Big Stories

Om Bheem Bush Movie Review: బ్యాంగ్ బ్రదర్స్ ‘ఓం భీమ్ బుష్’ మూవీ ఫుల్ రివ్యూ.. శ్రీ విష్ణు ఖాతాలో మరో హిట్టు పడ్డట్టేనా..?

priyadarshi

- Advertisement -

Om Bheem Bush Movie Review: సినిమా: ఓం భీమ్ బుష్

- Advertisement -

నటీనటులు: శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్ తదితరులు

దర్శకత్వం: శ్రీ హర్ష కొనుగంటి

నిర్మాత: వి సెల్యూలాయిడ్స్, సునీల్ బలుసు

మ్యూజిక్: సన్నీ ఎంఆర్

సినిమాటోగ్రఫీ: రాజ్ తోట

ఎడిటింగ్: విష్ణువర్ధన్ కావూరి

రిలీజ్ డేట్: మార్చి 22, 2024

యంగ్ హీరో శ్రీవిష్ణు గతేడాది సామజవరగమన సినిమాతో వచ్చి ప్రేక్షకులను విపరీతంగా అలరించాడు. ఈ మూవీతో మంచి హిట్‌ను అందుకున్నాడు. ముఖ్యంగా ఇందులో కామెడీ బాగా పండిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు అలాంటి కామెడీ జానర్‌లో మరో సినిమా ‘ఓం భీమ్ బుష్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.

అయితే ఈ సారి ఒక్కడి కాదండోయ్.. శ్రీవిష్ణుకి తోడుగా కామెడీ గ్యాంగ్ రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి యాడ్ అయ్యారు. ఇక ఈ ముగ్గురు కలిస్తే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అందరికీ అర్థమైపోతుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో ప్రేక్షకాభిమానుల్ని ఆకట్టుకున్న ఈ సినిమా ఈ రోజు థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

Also Read: శృతి హాసన్‌తో లోకేష్ కనగరాజ్ ఘాటు రొమాన్స్.. ప్రోమో అదిరిపోయింది

కథ:

క్రిష్ (శ్రీ విష్ణు), వినయ్ (ప్రియదర్శి), మాధవ్ (రాహుల్ రామకృష్ణ) ఈ ముగ్గురు లెగసీ యూనివర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థులు. వీరు మంచి స్నేహితులు కూడా. వీరిని బ్యాంగ్ బ్రదర్స్ అంటుంటారు. కాలేజీలో వీరు నానా రచ్చ చేస్తుంటారు.

ఇక ఈ ముగ్గురు చేసే పనులు భరించలేక కాలేజీ ప్రిన్సిపల్ రంజిత్ (శ్రీకాంత్ అయ్యంగార్) తానే ఎగ్జామ్స్ రాసి వీళ్లను డాక్టరేట్లతో బయటకు పంపిస్తాడు. ఇక ఊరికి వెళ్లే క్రమంలో ఈ ముగ్గురూ భైరవపురం చేరుకుంటారు. ఆ గ్రామంలో తాంత్రిక విద్యల పేరుతో డబ్బు సంపాదించడం చూసిన వీరు భైరవపురంలోకి అడుగుపెడతారు. అక్కడ సైంటిస్టుల అవతారమెత్తుతారు.

ఎ టు జెడ్ పేరుతో ఓ షాపు ఓపెన్ చేసి ఎలాంటి సమస్యలకైనా పరిస్కారం చూపిస్తామంటారు. ఆ తర్వాత వీరు సైంటిస్టులు కాదని.. గ్రామస్తులను బురిడీ కొట్టిస్తున్నారనే విషయం తెలిసిపోతుంది. ఆ తర్వాత ఆ ఊరి సర్పంచ్.. ఓ పరిక్ష పెడతాడు. సంపంగి మహల్‌లో ఉన్న నిధిని కనిపెట్టి తీసుకొస్తే అప్పుడు నిజమైన సైంటిస్టులుగా నమ్ముతామని అంటాడు.

దీంతో దెయ్యం ఉన్న ఆ మహాల్‌లోకి వెళ్లాక ఏమైంది? వాళ్లు నిధిని తీసుకొచ్చారా? అక్కడ నిధిని తీసుకొచ్చే సమయంలో వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే:

కేవలం లాజిక్ లేకుండా మేజిక్‌నే నమ్ముకుని తెరకెక్కించిన మూవీ ఇది. ప్రేక్షకులను బాగా నవ్వించి మ్యాజిక్ చేస్తుంది. ఫస్ట హాఫ్ అంతా నవ్వులే నవ్వులు. ఇందులో శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ తమ కామెడీ డైలాగ్‌లతో అదరగొట్టేశారు.

Also Read: ఈ రోజు టీవీల్లో ప్రసారమయ్యే బ్లాక్ బస్టర్ సినిమాలు.. కొత్త చిత్రాలు కూడా

అయితే ఇందులో లాజిక్స్‌ని వెతక్కూదడు. కామెడీ పరంగా చూస్తే ఈ మూవీ హిలేరియస్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఈ ముగ్గురు చేసే క్రేజీ పనులు అందరినీ నవ్విస్తాయి. అలాగే గుప్త నిధులు అంటూ చేసే హంగామా కూడా అద్భుతంగా ఉంటుంది.

ఇక సెకండాఫ్ అంతా సంపంగి మహాల్‌లోనే సాగుతుంది. అక్కడ భయపెట్టే సన్నివేశాల్లో పండిన కామెడీ, హారర్ సినిమాపై మంచి ప్రభావం చూపిస్తుంది. ఈ సెకండాఫ్‌లో దెయ్యంతో డేటింగ్ వంటి సీన్లు పెద్దగా ప్రభావం చూపించవు. అయితే క్లైమాక్స్ పెద్దగా ఆకట్టుకోలేదు. కామెడీ సన్నివేశాలతో పాటు ఎమోషనల్, బోల్డ్ సీన్లు ఆకట్టుకుంటాయి.

ఎవరెలా చేశారంటే:

శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ పండించిన కామెడీ సినిమాకే హైలెట్. వీళ్ల ముగ్గురి డైలాగ్ టైమింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇందులో హీరోయిన్స్ ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్‌లు నటించినప్పటికీ వారి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయింది. అలాగే మ్యూజిక్, కెమెరా, ఎడిటింగ తరతర విభాగాలన్నీ మంచి పనితీరు కనబరిచాయి.

ఫైనల్‌గా చెప్పాలంటే ఓం భీమ్ బుష్ మూవీ ప్రేక్షకాభిమానులను బాగా నవ్వించి అలరిస్తుంది. మాస్ ఆడియన్స్‌కు ఈ సినిమా నవ్వులతో మాయ చేస్తుంది.

గమనిక: ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News