Aamir Khan..బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మిస్టర్ పర్ఫెక్ట్ గా గుర్తింపు సొంతం చేసుకున్న అమీర్ ఖాన్ (Aamir Khan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ మధ్యకాలంలో వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న ఈయన.. తొలిసారి తన మాజీ భార్య రీనా దత్త (Reena Dutta) గురించి మాట్లాడి, అందరిని ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా రీనాను ఎంతగానో ప్రేమించానని, ఎంతో ఆనందంగా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ.. అనూహ్యంగా విడాకులు తీసుకోవాల్సి వచ్చిందని, ఈ అనూహ్య పరిణామాలు తనను దేవదాసును చేసేసాయి అంటూ ఎమోషనల్ అయ్యారు అమీర్ ఖాన్.
మత్తుకు బానిసయ్యి.. దేవదాస్ అయ్యాను – అమీర్ ఖాన్
అమీర్ ఖాన్ తన మాజీ భార్య రీనా దత్త గురించి మాట్లాడుతూ.. రీనాను ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్నాను. కానీ మా ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏ కారణం చేత వచ్చాయో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు. ఇక ఆమె నుండి విడిపోయిన సమయంలో ఎంతో బాధపడ్డాను. మూడేళ్ల పాటు నరకం చూశాను. పనిపై దృష్టి పెట్టలేకపోయాను. దాంతో సినిమా షూటింగ్ లకి కూడా దూరంగా ఉన్నాను. ఇక స్క్రిప్ట్ కూడా వినాలని అనిపించేది కాదు. ఇంట్లో ఒంటరిగా కూర్చుని ఆమెనే తలుచుకుంటూ ఎంతో బాధపడిపోయాను.. నిద్ర కూడా పట్టేది కాదు. మనశ్శాంతి కోసం మద్యం అలవాటు చేసుకున్నాను. అసలు ఆల్కహాల్ అంటే ఏంటో కూడా తెలియని నేను ఉన్నట్టుండి రోజుకో బాటిల్ తాగడానికి అలవాటు పడ్డాను. ఒక రకంగా చెప్పాలి అంటే ఏడాదిన్నర పాటు మత్తుకు బానిస అయిపోయాను. దేవదాసు అయిపోయాను. తీవ్రంగా మానసికంగా కృంగిపోయాను. నన్ను ఇష్టపడిన వారు పక్కన లేకుండానే జీవితాన్ని కొనసాగించాలని తెలుసుకొని.. ఇక అప్పటినుంచి ఒక్కొక్కటిగా బాధను దిగమింగుకుంటూ.. మళ్లీ సహజత్వంలోకి వచ్చి, నన్ను నేను మార్చుకున్నాను” అంటూ అమీర్ ఖాన్ తెలిపారు. మొత్తానికైతే భార్య నుంచి విడిపోయిన తర్వాత ఈయన ఎంతో కృంగిపోయినట్లు తెలుస్తోంది.
ALSO READ:Manchu Lakshmi: గత ఐదేళ్లుగా నరకం అంటే ఏంటో చూస్తున్నాను – మంచు డాటర్..!
అమీర్ ఖాన్ – రీనా దత్తా ప్రేమ, పెళ్లి విషయాలు..
ఇకపోతే 1986లో అమీర్ ఖాన్, రీనా దత్తాను ప్రేమించుకొని మరీ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి కుమార్తె ఐరా ఖాన్, కుమారుడు జునైద్ ఖాన్ జన్మించిన విషయం తెలిసిందే. ఇకపోతే పిల్ల పాపలతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్న ఈ జంట మధ్య అనూహ్యంగా పదహారేళ్ళకే మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. ఇక తర్వాత అమీర్ ఖాన్ కిరణ్ రావ్ (Kiran Rao) ను వివాహం చేసుకోగా.. 2021లో వీరిద్దరూ కూడా విడిపోయారు. ప్రస్తుతం ఆయన తన స్నేహితురాలు గౌరీతో రిలేషన్ లో ఉన్నారు. ఏది ఏమైనా భార్య నుంచి విడిపోయిన తర్వాత తాను పడ్డ నరకం గురించి అభిమానులతో పంచుకొని మరింత ఎమోషనల్ అయ్యారు అమీర్ ఖాన్. ఇక ప్రస్తుతం అమీర్ ఖాన్ కి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈయన నటించిన పలు చిత్రాలు అటు బాలీవుడ్ ఆడియన్స్ నే కాదు ఇటు సౌత్ ఆడియన్స్ ను కూడా మెప్పించాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సౌత్ సెలబ్రిటీలతో ఎక్కువగా కలుస్తూ.. దక్షిణాది కూడా మరింత ఫేమ్ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.