BigTV English
Advertisement

Bhool Bhulaiya 3 Movie : భూల్ భూలయ్యా 3 మూవీలో షారుక్ కామియో… థియేటర్స్ బద్దలయ్యాయిగా..

Bhool Bhulaiya 3 Movie : భూల్ భూలయ్యా 3 మూవీలో షారుక్ కామియో… థియేటర్స్ బద్దలయ్యాయిగా..

Bhool Bhulaiya 3 Movie : గతంలో వచ్చి భారీ విజయాన్ని అందుకున్న భూల్ భులయ్యా సిరీస్ సినిమాలకు సీక్వెల్ గా ఇప్పుడు మరో సినిమా వచ్చింది. భూల్ భులయ్యా 3 మొదటి రెండు సినిమాలు మంచి టాక్ ను అందుకున్నాయి. అదే జోష్ తో ఇప్పుడు వచ్చిన సినిమా కూడా పాజిటివ్ టాక్ ను అందుకోవడం తో మూవీ మేకర్స్ తో పాటుగా ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషి అవుతున్నారు. హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమా లో కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్, మాధురీ దీక్షిత్, త్రిప్తి డిమ్రీ, విజయ్ రాజ్, రాజ్ పాల్ యాదవ్ తదితరులు నటించారు.. ఈ సినిమాలో వీళ్ళే కాదు శారుఖ్ ఖాన్ కూడా కనిపించడం విశేషం.. కానీ నిజానికి శారుఖ్ కాదు కానీ ఆ సీన్ పై మాత్రం సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.


ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు టీ సిరీస్, సినీ1 స్టూడియోస్ నిర్మించిన ఈ సినిమాకు అనీస్ బాజ్మీ దర్శకత్వం వహించిన్న ఈ మూవీ ఇవాళ థియేటర్లలో కి వచ్చేసింది. నిర్మాతలు భూషన్ కుమార్, కృషన్ కుమార్ ఈ సినిమాను సుమారుగా 150 కోట్ల రూపాయల తో నిర్మించారు. సందీప్ శిరోద్కర్ సంగీతం అందించిన ఈ సినిమా పాటలు మంచి స్పందనను సొంతం చేసుకున్నాయి. చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. ‘భూల్ భులయ్యా’ సిరీస్ సినిమాల్లో ఆడియన్స్ను చివరి దాకా కట్టిపడేసేది అసలు దెయ్యం ఎవరు? అనే విషయంలో వచ్చే ట్విస్ట్. ఆ విషయంలో భూల్ భులయ్యా 3 కూడా సక్సెస్ అయింది. చివర్లో వచ్చే ట్విస్ట్ గెస్ చేయడం అయితే ఎవరి వల్లా కాదు. కానీ ఇది మంచి సినిమా అనిపించడానికి అదొక్కటే హైలెట్ అయ్యింది. ఇక సినిమాలో శారుఖ్ ఖాన్ కనిపించాడని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. కానీ అందులో నిజం లేదు.. అసలు సినిమా కనిపించిన జవాన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

కార్తీక్ ఆర్యన్ రూహీ తన అద్భుతమైన నటన తో బాగా ఆకట్టుకుంటాడు. తనలో సహజంగా ఉండే కామెడీ టైమింగ్, ఈజ్… ఈ రోల్కు మరింత ప్లస్ అయింది. త్రిప్తి దిమ్రి పోషించిన హీరోయిన్ పాత్ర గ్లామర్ షోకు మాత్రమే పరిమితం. విద్యా బాలన్, మాధురి దీక్షిత్ లాంటి స్టార్స్ అందరు సినిమా కోసం బాగా కష్ట పడ్డారు. చివరికి విజయాన్ని అయితే అందుకుంది. ఈ మూవీలో ఓ సీన్ లో శారుఖ్ జవాన్ సీన్ కనిపిస్తుంది. కానీ ఇందులో నిజం లేదు.. కేవలం కామెడీ కోసం కల్పించారు. ఆ సీన్ సినిమాకు హైలెట్ అయ్యింది. ఇక పాజిటివ్ టాక్ ను అందుకున్న ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ ను అందుకుంటుందో చూడాలి.. గతంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ రికార్డుల ను షేక్ చేసాయి.. ఇప్పుడు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్స్ ను అందుకుంటుంటాయో చూడాలి..


Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×