BigTV English

Kumbh Mela 2025: పుణ్య స్నానాలకు వచ్చి.. బ్యూటీల వెంట పడతారేంట్రా బాబు, చివరికి ఆమె…

Kumbh Mela 2025: పుణ్య స్నానాలకు వచ్చి.. బ్యూటీల వెంట పడతారేంట్రా బాబు, చివరికి ఆమె…

Viral Girl Monalisa: ప్రయాగరాజ్ వేదికగా జరుగుతున్న మహా కుంభమేళా ఆధ్యాత్మిక సంబురానికి దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద మొత్తంలో తరలి వస్తున్నారు. వారం రోజుల్లో సుమారు 10 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించినట్లు యూపీ సర్కారు వెల్లడించింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఈ వేడుక ఉపాధి కల్పిస్తున్నది. ఇక తాజాగా మహా కుంభమేళాలో రుద్రాక్షలు అమ్మే అమ్మాయి మోనాలీసా సోషల్ మీడియా స్టార్ గా మారిపోయింది. ఓవర్ నైట్ లో ఆ అమ్మాయికి దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆ అమ్మాయికి చెందిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా తెగ వైరల్ అయ్యాయి.


ఓవర్ నైట్ స్టార్ గా మారిన మోనాలీసా

కాటుక పెట్టిన కళ్లు, డస్కీ స్కిన్, అందమైన చిరునవ్వు, సింపుల్ హెయిర్ స్టైల్ తో ఉన్న మోనాలీసా.. నేచురల్ బ్యూటీతో అందరినీ ఆకట్టుకుంది. కుంభమేళాకు వెళ్లిన ఓ యూట్యూబర్ ఆమె వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. కొద్ది గంట్లోనే ఆమె వీడియో వైరల్ అయ్యింది. ఇండోర్ కు చెందిన ఈ అమ్మాయి ఇప్పుడు దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెటిజన్లు తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇన్ స్టా, ఫేస్ బుక్, సహా అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లలోనూ ఈ అమ్మాయే తెగ హల్ చల్ చేస్తున్నది.


Read Also: ఆహా.. ఏమా అందం.. కుంభమేళాలో ఈ న్యాచురల్ బ్యూటీ ఎవరంటే!

మోనాలీసాను కుంభమేళా నుంచి ఇంటికి పంపిన తండ్రి 

మోనాలీసా సోషల్ మీడియా ట్రెండ్ కావడంతో చాలా మంది సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్స్, మీడియా పర్సన్స్ ఆమెను ఇంటర్వ్యూ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించారు. ఆమె పాపులర్ అయినప్పటికీ, వారి వ్యాపారం మాత్రం దెబ్బతిన్నది. ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి యూట్యూబర్లు ఎగబడుతున్నారే తప్ప, ఆమె అమ్మే రుద్రాక్ష మాలలు ఎవరూ కొనడం లేదు. పైగా ఆమెను ఇంటర్వ్యూల కోసం ఇబ్బంది పెట్టడంతో.. తన తండ్రి ఆవేదన చెందారు. ఈ హడావిడి తగ్గే వరకు ఇంటికి వెళ్లాలని ఆమె తండ్రి సూచించారు. ఈ నిర్ణయంతో ఆమె కుంభమేళా నుంచి ఇండోర్ లోని తన సొంత ఇంటికి వెళ్లిపోయింది.

Read Also: రాహుల్ వల్లే నా పాల క్యాన్ పడిపోయింది, కోర్టుకెక్కిన బీహార్ వ్యక్తి!

మీడియా అతిపై నెటిజన్ల ఆగ్రహం

మీడియా, సోషల్ మీడియా అతి కారణంగా ఓ అమ్మాయి వ్యాపారానికి తీవ్ర ఇబ్బంది కలిగిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు చేసిన పని కారణంగా ఆమె కుటుంబం ఉపాధి కోల్పోయేలా చేసిందంటున్నారు. సెల్ఫీలు, వీడియోల కోసం ఎగబడటం మూలంగా ఇప్పుడు ఆమె అక్కడి నుంచి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఎప్పుడైనా ఎదుటి వ్యక్తులకు నష్టం కలిగించే ప్రవర్తించకూడదంటున్నారు. ఇకపై మోనాలిసా కుంభమేళాకు వచ్చినా, ఆమె గుర్తింపును దాచుకునే పరిస్థితి వస్తుందంటున్నారు.

Also Read: సాంబార్ రైస్ ఆర్డర్ పెట్టిన కస్టమర్లు, వామ్మో.. తింటుండగా ఒక్కసారి షాక్!

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×