BigTV English

KCR : మహబూబాబాద్ కు కేసీఆర్ వరాలు.. బీఆర్ఎస్ ఆఫీస్ , కలెక్టరేట్ ప్రారంభోత్సవం..

KCR : మహబూబాబాద్ కు కేసీఆర్ వరాలు.. బీఆర్ఎస్ ఆఫీస్ , కలెక్టరేట్ ప్రారంభోత్సవం..

KCR : మహబూబాబాద్ జిల్లాకు కేసీఆర్ వరాలు ప్రకటించారు. మహబూబాబాద్ లో పర్యటించిన కేసీఆర్ తొలుత బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత కొత్త కలెక్టరేట్ కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం చాంబర్‌లో కలెక్టర్‌ శశాంకకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.


బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్..మహబూబాబాద్ జిల్లా ప్రజలకు శుభవార్త చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.10 లక్షల నిధులు ప్రకటించారు. జిల్లాలోని ఒక్కో మున్సిపాటీకి రూ. 25 కోట్లు, మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేశారు. తెలంగాణ ఏర్పాటు వల్లే ఇంత అద్భుతంగా అభివృద్ధి చేసుకోగలుగుతున్నామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మహబూబాబాద్ ప్రాంతం వెనుకబాటుకు గురైందని వివరించారు. మనం చేసుకుంటున్న అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం సగం చేసినా దేశం ఇప్పటికే బాగుపడేదని అన్నారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కేంద్రం సహకరించడంలేదని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నంతకాలం దేశం ఇలాగే ఉంటుందని కేసీఆర్ మండిపడ్డారు.


Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×