BigTV English

India Pakistan War: పాక్‌పై బాంబుల వర్షం.. ఎంత మంది చనిపోయారంటే

India Pakistan War: పాక్‌పై బాంబుల వర్షం.. ఎంత మంది చనిపోయారంటే

India Pakistan War: పహల్గామ్‌లో పాక్ ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. అమాయకుల ప్రాణాలు తీశారు. కౌంటర్‌గా.. భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాక్ సైలెంట్‌గా ఉంటే.. ఇక్కడితో ఇదంతా ఆగిపోయేది. కానీ.. పాకిస్తాన్ బలుపు తగ్గలేదు. సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతూ.. భారత్‌లోని నగరాలపై దాడులకు ప్రయత్నిస్తోంది. దాంతో.. ఇండియా పాక్ దాడుల్ని తిప్పికొట్టడమే కాదు.. తిరిగి కోలుకోలేని విధంగా కొడితే ఎలా ఉంటుందో చూపించింది.


కొనసాగుతున్న ఆపరేషన్ సిందూర్

పాక్‌కు చుక్కలు చూపిస్తున్న భారత సైన్యం


భారత్ దాడులతో బెంబేలెత్తుతున్న పాక్

ఇండియా ఫుల్ ప్రిపేర్డ్‌గా ఉంది. పాక్ గనక తోకజాడించి.. దాడులకు పాల్పడితే తిప్పికొట్టేందుకు అన్నివిధాలుగా సిద్ధంగా ఉన్నామని.. ఇంత క్లియర్‌గా చెప్పాక కూడా.. పాక్ బలుపు చూపించింది. సాహసం చేయొద్దని ముందే వార్నింగ్ ఇచ్చినా.. పాకిస్తాన్ ఓవరాక్షన్ చేసింది. భారత్‌లోని నగరాలను టార్గెట్ చేస్తూ డ్రోన్లు, మిసైళ్లను ప్రయోగించింది. దాంతో.. శత్రుదేశం దాడుల్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. మరోవైపు.. సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతూనే ఉంది.

పాక్ గురుద్వారాలపైనా దాడి చేసిన పాక్

అవంతిపొరా, శ్రీనగర్‌, జమ్మూ, పఠాన్‌కోట్, అమృత్‌సర్, కపుర్తల, జలంధర్‌, లుథియానా, ఆదంపూర్, బటిండా, చండీగఢ్, నల్, భుజ్, కుప్వారా, బారాముల్లా, పూంచ్‌, రాజౌరీ సెక్టార్లలో పాక్‌ కాల్పులు జరుపుతోంది. పాక్ దాడుల్లో.. 16 మంది అమాయక భారతీయ పౌరులు చనిపోయారు. వీరిలో ఐదుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. భారత్‌లోని గురుద్వారాలపైనా పాక్ దాడి చేసింది. ఈ దాడుల్లో.. ముగ్గురు సిక్కులు చనిపోయారు.

పాక్ డ్రోన్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న భారత్

పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేశాక.. పాకిస్తాన్ దాడులకు తెగబడింది. ఉత్తర, పశ్చిమ భారత్‌లోని 15 ప్రాంతాలపై దాడులు చేసేందుకు.. పాకిస్తాన్ సైన్యం ప్రయత్నించింది. వీటిని.. భారత్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యూఏఎస్ గ్రిడ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు దాడులను తిప్పికొట్టాయి. మన దేశంపై పాకిస్తాన్ ప్రయోగించిన డ్రోన్లను భారత దళాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. పాక్ మిసైల్స్‌ని వెంటనే పేల్చేశారు. ఎస్-400 యాంటీ మిసైల్ సిస్టమ్‌తో.. పాక్ దాడుల్ని భారత్ తిప్పికొట్టింది.

పాక్ నగరాల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ టార్గెట్‌గా దాడులు

పాక్ చేసిన దాడులకు కౌంటర్‌గా భారత దళాలు ఆపరేషన్ సిందూర్‌ని కంటిన్యూ చేస్తున్నాయి. పాక్ ఎప్పుడైతే భారత భూభాగంపై దాడులకు దిగిందో.. భారత పౌరుల్ని టార్గెట్ చేసిందో.. ఇండియా కూడా పాక్‌లోని కీలక నగరాలపై డ్రోన్ దాడులు చేసింది. పాక్‌లోని 9 కీలక నగరాల్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్‌ టార్గెట్‌గా దాడులు జరిపింది. లాహోర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అయితే పూర్తిగా ధ్వంసమైంది.

