BigTV English

Veeranjaneyulu Viharayathra Teaser: అస్థికలు గోదావరిలో కలపాలిరా.. గోవాలో కాదు

Veeranjaneyulu Viharayathra Teaser: అస్థికలు గోదావరిలో కలపాలిరా.. గోవాలో కాదు

Veeranjaneyulu Viharayathra Teaser: ఈ మధ్య థియేటర్ లో ఎలాంటి కథలను అయితే చేస్తున్నామో అంతకు మించిన కథలను ఓటీటీలో చూపిస్తున్నారు మేకర్స్. కొత్త కొత్త కథలను తీసుకొస్తున్నారు. అవి కుదరకపోతే వేరే భాషల్లో హిట్ అయిన సినిమాలకు రీమేక్ లను దింపుతున్నారు. అది కుదరకపోతే ఏకంగా ఆ సినిమాలకే డబ్బింగ్ చేయించి వదులుతున్నారు. ఏదిఏమైనా ప్రేక్షకులను మాత్రం ఎంటర్ టైన్మెంట్ అందిస్తున్నారు.


ఈ మధ్యకాలంలో మంచి మంచి కథలతో ప్రేక్షకులను అలరిస్తుంది ఈటీవీ విన్. #90’s బయోపిక్, శశిమథనం లాంటి సిరీస్ లతో అదరగొట్టిన ఈటీవీ విన్ ఇప్పుడు మరో ఫన్ రైడ్ తో ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. అదే వీరాంజనేయులు విహారయాత్ర. సీనియర్ నటుడు నరేష్ ప్రధానపాత్రలో నటిస్తున్న ఈ సిరీస్ కు అనురాగ్ పాలుట్ల దర్శకత్వం వహిస్తున్నాడు.

ఇక ఈ సిరీస్ లో శ్రీ లక్ష్మి, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని, ప్రియదర్శిని, తరుణి, రవితేజ మహాదాస్యం కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాను భామా కలాపం వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన బి.బాపినీడు మరియు సుధీర్‌లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


తాజాగా వీరాంజనేయులు విహారయాత్ర టీజర్ ను మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేశారు. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. వీరాంజనేయులు (బ్రహ్మానందం) ఒక కుటుంబ పెద్ద. ఆయన చనిపోయినా ఆయన అస్తికలు మాత్రం ఇంకా ఏ నదిలో కలపకుండా ఉండడంతో ఇంట్లో ఎలాంటి శుభకార్యం జరపకూడదని శాస్త్రి చెప్పడంతో కూతురు పెళ్లి కోసం.. ఇష్టం లేకున్నా వీరాంజనేయులు కొడుకు.. కుటుంబంతో సహా అస్థికలు కలపడానికి బయల్దేరతారు. అది కూడా వీరాంజనేయులు తన అస్థికలను గంగలో కలపమని కోరడు.. గోవాలో కలపమని కోరడంతో.. చేసేది లేక గోవాకే బయల్దేరతారు. ఇక అలా వెళ్తున్న ఈ కుటుంబానికి మధ్యలో ఎదురైనా పరిస్థితులు ఏంటి..? చివరికి వీరు గోవా చేరుకున్నారా.. ? లేదా.. ? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే.

ఇందులో బ్రహ్మీ కనిపించకపోయినా.. అస్థికలకు బ్రహ్మీ వాయిస్ పెట్టడంతో.. ఆయన కూడా ఈ సిరీస్ లో భాగమే అని చెప్పొచ్చు. ఇక ఇలాంటి పాత్రలు నరేష్ కు కొట్టిన పిండి. ప్రస్తుతం ఈ సిరీస్ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈటీవి విన్‌లో ఆగస్టు 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ సిరీస్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×