Andrea Jeremiah: కోలీవుడ్ బ్యూటీ ఆండ్రియా జెర్మియా తెలుగువారికి కూడా సుపరిచితమే. తెలుగులో హీరోయిన్ గా కన్నా సింగర్ గానే ఎక్కువ పాపులర్ అయ్యింది. రాఖీ, దేశముదురు, బొమ్మరిల్లు, కింగ్.. లాంటి సినిమాల్లో ఆమె మంచి హిట్ సాంగ్స్ పాడి అలరించింది. ఒకపక్క సింగర్ గా .. ఇంకోపక్క నటిగా కొనసాగుతున్న ఆండ్రియా.. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ ట్రూప్ లో సింగర్ గా కొనసాగుతుంది. ఇక ఈ ముద్దుగుమ్మ సినిమాలు, సాంగ్స్ ఏమో కానీ.. వివాదాలతో మాత్రం మరింత ఫేమస్ అయ్యింది.
స్టార్స్ తో ఎఫైర్స్ పెట్టుకున్నట్లు ఆండ్రియా మీద చాలా రూమర్స్ ఉన్నాయి. కొన్ని రూమర్స్ అయినా మరికొన్ని మాత్రం నిజాలే. ఈ చిన్నది.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో ప్రేమాయణం నడిపింది. అతడితో కలిసి ముద్దులు, హాగ్ లు అంటూ చాలా దూరం వెళ్ళింది. ఆ ఫొటోలే సుచీ లీక్స్ వలన బయటకు వచ్చి సంచలనం సృష్టించాయి. ఆ లీక్స్ లో ఎక్కువ బయటపడిన ఎఫైర్స్ అంటే ఆండ్రియాయే అని చెప్పాలి. అయితే ఈ లీక్స్ తరువాత వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో వీరు విడిపోయారు.
ఇక అనిరుధ్ కన్నా ముందే ఆండ్రియా ఒక పెళ్లి అయిన వ్యక్తితో ఎఫైర్ నడిపింది. ఆ విషయం ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. “నేను గతంలో ఒక వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్నాను. అప్పటికే అతనికి పెళ్లి అయ్యింది. ఆ విషయం తెలిసే ఎఫైర్ నడిపాను. కానీ, అతను నన్ను వేధించాడు. నరకం చూపించాడు. శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఎంతో హింస పెట్టాడు. అతని నుంచి విడిపోయాక డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. దాని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది” అని తన బుక్ లో రాసుకొచ్చింది.
Rashmi Gautham: సుడిగాలి సుధీర్ గర్ల్ ఫ్రెండ్.. ప్రేమికుల రోజున ఎలాంటి ఫోటోలను షేర్ చేసిందో చూడండి
అలా వరుస రిలేషన్ షిప్స్ వలన విసిగిపోయిన ఆండ్రియా.. ప్రస్తుతం ఎలాంటి కమిట్ మెంట్ లేకుండా ఫ్రీ బర్డ్ గా మారింది. నేడు ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ చిన్నది తాను ఫ్రీ బర్డ్ అంటూ చెప్పుకొచ్చింది. “ఒకప్పుడు నేను మీ వాలెంటైన్‌ని.. కానీ ఇప్పుడు నేను స్వేచ్ఛగా ఉన్నాను. నా ఆత్మ సుఖంగా ఉంది. నా హృదయం ఎప్పటికీ నాదే” అంటూ రాసుకొచ్చింది. దీంతో పాటు ఒక హాట్ ఫోటో కూడా షేర్ చేసింది.
సముద్రంలో ఒక బోట్ లోపల కూర్చొని.. నవ్వుతూ కనిపించింది. ఇక ఆమె థైస్ ను ఎలివేట్ చేస్తూ కనిపించడంతో ఈ ఫోటో మరింత హైలైట్ గా మారింది. ఆండ్రియాను ఈ రేంజ్ లో చూసిన అభిమానులు. నీకు నేను ఉన్నా ఆండ్రియా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. కొంతమంది మాత్రం ఆ క్యాప్షన్ ను చూసి అనిరుధ్ ను ఏకిపారేస్తున్నారు. ఎలా ఈ హాట్ బ్యూటీని వదిలేసావ్.. ? అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆండ్రియా కెరీర్ గురించి చెప్పాలంటే ఆమె నటించిన తాజా చిత్రం పిశాచి 2. మిస్కిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇందులో ఈ చిన్నది నగ్నంగా నటించిందని టాక్. మరి ఈ సినిమా ఆమెకు ఎలాంటి గుర్తింపు తెస్తుందో చూడాలి.
Once upon a time
I was your Valentine
But now I’m free
My soul, at ease
My heart, forever mine—❤️❤️❤️— pic.twitter.com/gRzTquGf0i
— Andrea Jeremiah (@andrea_jeremiah) February 14, 2025