BigTV English

Veera Simha Reddy : మాస్‌ డైలాగ్స్ అదుర్స్.. థియేటర్స్‌లో విజిల్స్‌..

Veera Simha Reddy : మాస్‌ డైలాగ్స్ అదుర్స్.. థియేటర్స్‌లో విజిల్స్‌..

Veera Simha Reddy : నందమూరి నటసింహం బాలకృష్ణ వీరసింహారెడ్డి గా అదరగొట్టాడు. బాలయ్య చెప్పిన మాస్ డైలాగ్స్ తో థియేటర్లు హోరెత్తుతున్నాయి. పవర్ ఫుల్ డైలాగ్స్ కు అభిమానులు విజిల్స్ వేస్తున్నారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు, రాయలసీమ సంస్కృతిపై సాయిమాధవ్‌ బుర్రా రాసిన డైలాగ్స్‌ నందమూరి ఫ్యాన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి.


వీరసింహారెడ్డిలో కొన్ని మాస్ డైలాగ్స్ ఇవే..
‘‘అన్నం మీద గౌరవం లేని వాడు ఆకలికి పనికిరాడు.. అమ్మ మీద గౌరవం లేనివాడు భూమికి పనికి రాడు’’
‘‘కోసేవాడికి కోడి మీద పగ ఉండదు.. నేనూ అంతే. చాలా పద్ధతిగా నరుకుతా’’
‘‘సెంట్రల్ అయినా.. స్టేట్ అయినా.. రాజకీయాల మీద బతికే మనిషిని కాదు.. రాజకీయాల్ని మార్చే మనిషిని’’
‘‘సమాధానం చెప్పలేని వాడికి ప్రశ్నించే హక్కు లేదు’’
‘‘నన్ను తట్టుకొని నిలవాలంటే మూడే దారులు. మారిపోవాలి.. పారిపోవాలి.. లేదంటే సచ్చిపోవాలి’’
‘‘నువ్వు సవాల్ విసరకు.. నేను శవాలు విసురుతా’’

రాజకీయాలపై పంచ్ లు..


‘‘నేనెవరో చెప్పే అలవాటు నాకు లేదు. జీవోను ఉన్నది ఉన్నట్టుగా అమలు చేస్తా. నీ జీవో గవర్నమెంట్‌ ఆర్డర్‌. నా జీవో గాడ్స్‌ ఆర్డర్‌’’
‘‘ఏది అభివృద్ధి హోం మినిస్టర్‌.. ప్రగ‌తి సాధించ‌డం అభివృద్ధి.. ప్రజ‌ల్ని వేధించ‌డం కాదు. జీతాలు ఇవ్వడం అభివృద్ధి.. బిచ్చమెయ్యడం కాదు. ప‌ని చేయడం అభివృద్ధి.. ప‌నులు ఆప‌డం కాదు. నిర్మించ‌డం అభివృద్ధి.. కూల్చడం కాదు. ప‌రిశ్రమ‌లు తీసుకురావ‌డం అభివృద్ధి.. ఉన్న ప‌రిశ్రమ‌లు మూయ‌డం కాదు. బుద్ధి తెచ్చుకో.. అభివృద్ధికి అర్థం తెలుసుకో’’
‘‘సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో.. కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు. మార్చలేరు’’
‘‘పదవి చూసుకుని నీకు పొగరేమో.. బై బర్త్‌ నా డీఎన్‌ఏకే పొగరెక్కువ’’

రాయలసీమ చరిత్రపై..
‘‘దేశానికి రాష్ట్రప‌తినిచ్చింది రాయ‌ల‌సీమ‌. అవిభ‌క్త ఆంధ్రప్రదేశ్‌కు ఆరుగురు ముఖ్యమంత్రుల్ని ఇచ్చింది రాయ‌ల‌సీమ‌. తెలుగు జాతి ఆత్మగౌర‌వం కోసం పిడికిలెత్తిన మ‌హ‌నీయుడ్ని గుండెల్లో పెట్టుకుంది రాయ‌ల‌సీమ‌. ఇది రాయ‌ల్‌ సీమ‌. గ‌జ‌రాజులు న‌డిచిన దారిలో గ‌జ్జి కుక్కలు కూడా న‌డుస్తుంటాయి. రాజును చూడు.. కుక్కను కాదు..’’
‘‘సీమలో ఏ ఒక్కడూ కత్తి పట్టకూడదని.. నేనొక్కడినే కత్తిపట్టా. పరపతి కోసమో పెత్తనం కోసమో కాదు. ముందు తరాలు నాకిచ్చిన బాధ్యత. నాది ఫ్యాక్షన్‌ కాదు. సీమ మీద ఎఫెక్షన్‌. వీరసింహారెడ్డి పుట్టింది పులిచర్ల. చదివింది అనంతపురం. రూలింగ్‌ కర్నూలు’’
‘‘అపాయింట్‌మెంట్‌ లేకుండా వస్తే అకేషన్‌ చూడను.. లొకేషన్‌ చూడను.. ఒంటి చేత్తో ఊచకోత.. కోస్తా..’’

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×