BigTV English
Advertisement

OTT Play Awards 2025: ఓటీటీ ప్లే అవార్డ్స్ 2025.. విజేతలు వీరే

OTT Play Awards 2025: ఓటీటీ ప్లే అవార్డ్స్ 2025.. విజేతలు వీరే

OTT Play Awards 2025:నటీనటులు ఒకప్పుడు సినిమాలలో మాత్రమే నటించి ఆడియన్స్ ను అలరించే వాళ్ళు. కానీ కరోనా వచ్చిన తర్వాత ఓటీటీల హవా బాగా పెరిగిపోవడంతో అటు ఓటీటీలలో సినిమాలు చూడడానికి ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇకపోతే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ వేదికగా ఒక సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లు, పలు షోలు కూడా ప్రసారం అవుతూ అభిమానులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.ఇక ఎప్పటిలాగే సినిమాల ద్వారా ప్రేక్షకులను మెప్పించి, ఉత్తమ నటన కనబరిచిన నటీనటులకు అవార్డ్స్ ఇస్తున్నట్టుగానే.. ఈ ఓటీటీ వేదికగా కూడా ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులకు, వెబ్ సిరీస్ లకు ,ఉత్తమ వ్యాఖ్యాతలకు కూడా ఈ ఓటీటీ ప్లే అవార్డ్స్ ప్రకటించించడం జరుగుతుంది. ఇక ఈ ఏడాది కూడా 2025 సంవత్సరానికి గానూ ఉత్తమ ఓటీటీ ప్లే అవార్డ్స్ అందుకున్నారు సెలబ్రిటీలు.


ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుత వినోద రంగంలో సినిమాలకు ధీటుగా ఓటీటీ కంటెంట్.. ప్రేక్షకులను అలరిస్తూ.. వినూత్న కథలు, కథాంశాలతో సినిమాలు, వెబ్ సిరీస్లను రూపొందించి, దర్శకులు, నటులు, తమను తాము సరికొత్తగా ఆవిష్కరించుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోని ఓటీటీలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని నెటిజన్లకు అందిస్తూ.. “ఓటీటీ ప్లే: వన్ నేషన్ వన్ అవార్డు” పేరుతో ఓటీటీ వేదికగా ప్రతిభ చాటిన నటీనటులు, దర్శకులకు అవార్డులు ప్రధానం చేస్తుండగా.. అందులో తాజాగా మూడో ఎడిసన్ అట్టహాసంగా జరిగింది.

ఇక ఓటీటీ చిత్రాలకు దక్కిన అవార్డుల విషయానికి వస్తే..


ఉత్తమ చిత్రం : గర్ల్స్ విల్ బి గర్ల్స్ (అలీ ఫజల్, రిచా చద్దా)

ఉత్తమ నటుడు (పాపులర్): మనోజ్ బాజ్ పేయి (డిస్పాచ్)

ఉత్తమ దర్శకుడు (ఫిలిం) :ఇంతియాజ్ అలీ (అమర్ సింగ్ చంకీలా)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్): అనుపమ్ ఖేర్ ( విజయ్ 69, డి సిగ్నేచర్)

ఉత్తమ నటి (పాపులర్): కాజోల్ (దోపత్తి)

ఉత్తమ నటి (క్రిటిక్స్): పార్వతి తిరువొత్తు (మనోరథంగల్)

ఉత్తమ విలన్ : సన్నీ కౌశల్ (ఫిర్ ఆయే హసీనా దిల్ రూబా)

ఉత్తమ హాస్య నటి : ప్రియమణి (భామాకలాపం 2)

ఉత్తమ నటన ప్రతిభ (మేల్ ): అవినాష్ తివారి (ది మెహతా బాయ్స్)

ఉత్తమ నటన ప్రతిభ (ఫిమేల్): షాలిని పాండే (మహారాజ్)

Film industry: ఇద్దరు స్టార్ హీరోల మధ్య డిజిటల్ వార్.. సొంత ఖర్చుతో పక్కోడికి నష్టం..!

ఓటీటీ స్పెషల్ అవార్డ్స్..

ఉత్తమ టాక్ షో వ్యాఖ్యాత: రానా దగ్గుబాటి (ది రానా టాక్ షో)

ఉత్తమ రియాలిటీ షో : ది ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్

ఉత్తమ నాన్ స్క్రిప్ట్ షో: షార్క్ ట్యాంక్

ట్రయల్ బ్లేజర్ ఆఫ్ ది ఇయర్: శ్రీ మురళి (భఘీర), దివ్య దత్ (శర్మాజీ కా బేటి, బండిష్ బండిట్స్ 2)

బహుముఖ ప్రదర్శన నటుడు: సిద్ధాంత గుప్తా (బ్లాక్ వారెంట్, ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్)

బహుముఖ ప్రదర్శన నటి: కనీ కుశృతి (తలై మలై సెయ్యలాగమ్, గర్ల్స్ విల్ బి గర్ల్స్, ఓచర్)

ఉత్తమ డాక్యుమెంటరీ సిరీస్: ది రోషన్స్

ఉత్తమ పరిచయ వెబ్ సిరీస్ నటి : వేదిక (యక్షిణి)

ఉత్తమ ప్రామిసింగ్ నటి : హీనా ఖాన్ (గృహలక్ష్మి)

ఇక వీరితోపాటు వెబ్ సిరీస్ లలో అదరగొట్టిన పలువురికి అవార్డులు లభించాయి. అందులో ముఖ్యంగా

ఉత్తమ వెబ్ సిరీస్: పంచాయత్ 3

ఉత్తమ దర్శకుడు : నిఖిల్ అడ్వాణీ (ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్)

ఉత్తమ నటి (క్రిటిక్స్): నిమిషా సజయన్

ఉత్తమ నటి (పాపులర్): అదితి రావు హైదరి (హీరా మండి)

ఉత్తమ సహాయ నటి : జ్యోతిక (డబ్బా కార్టెల్) లకు ఈ ఓటీటీ ప్లే అవార్డ్స్ లభించాయి.

Related News

Mithra Mandali OTT : ఓటీటీలోకి ‘మిత్రమండలి’… రీ-లోడెడ్ వెర్షన్ వర్కౌట్ అవుతుందా ?

November 2025 OTT releases : ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ నుంచి ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ వరకు… ఈ నెల ఓటీటీలో మోస్ట్ అవైటింగ్ సిరీస్ లు

OTT Movie : ‘గర్ల్ ఫ్రెండ్’ రిలీజ్ కంటే ముందు చూడాల్సిన రష్మిక మందన్న టాప్ 5 మూవీస్… ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : టీనేజర్ల పాడు పనులు… బాయ్ ఫ్రెండ్ ను ఊహించుకుని… చిన్న పిల్లలు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే పోతారు మొత్తం పోతారు… డెడ్లీయెస్ట్ మూవీ ఎవర్… ఒంటరిగా చూసే దమ్ముందా ?

OTT Movie : మంత్రగాడి అరాచకం… అమ్మాయి దొరగ్గానే వదలకుండా అదే పని… చిన్న పిల్లలు చూడకూడని చిత్రం భయ్యా

OTT Movie : ఊహించిన దానికంటే ముందుగానే ఓటీటీలోకి ‘మాస్ జాతర’… ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే ?

OTT Movie : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?

Big Stories

×