేయడం వల్ల వారిపై మనకు సానుకూల దృక్పథం పెరుగుతుంది. మన వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకోడానికి కూడా దోహదం చేస్తుంది. మనం ఒంటరిగా ఫీలైనప్పుడు వీడియో కాల్ ద్వారా వారితో మాట్లాడితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

Related News

Nail Biting: తరచూ గోళ్లు కొరుకుతున్నారా ? అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్లే !

Causes Of Anger: ప్రతి చిన్న విషయానికీ కోపం వస్తుందా.. ? కారణాలివే !

Longtime Sitting: ఆఫీసులో ఎనిమిది నుంచి పది గంటలు కూర్చుంటున్నారా? అయితే ఈ వ్యాధి త్వరలోనే వచ్చేస్తుంది

Weight Loss Tips: ఉదయం పూట ఇలా చేస్తే.. ఈజీగా వెయిట్ లాస్

Strawberries: డైలీ స్ట్రాబెర్రీలు తింటే.. శరీరంలో జరిగే మార్పులివే !

Open Pores On Face: ఓపెన్ పోర్స్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా ?

Big Stories

×