ఉగ్ర సంస్థల స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు

మరోవైపు.. కశ్మీర్ సరిహద్దుల్లోనూ పాక్ దాడులు కొనసాగిస్తోంది. మోర్టార్ షెల్స్, బాంబులతో దాడులు చేస్తోంది. పాక్‌పై అదే స్థాయిలో భారత్ ప్రతిదాడులు చేస్తోంది. భారత్ కేవలం.. ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడి చేసింది. టెర్రర్ క్యాంప్స్‌ని టార్గెట్ చేసి.. మరెవరికీ హాని కలగకుండా మిసైల్స్‌ ప్రయోగించింది. కనీసం.. వాటి పక్కనున్న నిర్మాణాలపై శకలాలు కూడా పడకుండా దాడిచేసింది. ఈ విషయంలో భారత్ టార్గెట్ క్లియర్. కేవలం.. ఉగ్ర సంస్థల స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. పాక్ పౌరులకు నష్టం కలగకుండా.. వాళ్లకు ఏమీ జరగకుండా దాడి చేస్తే.. పాకిస్తాన్ మాత్రం సరిహద్దుల్లో భారత పౌరులపై దాడులు చేస్తోంది.

చక్వాల్, బహవల్పూర్, మైనివాలి, చోర్‌లో దాడులు

అమాయకుల ప్రాణాలు తీస్తోంది. దాంతో.. భారత్ బదులు తీర్చుకుంది. పాక్‌కు.. భారత సైన్యం చుక్కలు చూపించింది. ఏకకాలంలో 9 ప్రాంతాల్లో దాడులు చేసింది. లాహోర్, కరాచీ, రావల్పిండి, అట్టోక్‌, గుజ్రన్‌వాలా, చక్వాల్‌, బహవల్పూర్, మైనివాలి, చోర్‌ ప్రాంతాల్లో.. పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టార్గెట్‌గా దాడులు చేసింది. భారత డ్రోన్‌లు.. పాక్ గగనతలంలోకి చొచ్చుకెళ్లి మరీ.. టార్గెట్లపై దాడులు చేశాయి. పాకిస్థాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని.. వాటిని నిర్వీర్యం చేశాయి.

ఇండియా డ్రోన్ దాడులతో బెంబేలెత్తిపోతున్న పాక్

రావల్పిండి క్రికెట్ స్టేడియంపైనా భారత్ డ్రోన్ దాడి చేసింది. దాంతో.. స్టేడియంలో జరగాల్సిన పీఎస్ఎల్ మ్యాచ్‌ని రద్దు చేశారు. పాక్ దాడులకు కౌంటర్‌గా.. ఇండియా డ్రోన్ దాడులు చేయడంతో.. పాక్ బేంబెలెత్తిపోతోంది. ఇండియా ఇంకెన్ని డ్రోన్లను ప్రయోగిస్తుందోనని వణికిపోతోంది. మళ్లీ మిసైళ్లతో విరుచుకుపడితే.. తమ పరిస్థితేమిటని పాక్ సైన్యం టెన్షన్‌తో బెదిరిపోతోంది. పాకిస్తాన్ చర్యలతో.. ఆ దేశ ప్రజల్లోనూ భయాందోళన మొదలైంది. భారత్‌ని ఎదుర్కొనే సైనిక సామర్థ్యం లేకపోయినా.. పాక్ దాడులు చేస్తోందని.. దాని ఫలితంగా భారత్ చేసే ప్రతిదాడుల్లో తమకే నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. అవన్నీ చూస్తుంటే.. ఇండియా చేస్తున్న డ్రోన్, మిసైల్ దాడులతో.. పాకిస్తాన్ భయంతో చస్తున్నా.. పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోందనే విషయం క్లియర్‌గా తెలుస్తోంది.

