BigTV English

TDP MLA Candidates Third List: టీడీపీ ఎమ్మెల్యేల అభ్యర్థుల మూడో జాబితా విడుదల.. ఎవరేవరున్నారంటే..?

TDP MLA Candidates Third List: టీడీపీ ఎమ్మెల్యేల అభ్యర్థుల మూడో జాబితా విడుదల.. ఎవరేవరున్నారంటే..?
TDP MLA Candidates Third List
TDP MLA Candidates Third List

TDP MLA Candidates Third List: ఎమ్మెల్యే అభ్యర్థుల మూడో జాబితాను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. జనసేన, బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతోంది. ముూడో జాబితాలో 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. దీంతో పాటు 13 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లను టీడీపీ విడుదల చేసింది.


టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మూడో జాబితా..
పలాస.. గౌతు శిరీష
శ్రీకాకుళం.. గొండు శంకర్
పాతపట్నం.. మామిడి గోవిందరావు
శృంగవరపు కోట.. కోళ్ల లలిత కుమారి
కాకినాడ సిటీ.. వనమాడి వెంకటేశ్వరరావు
అమలాపురం.. అయితాబత్తుల ఆనందరాపు
పెనమలూరు.. బోడె ప్రసాద్
మైలవరం .. వసంత కృష్ణ ప్రసాద్
నరసరావుపేట.. చదలవాడ అరవింద్ రావు
చీరాల. . మద్దులూరి మాలకొండయ్య యాదవ్
సర్వేపల్లి.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

ఎంపీ అభ్యర్థుల జాబితా..
శ్రీకాకుళం.. రామ్మోహన్ నాయుడు
విశాఖ .. భరత్
అమలాపురం.. గంటి హరీశ్ మాథుర్
ఏలూరు .. పుట్ట మహేశ్ యాదవ్
నరసారావుపేట.. లావు శ్రీకృష్ణదేవరాయలు
బాపట్ల .. కృష్ణప్రసాద్
కర్నూలు.. బస్తిపాటి నాగరాజు


విజయవాడ..కేశినేని చిన్ని
గంటూరు ..పెమ్మసాని చంద్రశేఖర్
నెల్లూరు.. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
చిత్తూరు.. దగ్గమళ్ల ప్రసాదరావు
నంద్యాల .. బైరెడ్డి శబరి
హిందూపురం.. బీకే పార్థసారధి

ఇప్పటికే 128 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించారు. తొలి జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించారు. రెండో జాబితాలో 34 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల వెల్లడించారు. ఇప్పుడు 11 ఎమ్మెల్యేల అభ్యర్థులను ప్రకటించడంతో ఇంకా 5 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి.అలాగే మరో 4 ఎంపీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

మరోవైపు టీడీపీ ఇప్పటి వరకు ఒక్క ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటించలేదు. ఏపీలో 17 లోక్ సభ నియోజకవర్గాల్లో ఆ పార్టీ పోటీ చేయనుంది. 8 స్థానాలు బీజేపీకి, జనసేనకు 2 స్థానాలను టీడీపీ కేటాయించింది. భారతీయ జనతా పార్టీ 6 ఎంపీ స్థానాల్లో, జనసేన రెండు ఎంపీ సీట్లలో పోటీ చేయనున్నాయి. ఇప్పటికే కాకినాడ జనసేన అభ్యర్థిగా ఉదయ్ భాస్కర్ పేరును పవన్ కల్యాణ్ ప్రకటించారు.

Also Read: పవన్ కళ్యాణ్ పై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు.. పొత్తులో త్యాగాలు సహజమే

గురువారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కావడం ఆసక్తిగా మారింది. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు, ఎన్నికల వ్యూహంపై ఇరువురు నేతలు చర్చించారని తెలుస్తోంది. దాదాపు 75 నిమిషాలపాటు చంద్రబాబు, పవన్ కల్యాణ్ వివిధ అంశాలపై చర్చించారు. ఈ భేటీలో ఎమ్మెల్యే , ఎంపీ అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చిందని తెలుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మూడో జాబితా విడుదలను చంద్రబాబు విడుదల చేశారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×