E-Paper
Advertisement

Operation Valentine OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’.. ఎందులో అంటే..?

Operation Valentine OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’.. ఎందులో అంటే..?
Advertisement

varun tej

Operation Valentine OTT Release: మెగా హీరో వరుణ్ తేజ్‌కి ఎంతో కాలం నుంచి హిట్లు లేక సతమతమవుతున్నాడు. ఈ క్రమంలో వరుసపెట్టి సినిమాలు తీస్తున్నా.. ప్రేక్షకాభిమానులను ఆకట్టుకోవడంలో విఫలం అవుతున్నాడు. అయినా వరుణ్ తన ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడా కోల్పోవడం లేదు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. కొత్త కొత్త కాన్సెప్టులతో డిఫరెంట్ జానర్‌లో మూవీలు తీస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

Advertisement

అయితే ఎంతటి డిఫరెంట్ కాన్సెప్టులతో వచ్చినా.. థియేటర్లలో బోల్తా కొడుతున్నాడు. ఫిదా, తొలిప్రేమ చిత్రాల తర్వాత మరొక హిట్టు వరుణ్ ఖాతాలో పడలేదు. అప్పటి నుంచి తన ప్రయాణాన్ని వరుణ్ ఎక్కడా ఆపలేదు. ఇక గతేడాది ఎన్నో అంచనాలతో ‘గాంఢీవదారి అర్జున’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ మూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వరుణ్‌కు ఆయన అభిమానులకు ఈ మూవీ నిరాశే మిగిల్చింది. అయినా వరుణ్ తన ప్రయత్నాన్ని ఆపలేదు. ఈ ఏడాది మరోక కొత్త జానర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీతో అందరినీ అలరించాడు.

Advertisement

Also Read: దేవర నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్.. ఇది మామూలు మాస్ కాదురా మావా

ఈ మూవీ కూడా భారీ అంచనాలతో తెరకెక్కింది. కానీ బాక్సాఫీసు వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. పుల్వామా దాడుల వంటి యదార్థ సంఘటనల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కింది. మార్చి 1న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది.

శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో మానూషి చిల్లర్ హీరోయిన్‌గా నటించింది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇక థియేటర్లలో పర్వాలేదనిపించుకున్న ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఆడియన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఓటీటీ ఆడియన్స్‌కు ఓ గుడ్ న్యూస్ అందింది. ఆపరేషన్ వాలెంటైన్ మూవీ తాజాగా ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది తెలుగు, తమిళ్ వెర్షన్‌లో అందుబాలోకి వచ్చింది.

Also Read: బ్యాంగ్ బ్రదర్స్ ‘ఓం భీమ్ బుష్’ మూవీ ఫుల్ రివ్యూ.. శ్రీ విష్ణు ఖాతాలో మరో హిట్టు పడ్డట్టేనా?

అందువల్ల ఈ చిత్రాన్ని థియేటర్లలో మిస్ అయిన వారు ఇప్పుడు ఓటీటీలో వీక్షించవచ్చు. ఇకపోతే ఈ మూవీ ఫ్లాప్ తర్వాత వరుణ్ తేజ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను ఎలాంటి కథతో తీసుకురానున్నాడు అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×