ఈ దాడులు ఇలాగే కంటిన్యూ అయితే.. పాక్‌కు ఎంత నష్టం ఉంటుంది?

ఇదంతా చూస్తుంటే.. ఒక్కటి మాత్రం అర్థమవుతోంది. ఆపరేషన్ సిందూర్ ఇక్కడితో ఆగదు! ఇది మాత్రం క్లియర్. సరిహద్దుల్లో పాకిస్తాన్ ఓవరాక్షన్, దానికి తగ్గట్లుగానే.. భారత్‌పై దాడులు చేయడం, వాటిని ఎప్పటికప్పుడు ఇండియా తిప్పికొట్టడం చూస్తుంటే.. ఇది ఇంతటితో ఆగే పరిస్థితి లేదనే విషయం తెలుస్తోంది. ఈ దాడులు ఇలాగే కంటిన్యూ అయితే.. పాక్‌కు ఎంత నష్టం ఉంటుంది?

పాక్ ఆగదు.. ఇండియా వదలదు!

ఆపరేషన్ సిందూర్ ఇప్పట్లో ఆగే చాన్సే లేదు!

పాకిస్తాన్ విషయంలో.. భారత్ దూకుడు చూస్తుంటే ఇదే అర్థమవుతోంది. ఆపరేషన్ సిందూర్ కంటిన్యూ అవుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా చెప్పేశారంటే.. పాక్ విషయంలో భారత్ ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ఆపరేషన్‌లో నెక్ట్స్ ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. భారత సైన్యం చర్యలు ఎలా ఉంటాయో.. ఎవరూ ఊహించని పరిస్థితి నెలకొంది. కానీ.. ఒక్కటి మాత్రం నిజం. పాకిస్తాన్ భారత్‌పై దాడి చేస్తే మాత్రం ప్రతిదాడులు చాలా తీవ్రంగా ఉంటాయని.. రాజ్‌నాథ్ సింగ్ చెప్పేశారు. అందువల్ల.. పాకిస్తాన్ గనక దాడులకు తెగబడితే.. ఇండియన్ ఆర్మీ తీవ్రమైన సైనిక చర్యకు దిగుతుంది. ఇప్పటికే.. ఇండియా చేస్తున్న డ్రోన్, మిసైల్ దాడులకు పాక్‌ వణికిపోతోంది.

ఇండియా జోలికి వస్తే.. ఏమవుతుందో పాక్‌కు తెలుసు

ఏ డ్రోన్ ఎక్కడి నుంచి వచ్చి పడుతుందో తెలియక.. ఏ మిసైల్ ఎప్పుడొచ్చి దాడి చేస్తుందో అర్థంకాక.. పాక్ డిఫెన్స్ వర్గాలు ప్యాంట్లు తడిపేసుకుంటున్నాయి. ఓ పక్కన సరిహద్దుల్లో.. పాక్ సైన్యం కాల్పుల్ని భారత జవాన్లు సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. మరోవైపు.. డ్రోన్ ఎటాక్‌లతో విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే.. ఇండియన్ మిసైల్స్ విధ్వంసం ఎలా ఉంటుందో.. ధ్వంసమైన ఉగ్ర స్థావరాలను చూస్తే అర్థమవుతుంది. ఇండియా జోలికి వస్తే ఏమవుతుందో పాక్‌కు బాగా తెలుసు. అయినాసరే.. తోక జాడిస్తూనే ఉంటుంది. ప్రతిసారీ పరువు తీసుకుంటూనే ఉంది.

భారత్ విషయంలో పాక్‌కు తగులుతున్న ఎదురుదెబ్బ

ఉగ్ర స్థావరాలపై భారత్ మిసైల్ ఎటాక్స్‌ని జీర్ణించుకోలేక.. పాకిస్తాన్ దాడులకు తెగబడేందుకు ప్రయత్నించింది. కానీ.. ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ వాటిని తిప్పికొట్టేసింది. పాక్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఇండియాలో విధ్వంసం సృష్టించలేకపోతోంది. భారత రక్షణ వ్యవస్థల్ని దాటలేకపోతోంది. దాడి చేసేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ.. పాక్‌కు ఎదురుదెబ్బ తగులుతోంది. అందుకే.. సరిహద్దుల్లో అమాయక భారత పౌరుల ప్రాణాలు తీస్తోంది. అయినప్పటికీ.. ఇండియన్ ఆర్మీ.. పాక్‌కు చుక్కలు చూపిస్తోంది.

