E-Paper
Advertisement

Varun Tej-Lavanya wedding : కాక్‌ టెయిల్‌ పార్టీ.. ఇటలీలో మెగా ఫ్యామిలీ సందడే సందడి..

Varun Tej-Lavanya wedding : కాక్‌ టెయిల్‌ పార్టీ.. ఇటలీలో మెగా ఫ్యామిలీ సందడే సందడి..
Advertisement

Varun Tej-Lavanya wedding : వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి.. ఏడడుగులు వేసి ఏడు జన్మల అనుబంధంలోకి అడుగుపెట్టబోతున్న ఈ మెగా దంపతుల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి వార్త వైరల్ అవుతోంది. ఇప్పటికే ఇటలీలో వీళ్ళ పెళ్లి సంబరాలు ఘనంగా జరపడానికి మెగా కుటుంబం మొత్తం తరలి వెళ్ళింది. మెగా వారి పెళ్ళి సందడి ఇటలీలో కూడా ఘనంగా కనిపిస్తుంది. ఇక ఈ పెళ్ళికి సంబంధించి పలు రకాల ఫంక్షన్స్ తో అటు మెగా కుటుంబం ఇటు అల్లు కుటుంబం బాగా బిజీగా ఉంది.

ఈ నేపథ్యంలో వాళ్లకు సంబంధించిన ప్రతి ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఇద్దరి ప్రేమకు పునాది వేసిన ఇటలీలోని వీళ్లు నవంబర్ 1న పెళ్లి చేసుకుని భార్యాభర్తలు కాబోతున్నారు. జూన్ లో వీళ్ళ ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి అటు మెగా కుటుంబం ఇటు అల్లు కుటుంబం వరుసగా కాబోయే వధూవరులకు పార్టీలు ఇస్తూనే ఉన్నారు.

Advertisement

అక్టోబర్ 30 నుంచి లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్ పెళ్లి సంబరాలు ఇటలీలో మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 30న కాక్‌ టెయిల్‌ పార్టీ ఏర్పాటు చేశారు. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ ఎప్పటిలా ఈ పార్టీలో సందడి చేశాయి. ఈ పార్టీ కి లావణ్య ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా పాల్గొన్నారు.

తమ్ముడి పెళ్ళి భాధ్యత అంతా తన భుజాల పైన వేసుకొని ప్రతిదీ దగ్గర ఉండి చూసుకుంటున్నాడు రామ్ చరణ్. ఈ ఈవెంట్ కి అన్నదమ్ములు ఇద్దరు మ్యాచింగ్ కాస్ట్యూమ్స్ వేసుకున్నారు.వరుణ్, రామ్ చరణ్ వైట్ శాటిన్ సూట్ జాకెట్, బ్లాక్ బో టై, బ్లాక్ ప్యాంట్ ధరించారు. లావణ్య సిల్వర్ వైట్ గౌను పై ఫర్ స్టోల్‌తో దేవకన్యలా మెరిసిపోతోంది.ఇక ఉపాసన ఎప్పటిలాగా బ్లాక్ యాష్ కాంబినేషన్ లాంగ్ ఫ్రాక్ లో సింపుల్ అండ్ ఏలిగెంట్ గా ఉన్నారు. మరోపక్క స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ఈ పార్టీ లో మరింత స్టైలిష్ గా కనిపించారు.

Advertisement

వీరితోపాటు పార్టీ అటెండ్ అయిన అందరూ బ్లాక్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్ ధరించారు. ఈ కాక్‌ టెయిల్‌పార్టీకి సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పార్టీ ఫోటోలలో పెద్దవాళ్లు కవర్‌ కాలేదు. ఫోటోలను బట్టి కాక్‌ టెయిల్‌ పార్టీ మొత్తాన్ని మెగా ఫ్యామిలీ బాగా ఎంజాయ్ చేసినట్టు అర్థమవుతుంది. ఇక ఈ రోజు హల్దీ.. ఆ తర్వాత మెహందీ ఫంక్షన్‌ ఉంటాయి. నవంబర్‌ 1 మధ్యాహ్నం రెండు గంటల 48 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఉంటుంది. 

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×