BigTV English
Advertisement

Citadel Honey Bunny: తల్లి పాత్రలో సమంత.. ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్‌పై కాంట్రవర్షియల్ డైలాగ్

Citadel Honey Bunny: తల్లి పాత్రలో సమంత.. ఫ్యామిలీ, పర్సనల్ లైఫ్‌పై కాంట్రవర్షియల్ డైలాగ్

Citadel Honey Bunny Trailer: రాజ్, డీకే దర్శకత్వంలో వరుణ్ ధావన్, సమంత నటించిన వెబ్ సిరీసే ‘సిటాడెల్ హనీ బన్నీ’. ఇది హాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’కు ఇండియన్ వర్షన్‌గా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సిరీస్‌కు సంబంధించిన టీజర్ విడుదల కాగా.. ఇందులో సమంత ఏ రేంజ్‌లో యాక్షన్ స్టంట్స్ చేస్తుందో ప్రేక్షకులకు క్లారిటీ వచ్చేసింది. తాజాగా ‘సిటాడెల్ హనీ బన్నీ’ ట్రైలర్ కూడా విడుదలయ్యింది. ఇందులో సామ్ యాక్షన్ వేరే లెవెల్‌లో ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ ట్రైలర్‌లో కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా కామెడీ కూడా ఉంది. అంతే కాకుండా ఈ ట్రైలర్‌లోని ఒక డైలాగ్ సమంత పర్సనల్ లైఫ్‌ను టార్గెట్ చేసినట్టుగా ఉంది.


జేమ్స్ బాండ్

‘‘రోజూ ఎక్కడో ఒకచోట ఒక ప్రమాదం అనేది పుట్టుకొస్తుంది. ఒకదానికి మించి మరొకటి. అసలు ప్రశ్న ఏంటంటే ఆ ప్రమాదం మనల్ని ముగిస్తుందా? లేదా మనమే ఆ ప్రమాదాన్ని ముగిస్తామా?’’ అంటూ వరుణ్ ధావన్ చెప్పే డైలాగ్‌తో ‘సిటాడెల్ హనీ బన్నీ’ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇక ఇందులో సమంత.. ఒక పాపకు తల్లిగా కనిపించనుంది. కొన్నాళ్ల పాటు తను ఎవరో తన కూతురికి తెలియకుండా మ్యానేజ్ చేసినా మొత్తానికి తను ఒక ఏజెంట్ అని రివీల్ చేసేస్తుంది. దీంతో తన తల్లి ఒక జేమ్స్ బాండ్ అని పాప హ్యాపీగా ఫీలవుతుంది. అప్పుడే కథ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంది. అసలు సమంత ఏజెంట్ ఎలా అయ్యింది అనే విషయాన్ని కూడా ఈ ట్రైలర్‌లోనే రివీల్ చేశారు మేకర్స్.


Also Read: యూట్యూబ్ లవర్స్‌కి పిడిగులాంటి వార్త… నేటి నుంచే ఈ మార్పులు అమలు..!

సమంత ఎమోషనల్

‘సిటాడెల్ హనీ బన్నీ’ ట్రైలర్ ప్రకారం సమంత యాక్టర్ అవ్వాలనుకుంటుంది. అప్పుడే వరుణ్ ధావన్ తన జీవితంలోకి వస్తాడు. తనలాగే సమంతను కూడా ఒక ఏజెంట్‌గా మారుస్తాడు. తనకు ట్రైనింగ్ ఇస్తాడు. ఆ క్రమంలోనే ఇద్దరూ దగ్గరవుతారు. తన తండ్రి వల్లే తాను ఒక ఏజెంట్ అయ్యానని తన పర్సనల్ లైఫ్ విషయాలను కూడా సమంతతో షేర్ చేసుకుంటాడు వరుణ్. అప్పుడే వాళ్లిద్దరి మధ్య మనస్పర్థలు వస్తాయి. ‘‘నువ్వు చేసింది తప్పు’’ అంటూ వరుణ్‌పై సీరియస్ అవుతుంది సామ్. ‘‘నిన్ను నా ఫ్యామిలీలో భాగం చేసుకోవడమే తప్పు’’ అని వరుణ్ అంటాడు. దానికి ఏం మాట్లాడకుండా ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్లిపోతుంది సమంత.

నేరుగా బాలీవుడ్

వరుణ్ చెప్పిన ఫ్యామిలీ డైలాగ్ వింటుంటే అది సమంత పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడినట్టే ఉందని కొందరు ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలా ‘సిటాడెల్ హనీ బన్నీ’ ట్రైలర్ అంతా దాదాపుగా యాక్షన్‌తోనే నిండిపోయింది. సిరీస్‌లో యాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషన్, కామెడీ కూడా ఉంటుందని ట్రైలర్‌తో ప్రేక్షకులకు చెప్పడానికి ప్రయత్నించారు మేకర్స్. రాజ్, డీకే దర్శకత్వంలో ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది సామ్. అది తనకు బాలీవుడ్‌లో మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఇప్పుడు మరోసారి ‘సిటాడెల్ హనీ బన్నీ’తో బీ టౌన్ ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యింది. నవంబర్ 7 నుండి ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది.

Related News

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Big Stories

×