ఇవతలి వైపు నుంచి 10కి పైగా డ్రోన్లు ఎటాక్ చేస్తాయ్

పైగా.. ఈసారి గతంలో మాదిరాగా ఉండదు. ఇంతకుముందు ఉగ్రదాడులు జరిగినప్పుడు భారత ప్రభుత్వం స్పందించిన తీరుతో పోలిస్తే.. ఇప్పటి పరిస్థితులు పూర్తిగా వేరేలా ఉన్నాయి. ఈసారి బాగా పెద్దగానే ప్లాన్ చేశారనే విషయం క్లియర్‌గా అర్థమవుతోంది. అందువల్ల.. పాక్ అవతలి నుంచి ఒక్క డ్రోన్ ప్రయోగించినా.. ఇవతలి వైపు నుంచి 10కి పైగా డ్రోన్లు ఎటాక్ చేస్తాయ్. పాకిస్తాన్ ఒక్క మిసైల్ ఫైర్ చేసినా.. ఇండియాకు ఎన్ని మిసైల్స్ ప్రయోగిస్తుందనే దానిపై అసలు లెక్కే లేదు.

భారత్ విషయంలో పాక్‌కు షాక్ మీద షాక్

గతంలో.. భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసి పాక్ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టి.. వారి స్థావరాన్ని ధ్వంసం చేసింది. ఆ తర్వాత మరోసారి బాలాకోట్‌లో ఎయిర్‌స్ట్రైక్స్ చేసి.. ఉగ్ర శిబిరాలను కూల్చేసింది. అప్పుడు.. అక్కడితో రివేంజ్ అయిపోయింది. కానీ.. ఈసారి కూడా అలాగే ఉంటుందనుకున్న పాక్‌కు.. షాక్ మీద షాక్ తగులుతోంది. పాక్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేశారు. తాము కూడా దాడులు చేస్తే.. సరిపోతుందని పాక్ భావించింది. కానీ.. ఇండియా ఊరుకోదనే విషయం ఇప్పుడిప్పుడే దాయాది దేశానికి అర్థమవుతోంది. ఈసారి ఇలా వెళ్లి.. అలా కొట్టి వచ్చేయడం ఉండదనే విషయం ఇప్పుడే తెలుస్తోంది. ఈసారి.. పాక్‌కు దెబ్బకు దెబ్బ పడుతూనే ఉంది.

పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ టార్గెట్‌గా భారత దళాలు దాడులు

ప్రతి నిమిషం.. పాకిస్తాన్‌కు పగులుతూనే ఉంది. ఇండియా విషయంలో ఎంత ఓవరాక్షన్ చేస్తే.. పాకిస్తాన్ అంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందువల్ల.. పాకిస్తాన్ ఎంత తగ్గితే.. ఆ దేశానికి అంత మంచిది. లేకపోతే.. ఘోరంగా దెబ్బతిని.. దారుణంగా నష్టపోయేది పాకిస్తాన్ మాత్రమే. పాక్‌కు తమ సైనిక సామర్థ్యం తెలిసి కూడా.. ఇండియాపై దాడులకు తెగబడుతోంది. భారత్ ఆ దాడుల్ని సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఇప్పటికే.. పాక్‌లోకి కీలక నగరాల్లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ టార్గెట్‌గా.. భారత దళాలు దాడులు చేశాయి. ఇప్పుడు.. ఇండియా మిసైల్ ఫైర్ చేసినా.. డ్రోన్ స్ట్రైక్ చేసినా.. పాక్ చేయగలిగిందేమీ లేదు. దాడుల్లో నష్టపోవడం తప్ప. అందువల్ల.. పాక్ ఏమాత్రం హద్దు మారినా.. ఇండియా నుంచి వచ్చే ప్రతిదాడి మామూలుగా ఉండదు. అందువల్ల.. పాక్ వెనక్కి తగ్గడం తప్ప.. మరో ఆప్షన్ లేదు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×