Saif Ali Khan: బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ లీలావతి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆరురోజులగా హాస్పిటల్ లో చికిత్స అందుకుంటున్న ఆయను కొద్దిసేపటి క్రితమే కరీనా కపూర్ ఖాన్.. ఇంటికి తీసుకెళ్లింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. జనవరి 16 న సైఫ్ నివసిస్తున్న ఇంటిలో ఇద్దరు దొంగలు.. చోరీకి పాల్పడ్డారు.
సైఫ్ చిన్నకొడుకు రూమ్ లోకి దొంగలు చొరబడగా.. కేర్ టేకర్ వారిని చూసి ఒక్కసారిగా అరిచింది. దీంతో సైఫ్.. ఆ గదిలోకి వెళ్ళగానే దొంగల్లో ఒకరు.. అతనిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. కత్తితో సైఫ్ పై దాడి చేసి పరారయ్యారు. ఇక వెంటనే సైఫ్ ను దగ్గర్లోని లీలావతి హాస్పిటల్ కు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. కార్లు అందుబాటులో లేకపోవడంతో సైఫ్ కుమారుడు ఇబ్రహీమ్ తన తండ్రిని క్యూలోలో తీసుకెళ్లాడు. హాస్పిటల్ కి తీసుకెళ్లే సమయానికి సైఫ్ రక్తపు మడుగులో ఉన్నాడు.
3 అంగుళాల పొడవున్న పదునైన వస్తువు సైఫ్ వెన్నుముకలో ఉందని గుర్తించిన వైద్యులు వెంటనే సర్జరీ చేసి దాన్ని తొలగించారు. దాదాపు 5 రోజులు చికిత్స అనంతరం సైఫ్ ఆరోగ్యం నిలకడగా ఉండడంతో నేడు ఆయనను డిశ్చార్జ్ చేశారు.
Rashmika Mandanna: పుష్పకు శ్రీవల్లీ.. చావాకు యేసుబాయి.. రష్మిక నామ సంవత్సరం మొదలు
నేటి ఉదయమే కరీనా కపూర్ ఖాన్ హాస్పిటల్ కు చేరుకొని డిస్చార్జ్ ఫార్మాలిటిస్ ను పూర్తిచేయగా.. కొద్దిసేపటి క్రితమే సైఫ్.. తన కారులో ఇంటికి చేరుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సైఫ్ .. కారు దిగి అభిమానులకు, మీడియా వారికి అభివాదం చేసి తాను బాగున్నట్లు తెలిపాడు. వైట్ కలర్ షర్ట్, బ్లూ కలర్ జీన్స్ .. దానిపై గాగుల్స్ పెట్టుకొని కనిపించాడు సైఫ్. ఇక చేతికి బ్యాండెడ్ కత్తుతో సైఫ్ చాలా యాక్టివ్ గా కనిపించాడు.
ఇక సైఫ్ కు కొన్నిరోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపినట్లు సమాచారం. ఇంకోపక్క సైఫ్ ఆలీ ఖాన్ పై దాడికి పాల్పడిన నిందితుల్లో ఒకరిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అతని పేరు మహ్మద్ షెహజాద్. దాడి జరిగిన తరువాతి రోజునే ముంబై పోలీసులు థానేలో మహ్మద్ అదుపులోకి తీసుకున్నారు. అతను అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం ఈ కేసు ఇంకా విచారణలోనే ఉంది. సైఫ్ .. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వడంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయన పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.
హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయిన తర్వాత సైఫ్ ఇలా ఉన్నాడు… #SaifAliKhan #discharged #hospital #Bollywood #Mumbai #SaifAliKhanNews #SaifAliKhanHealthUpdate #BIGTVcinema @saifalikhan067 pic.twitter.com/DAK43RgEa9
— BIG TV Cinema (@BigtvCinema) January 21, 2025