BigTV English

AUS vs SL: ఎట్టకేలకు బోణీ కొట్టిన ఆస్ట్రేలియా..శ్రీలంకపై ఘన విజయం

AUS vs SL: ఎట్టకేలకు బోణీ కొట్టిన ఆస్ట్రేలియా..శ్రీలంకపై ఘన విజయం

AUS vs SL: ఆస్ట్రేలియా జూలు విదిల్చింది. శ్రీలంక జట్టుని ఓడించి సెమీ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. అయితే ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ శ్రీలంక ఓడి, పరిస్థితిని క్లిష్టం చేసుకుంది. దురదృష్టం ఏమిటంటే టాస్ గెలిచి శ్రీలంక బ్యాటింగ్ తీసుకుంది. చివరికి 43.3 ఓవర్లలో 209 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా పడుతూ లేస్తూ ఆడినా స్పీడుగానే ఆడారు. 35.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసి మెగా టోర్నీలో బోణీ కొట్టారు.


శ్రీలంక ఓపెనర్లు నిస్సంక (61), కుషాల్ పెరీరా (78) ఇద్దరూ క్రీజులో ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపించారు. మొదటి వికెట్ కి 125 పరుగులు జోడించారు. అప్పటికి 21 ఓవర్లు గడిచాయి. వీళ్ల ఊపు, ఉత్సాహం చూస్తుంటే 300 దాటుతుందని అంతా అనుకున్నారు. ఆస్ట్రేలియా బౌలర్లపై మొదటిసారి అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. వీరిలో ఏమైనా పస తగ్గిందా? లేక ఏజ్ బార్ అయిపోయిందా? అని అనుకున్నారు.
అయితే ఓపెనర్లు మాత్రం మొదటి ఓవర్ నుంచే ఫోర్లు కొడుతూ స్కోర్ బోర్డుని ఉరకలెత్తించారు. వారి జోడి కుదురుతుందని అనుకునే సమయంలో సీన్ రివర్స్ అయ్యింది. నిస్సంక వికెట్ తో పతనం మొదలైంది. తర్వాత 26వ ఓవర్ లో పెరీరా అవుట్ అయ్యాడు. ఇక అక్కడ నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో ఎవరూ ఆడలేదు. టపటపా వికెట్లు పడుతూనే ఉన్నాయి. కేవలం 44 పరుగుల తేడాలోనే మిగిలిన 8 వికెట్లు పడిపోయాయి. దీంతో 43.3 ఓవర్లకి 209 పరుగుల స్వల్పలక్ష్యాన్ని ఆస్ట్రేలియా ముందు ఉంచగలిగింది. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా 4 వికెట్లు తీశాడు. స్టార్క్, కమిన్స్ రెండేసి వికెట్లు తీసుకున్నారు.

సెకండ్ బ్యాటింగ్ కి వచ్చిన ఆస్ట్రేలియాకి విజయమేమీ  అలవోకగా లభించ లేదు. వారు కూడా పడుతూ లేస్తూనే లక్ష్యాన్ని చేధించారు. ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. డేవిడ్ వార్నర్ (11), స్టీవ్ స్మిత్ డకౌట్ అయ్యాడు. అప్పటికి 24 పరుగులకి రెండు వికెట్లతో ఆస్ట్రేలియా ఎదురీత మొదలెట్టింది. మిచెల్ మార్ష్ (52), లబుషేన్ (40) కాసేపు లంకను ప్రతిఘటించి బండిని నెమ్మదిగా పట్టాలెక్కించారు. తర్వాత వారు అయిపోయారు. ఆ తర్వాత వచ్చిన జోష్ ఇంగ్లిస్ (58) తోడ్పాడుతో ఆస్ట్రేలియా సురక్షిత స్థానానికి చేరింది. చివరకు మాక్స్ వెల్ (31), స్టొయినిస్ (20) లాంఛనం పూర్తి చేశారు. అయితే శ్రీలంక బౌలర్లలో దిల్షన్ 3 వికెట్లు తీసుకున్నాడు.


ఓడలు బళ్లవుతాయి…బళ్లు  ఓడలవుతాయని అంటారు అందుకేనేమో…మొన్నటి వరకు ఆస్ట్రేలియా అంటే అందరికీ హడల్…కానీ 2023కి వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది. 49 ఏళ్ల చరిత్రలో పాయింట్ల పట్టికలో మొదటిసారి ఆస్ట్రేలియా అట్టడుగు స్థానానికి చేరిందంట.  చివరికి గేర్ మార్చి స్పీడు పెంచి శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఇప్పుడు అడుగు నుంచి రెండు స్థానాలు ఎగబాకి 8వ స్థానంలో నిలుచుంది. అంతేకాదు సెమీఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక ఇక్కడ నుంచి మిగిలిన ఆరు మ్యాచ్ ల్లో ఐదు గెలిస్తే ఆశలు పెట్టుకోవచ్చునని అంటున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×