E-Paper
Advertisement

OMG Movie Teaser: భయపెట్టడానికి హీరోయిన్ తో కలిసివస్తున్న స్టార్ కమెడియన్..!

OMG Movie Teaser: భయపెట్టడానికి హీరోయిన్ తో కలిసివస్తున్న స్టార్ కమెడియన్..!
Advertisement

Vennela Kishore’s OMG Movie Teaser Out Now: స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ చారి 111 సినిమాతో హీరోగా మారిన విషయం తెల్సిందే. ఈ సినిమా థియేటర్ లో ఆశించిన ఫలితాన్ని అందివ్వలేకపోయినా ఓటిటీలో మాత్రం అదరగొట్టేసింది. ఇక ఈ సినిమా తరువాత వెన్నెల కిషోర్ హీరోగా రెండో సినిమాను సెట్ చేసేశాడు. వెన్నెల కిషోర్, షకలక శంకర్ ప్రధాన పాత్రల్లో నందితా శ్వేతా హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం OMG. ఓ మంచి గోస్ట్ అనేది ట్యాగ్ లైన్. శంకర్ మార్తాండ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డాక్టర్ అబినికా ఇనాబతుని నిర్మిస్తుంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మధ్యకాలంలో హర్రర్ సినిమాలు మంచి విజయాలను అందుకుంటున్నాయి. వెన్నెల కిషోర్ కూడా ఇప్పుడు అదే హర్రర్ కథాంశంతో వస్తున్నట్లు టీజర్ బట్టి అర్ధం అవుతుంది. టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ” పూర్వ జన్మ జ్ఞానంతో రెండో జన్మ ఎత్తే అవకాశం ఏ జీవికి కూడా ఉండదు.. దెయ్యాలకు మాత్రమే ఉంటుంది” అనే డైలాగ్ తో టీజర్ మొదలయ్యింది.

Advertisement

Also Read: Ram Charan: దారుణం.. చరణ్ ను పట్టుకొని నలిపేసిన అభిమానులు.. వీడియో వైరల్

ప్రతి హర్రర్ కథలో చూపించనట్లే ఒక పెద్ద బంగ్లా.. అందులో దెయ్యాలు.. ఆ దెయ్యాలను బయటికి పంపడానికి వచ్చిన మంత్రగాళ్ళు ఇలా చూపించారు. ఇక వెన్నెల కిషోర్, షకలక శంకర్ అనుకోకుండా ఆ బంగ్లాలో ఇరుక్కుపోతారు. దెయ్యంగా మారిన నందితా వారితో ఒక ఆట ఆడుకుంటుంది. అసలు ఆ బంగ్లాలోకి వెన్నెల కిషోర్ ఎందుకు వెళ్లాడు..? నందితా శ్వేత దెయ్యంగా ఎందుకు మారింది.. ? ఆమె రివెంజ్ ఎవరిమీద.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతో వెన్నెల కిషోర్ ఎలా భయపెడతాడో చూడాలి.

Advertisement

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×