BigTV English

Varun Tej Lavanya Anniversary: మంచు కొండల్లో.. ఉదయించే సూర్యుడు మధ్య.. లవ్లీ పోస్ట్ తో విషెస్ చెప్పిన మెగా ప్రిన్స్..!

Varun Tej Lavanya Anniversary: మంచు కొండల్లో.. ఉదయించే సూర్యుడు మధ్య.. లవ్లీ పోస్ట్ తో విషెస్ చెప్పిన మెగా ప్రిన్స్..!

Varun Tej Lavanya Anniversary: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యూట్ జోడీగా పేరు సొంతం చేసుకున్న మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), ఆయన సతీమణి ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి(Lavanya tripathi)ఏడడుగులు, మూడుముళ్ల బంధంతో ఒక్కటి అయ్యి అప్పుడే ఏడాది పూర్తయింది. అటు చూస్తుండగానే ఏడాది పూర్తవడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక గత మూడు రోజులుగా అమెరికాలోనే ఉంటున్న ఈ జంట తాజాగా “మంచు కొండల్లో ఉదయించే సూర్యుడు మధ్య.. ప్రేమతో రొమాంటిక్ గా తన భార్యను హగ్ చేసుకున్న ఫోటోని షేర్ చేస్తూ..లవ్లీ పోస్ట్ తో తన భార్యకు హ్యాపీ యానివర్సరీ విషెస్” తెలియజేశారు ప్రిన్స్ వరుణ్ తేజ్.


అప్పుడే ఏడాది పూర్తి చేసుకున్న వరుణ్ – లావణ్య జంట..

ఈ ఫోటో చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంది. ఈ జంట ఎప్పటికీ ఇలాగే సంతోషంగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. వరుణ్ తేజ్ , లావణ్య విషయానికొస్తే.. దాదాపు ఆరేళ్లపాటు తమ ప్రేమను ఎక్కడ వ్యక్తపరచకుండా రహస్యంగా కొనసాగించిన ఈ జంట, ఎట్టకేలకు గత ఏడాది మెగా హీరో నాగబాబు ఇంట్లో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ తర్వాత అదే ఏడాది నవంబర్ 1 న ఇటలీలోని టస్కానీ వేదికగా బుధవారం రాత్రి 7:18 గంటలకు ఘనంగా వివాహం చేసుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యులు అతి తక్కువ మంది సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ వివాహానికి చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్(Pawan Kalyan), అల్లు అర్జున్(Allu Arjun),రామ్ చరణ్ (Ram Charan)ఇలా పలువురు స్టార్ హీరోలు సతీసమేతంగా హాజరయ్యారు. అలాగే అల్లు, మెగా కుటుంబానికి చెందిన అగ్ర యువ హీరోలతో పాటు నిర్మాతలు కూడా ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.వీరితోపాటు నితిన్, ఆయన సతీమణి షాలినీ, నీరజా కూడా ఈ సెలబ్రేషన్స్ లో భాగమయ్యారు. పలువురు సినీ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం నవంబర్ 5వ తేదీన హైదరాబాద్లో చాలా ఘనంగా రిసెప్షన్ కూడా నిర్వహించారు.


నా ప్రేమ విషయాన్ని నేనే ముందు తెలిపాను..

లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ప్రేమ విషయానికి వస్తే.. వీరిద్దరూ కలిసి తొలిసారి 2017లో మిస్టర్ అనే సినిమాలో నటించారు. అప్పుడే ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. ఆ తర్వాత మరుసటి ఏడాది అనగా 2018లో అంతరిక్షంలో నటించి ప్రేమికులుగా మారారు. ఇదే విషయంపై వరుణ్ తేజ్ మాట్లాడుతూ..” మేము ఐదారు సంవత్సరాలు మంచి స్నేహితులుగానే ఉన్నాం. నాకేదిష్టమో ఆమెకు బాగా తెలుసు. మా అభిరుచులు కలవడం వల్లే మా స్నేహం కాస్త ప్రేమగా మారింది. మొదట నేనే ప్రపోజ్ చేశాను. ఆ తర్వాత ఇరు కుటుంబాలు మా ప్రేమను అంగీకరించాయి” అంటూ వరుణ్ తేజ్ ఒక ఇంటర్వ్యూలో తమ లవ్ స్టోరీని తెలిపారు. అంతేకాదు తను వాడుతున్న ఫోన్ కూడా తన భార్య లావణ్య గిఫ్ట్ గా ఇచ్చిందని తెలిపారు వరుణ్ తేజ్.

 

View this post on Instagram

 

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×