BigTV English

Urvashi Rautela : ఆ నిర్మాతల పనే… లీకైన బాత్రూం వీడియోలపై బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Urvashi Rautela : ఆ నిర్మాతల పనే… లీకైన బాత్రూం వీడియోలపై బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

Urvashi Rautela : ఊర్వశి రౌతెల (Urvashi Rautela) గురించి టాలీవుడ్ మూవీ లవర్స్ కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ ఫుల్ ఖుషి గా ఉంది. ఆ సినిమాలో హీరోయిన్ గా నటించకపోయినప్పటికీ తన సినిమానే అన్నట్టుగా ఉప్పొంగిపోతోంది. ఇక ఈ క్రమంలోనే ఆమె వివాదాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా ఊర్వశి రోజుల కొన్నాళ్ల క్రితం లీకైన తన బాత్రూం వీడియోలపై స్పందిస్తూ, నిర్మాతలపై షాకింగ్ కామెంట్స్ చేసింది.


హీరోయిన్ బాత్రూం వీడియో లీక్

వాల్తేర్ వీరయ్య, బ్రో, ఏజెంట్, స్కంద వంటి ఐటెం సాంగ్స్ చేసి ఆకట్టుకున్న బ్యూటీ ఊర్వశీ రౌతెల (Urvashi Rautela). ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ రీసెంట్ గా ‘డాకు మహారాజ్’ సినిమాలో ఒక కీలక పాత్రను పోషించింది. అలాగే స్పెషల్ సాంగ్ చేసింది. ఇక ఈ అమ్మడి ఖాతాలో ఉన్న వివాదాలు కూడా తక్కువ ఏమీ కాదు. రీసెంట్ గా ఊర్వశి ప్రైవేట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఆమె బాత్రూంలో బట్టలు మార్చుకుంటున్నట్టుగా కనిపించింది. అప్పట్లో ఆమె మేనేజర్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ వీడియో వివాదం గట్టిగానే నడిచింది. కానీ తాజాగా ఆ ఘటనపై ఊర్వశీ ఊహించని నిజాలను బయట పెట్టింది. ఆ లీక్ వెనక ఉన్నది ఎవరో కాదు తాను కలిసి పని చేసిన నిర్మాతలే అంటూ బిగ్ బాంబు పేల్చింది.


ఇంత తతంగం నడిచిందా ?

హిందీలో ఊర్వశి చేసిన ‘ఘుస్పైథియా ‘ అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమా విషయంలో ఈ లీక్ వీడియో స్టోరీని ప్రీ ప్లాన్డ గా చేశారట మేకర్స్. స్వయంగా ఆ సినిమా నిర్మాతలే ఆమె దగ్గరకు వచ్చి, అనుమతి తీసుకొని మరీ ఈ వీడియోను లీక్ చేసినట్టు తాజా ఇంటర్వ్యూలో స్వయంగా ఊర్వశి వెల్లడించింది. అయితే ఇలాంటి పిచ్చి పని చేయడం వెనక ఒక కారణం కూడా ఉందట.

ఆమె హీరోయిన్ గా నటించిన ‘ఘుస్పైథియా ‘ (Ghuspaithiya) మూవీ 2017 లోనే పూర్తి కాగా, గత ఏడాది రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమాపై ఎలాంటి బజ్ లేకపోవడం, అప్పటికే నిర్మాతలు అప్పుల్లో కూరుకుపోవడంతో తమ పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ హీరోయిన్ దగ్గర గోడును వెళ్ళబోసుకున్నారట. ఆ సినిమా కోసం ఆస్తులన్నీ అమ్ముకున్నాము, బజ్ కోసం ఈ సీను లీక్ చేస్తామని డైరెక్ట్ గా హీరోయిన్ నే పర్మిషన్ అడిగారట. దీంతో ఊర్వశి నిర్మాతల బాధను అర్థం చేసుకొని, మేనేజర్ తో మాట్లాడి ఈ లీక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇంకేముంది ఊర్వశీ బాత్రూం వీడియో వెనక ఇంత తతంగం నడిచింది అన్నమాట. మొత్తానికి మూవీకి మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక లేటెస్ట్ గా ‘డాకు మహారాజ్’ మూవీతో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది ఈ అమ్మడు.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×