Venu Swamy..ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి (Venu Swamy) గత కొన్ని సంవత్సరాలుగా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ.. వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా నాగచైతన్య (Naga Chaitanya)- సమంత (Samantha) విడాకుల తర్వాత విడిపోతారని ఎప్పుడైతే చెప్పారో.. ఆ తర్వాత నాలుగేళ్లకే వాళ్లు విడిపోవడంతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసారు వేణు స్వామి. ఇక తర్వాత పలువురు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇక దీనికి తోడు స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) జాతకం బాలేదని, ‘బాహుబలి’ సినిమా తర్వాత ఆయన చేసే సినిమాలు డిజాస్టర్ గా నిలుస్తాయని, ఆది పురుష్, రాధేశ్యామ్ సినిమాలు కూడా ఫ్లాప్ అవుతాయని చెప్పడం, నిజంగానే అవి బోల్తా కొట్టడంతో అందరూ కూడా నిజమే అనుకున్నారు. అయితే ఇదిలా ఉండగా.. కొన్ని కొన్ని సార్లు ఆయన చెప్పిన జోస్యం బెడిసి కొట్టి, బొక్క బోర్ల పడ్డ విషయం తెలిసిందే. ముఖ్యంగా రాజకీయాలపై ఈయన చేసిన కామెంట్లు ఈయనను విమర్శలకు గురయ్యేలా చేశాయి. తెలంగాణ , ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, ఐపీఎల్ విషయంలో కూడా వేణుస్వామి చెప్పిన అంచనాలు మిస్ అయ్యాయి. దీనికి తోడు నాగచైతన్య, శోభిత వైవాహిక జీవితం పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపి.. మహిళా కమిషన్ మొట్టికాయలు వేయడమే కాకుండా.. ఈ విషయం కోర్టు వరకు వెళ్ళింది. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ మూర్తితో వివాదంతో కూడా వేణు స్వామి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇక ఆ తర్వాత చాలా కాలం సైలెంట్ అయిన ఈయన ఇప్పుడు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ మళ్లీ సంచలన జోశ్యంతో వార్తల్లో నిలుస్తున్నారు.
ఒక హీరోయిన్, ఇద్దరు హీరోలు ఆత్మహత్య చేసుకుంటారు..
రెండు రోజుల క్రితం ఈయన మాట్లాడిన ఒక ఆడియో ఒకటి లీక్ అయింది. దాని ప్రకారం ముగ్గురు స్టార్స్ త్వరలో చనిపోతారని, అందులో ఒక హీరోయిన్, ఒక హీరో ఆత్మహత్య చేసుకుంటారని కూడా వేణు స్వామి చెప్పారు. వారు ఎవరో కాదు సమంత, విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), ప్రభాస్ జాతకాల గురించి చెబుతూ ప్రభాస్ కి ఒంటినిండా గాయాలే ఉన్నాయి. కానీ అవి బయటకు రాకుండా టీం జాగ్రత్త పడుతోందని, ‘రాజా సాబ్’ చిత్రం ఆలస్యం అవ్వడానికి కారణం కూడా అదే అని తెలిపారు. ఇక అలాగే విజయ్ దేవరకొండ సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పి ఆశ్చర్యపరిచారు.
ALSO READ:OTT Play Awards 2025: ఓటీటీ ప్లే అవార్డ్స్ 2025.. విజేతలు వీరే
ఆ స్టార్ హీరో భార్య కూడా గురించి స్టార్ హీరోయిన్ తో పెళ్లి..
ఈ విషయాల నుండి బయటకు రాకముందే ఇప్పుడు.. ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఒక స్టార్ హీరో తన భార్యకు విడాకులు ఇచ్చి, ఒక స్టార్ హీరోయిన్ తో ఏడడుగులు వేయబోతున్నాడు అని చెప్పి బాంబు పేల్చారు.ఇక ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఇది విజయ్ దళపతి (Vijay Thalapathi), త్రిష(Trisha) లను ఉద్దేశించే అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల తమిళనాట రాజకీయాల్లోకి వచ్చింది విజయ్ మాత్రమే. అలాగే త్రిష తో ఆయన ప్రేమాయణం గురించి కూడా వార్తలు రోజు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ సమయంలోనే వేణు స్వామి ఇలా చెప్పాడు అని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మరి ఆయన వీరిని ఉద్దేశించి కామెంట్ చేశారా.. లేక మరెవరిరైనా కామెంట్ చేశారో తెలియదు కానీ ప్రస్తుతం ఈయన చెప్పిన జోస్యం నిజమవుతుందా లేదా అనే విషయంపై కూడా ఉత్కంఠ నెలకొంది.