Urfi Javed Arrest : ఉర్ఫీ జావేద్.. విచిత్రమైన బట్టలతో సోషల్ మీడియా లో వైరల్ అయ్యే ఈ భామ ప్రస్తుతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వల్ల మరింత సంచలనం సృష్టించింది. రీసెంట్ గా ఉర్ఫీ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోస్ట్ చేసిన వీడియో బాగా బజ్ క్రియేట్ చేసింది ప్రస్తుతం ఈ వీడియో కారణంగా ఆమె మరింత చిక్కుల్లో పడింది. విషయం ముంబై పోలీసులు జోక్యం చేసుకునే అంతవరకు వెళ్ళింది.
వివరాల్లోకి వెళ్తే..ఉదయం కాఫీ తాగుతూ తన ఇంటి నుంచి బయటకు వచ్చిన ఉర్ఫీ జావేద్ ను పోలీసులు ఆపుతారు. ఆమె పోస్ట్ చేసిన విడియో లో ఒక మహిళ పోలీస్ ఆఫీసర్ ఉర్ఫీని పోలీస్ స్టేషన్ కి రమ్మని అడుగుతుంది.దానికి షాక్ అయిన ఉర్ఫీ నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు..అని అడుగుతుంది. దానికి ఆ పోలీస్ ఆఫీసర్ ఇంత చిన్న బట్టలు వేసుకుని ఎవరైనా తిరుగుతారా?అని ప్రశ్నిస్తుంది.
ఉర్ఫీ జావేద్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దీంతో విడియో వెనుక అసలు సంగతి ఏమిటో తెలుసుకోవాలని నెటిజన్స్ ప్రయత్నించారు. అయితే ముంబై పోలీసులు అధికారికంగా ప్రకటించడంతో ఇది ఒక ఫేక్ వీడియో అని ఇందులో ఉన్నది అసలు పోలీసులు కాదు అని స్పష్టమైంది. అంతే కాదు ఈ వీడియో లో ఉర్ఫీ జావేద్ , ఆమె తో పాటు ఉన్న వ్యక్తుల పై క్రిమినల్ కేస్ నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఉర్ఫీ జావేద్ వీడియో పై స్పందించిన ముంబై పోలీసులు ” చీప్ పబ్లిసిటీ కోసం ఇలా చట్టంతో ఆడడం మంచిది కాదు. కేవలం పొట్టి దుస్తులు ధరించింది అనే నెపంతో పోలీసులు ఒక అమ్మాయిని అరెస్టు చేశారు అని వచ్చిన వీడియో నకిలీది. ఈ వీడియో లో పోలీస్ యూనిఫాం, సింబల్స్ ను దుర్వినియోగపరిచారు.” అని ముంబై పోలీసులు ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు.
ఈ నేపథ్యంలో నేరస్థల పై ఓషివారా పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ 171, 419, 500, 34 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేయడం జరిగింది.ఇప్పటికే ఆమె డ్రెస్సింగ్ కారణంగా బాగా ట్రోలింగ్ ఎదుర్కొంటున్న ఉర్ఫీ పై ఇప్పటికే బాంద్రా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదై ఉంది. ఇప్పుడు మళ్లీ ఈ కొత్త కేసు ఆమెకు ఎన్ని చిక్కులు తెస్తుందో చూడాలి. ఇది తెలిసి కొంతమంది నెటిజన్స్ పబ్లిసిటీ కోసం అడ్డమైన పనులు చేస్తే ఆఖరికి ఇలా ఇరుక్కోవాల్సిందే అని కామెంట్స్ పెడుతున్నారు.