BigTV English

Shooting Video Leaked from Devara: దేవర నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్.. మరో క్రేజీ అప్డేట్ కూడా వచ్చేసింది!

Shooting Video Leaked from Devara: దేవర నుంచి ఎన్టీఆర్ వీడియో లీక్.. మరో క్రేజీ అప్డేట్ కూడా వచ్చేసింది!
ntr
ntr

Devara Shooting Clip Leaked: యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న కొత్త చిత్రం ‘దేవర’. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీపై ప్రేక్షకాభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, ఫస్ట్ లుక్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.


ముఖ్యంగా ఈ గ్లింప్స్‌ టీజర్‌లో ఎన్టీఆర్ మాస్ లుక్ చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. అంతేకాకుండా అందులో ఎన్టీఆర్ ఫైట్ సీన్స్‌ ఓ రేంజ్‌లో తమ అభిమానులను మంత్రముగ్దులను చేశాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ ఎంతో గ్రాండ్‌గా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కుతోంది. పోర్ట్ మాఫియా ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ మూవీ భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.


Also Read: ‘దేవర’ నుంచి కిరాక్ అప్డేట్.. ఎన్టీఆర్‌కు జోడీగా మరాఠీ ముద్దుగుమ్మ..?

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే కన్ఫర్మ్ చేశారు. కానీ ఈ చిత్రానికి సంబంధించిన విఎఫ్ఎక్స్ వర్క్ చాలా వరకు పెండింగ్ ఉందని.. అందువల్ల ఈ మూవీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

అంతేకాకుండా దీనిపై మేకర్స్ కూడా ఇంతవరకు నోరు మెదపకపోవడంతో అభిమానులు కంగారు పడుతున్నారు. ఇదంతా ఒకెత్తయితే.. ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ భారీ ధరకు జరిగింది. ఈ మూవీ ఓవర్సీస్ డీల్ రూ.27 కోట్ల ధరకు అమ్ముడు పోయాయి.

ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఇప్పుటికే మంచి అంచనాలను ఏర్పరచుకున్న ఈ మూవీ నుంచి తాజాగా ఓ వీడియో లీకై సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.

Also Read: ఓటీటీలోకి వచ్చేసిన వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’.. ఎందులో అంటే..

ఆ వీడియోలో ఎన్టీఆర్ నీటిలో నడుస్తూ కనిపిస్తున్నాడు. మాస్ అండ్ రగ్గడ్ లుక్‌లో కనిపించిన ఎన్టీఆర్‌ను చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడయో నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియోతో పాటు మరో అప్డేట్ కూడా బయటకొచ్చింది. ఈ మూవీ తాజా షెడ్యూల్ ప్రస్తుతం గోవాలో జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా మూవీ యూనిట్ ఒక సాంగ్‌తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

Tags

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×