Sankranthiki Vasthunnam:ఈ ఏడాది సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమాలలో వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం (Sankrantiki Vasthunnam) సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా విడుదలకు ముందు అంత అంచనాలు లేవు. ట్రైలర్ కూడా అంత బాలేదు అని టాక్ వినిపించింది. ముఖ్యంగా డాకు మహారాజ్(Daku Maharaj) , గేమ్ ఛేంజర్ (Game Changer) ముందు వెంకీ మామ సినిమా వేస్టే అంటూ చాలామంది రివ్యూలు కూడా ఇచ్చారు. కానీ కట్ చేస్తే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. రూ.500 కోట్ల బడ్జెట్ పెట్టిన పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ (Game Changer) డిజాస్టర్, డాకు మహారాజ్ బ్రేక్ ఈవెన్ కూడా రాబట్టలేకపోయింది. దీంతో ఈ సినిమాను కూడా మర్చిపోయారు. చాలా చోట్ల గేమ్ ఛేంజర్,డాకు మహారాజ్ సినిమాలను తీసేసి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాను వేస్తున్నారు.అలా రెండు బ్లాక్ బస్టర్ అవుతాయి అనుకున్న సినిమాలను పక్కకు నెట్టేసి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ కొట్టాడు వెంకీ మామ..
ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ కొట్టిన సంక్రాంతికి వస్తున్నాం..
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో వెంకటేష్ (Venkatesh) అరుదైన రికార్డ్ క్రియేట్ చేశారు. మరి ఇంతకీ వెంకటేష్ క్రియేట్ చేసిన ఆ రికార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం.. దిల్ రాజు నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వం వహించారు.అనిల్ రావిపూడి తాను నమ్ముకున్న కామెడీ జాలర్లోనే ఈ సినిమాని చేశారు. కట్ చేస్తే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్.. వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh),మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary) లు హీరోయిన్ లుగా నటించారు. ఇక ఈ సినిమా చూడడానికి కుటుంబ కథా ప్రేక్షకులు పరుగులు పెడుతున్నారు. దాంతో భారీ కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సినిమా విడుదలై మరో 10 రోజుల్లో నెల పూర్తవుతుంది. అయినప్పటికీ హౌస్ ఫుల్ బోర్డ్స్ తో థియేటర్లు కలకలలాడిపోతున్నాయి. ఇప్పటికే అల్లు అర్జున్ (Allu Arjun) ‘అల వైకుంఠపురంలో ‘ సినిమా రికార్డుని బ్రేక్ చేసింది సంక్రాంతికి వస్తున్నాం.అయితే తాజాగా సంక్రాంతికి వస్తున్నాం రూ.300 కోట్ల క్లబ్లో కూడా చేరింది.
రీజనల్ ఫిలిం గా సరికొత్త రికార్డు..
ఇక ఇప్పటివరకు ఉన్న సీనియర్ హీరోలలో రూ.300 కోట్ల క్లబ్లో చేరిన మొదటి హీరోగా వెంకీ మామ పేరు తెచ్చుకున్నారు. అలాగే తాజాగా సినిమా కలెక్షన్స్ పోస్టర్ అఫీషియల్ గా విడుదల చేశారు సంక్రాంతికి వస్తున్నాం మూవీ మేకర్స్. రూ.303 కోట్లు కలెక్ట్ చేసినట్టు పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ వెంకీ ఫ్యాన్స్ సంతోషించాల్సిన మరో విషయం ఏమిటంటే.. ఒక రీజినల్ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి రూ.303 కోట్ల వసూళ్లను రాబట్టింది అంటే మామూలు విషయం కాదు. రీజనల్ సినిమా ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ రికార్డు క్రియేట్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. అలాగే వెంకటేష్(Venkatesh) సినీ కెరియర్ లో ఈ సినిమా ఓ మైలురాయి అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వెంకీ సినిమాలలో ఫస్ట్ రోజు రూ.45 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఒక మంచి ముద్ర వేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు.