Minister Uttam Kumar Reddy: సన్న బియ్యం పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సన్నబియ్యం పథకాన్ని ఉగాది రోజున ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. ఈ నెల 30 వ తేదీన హుజుర్ నగర్ పట్టణంలో సన్న బియ్యం పంపిణీ స్కీం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలో ఏప్రిల్ నెల నుంచి రేషన్ కార్డు ఉన్న వాళ్ళ అందరికీ ఆరు కేజీలు సన్న బియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో 84 శాతం మందికి సన్న బియ్యం అందుతాయని ఆయన తెలిపారు. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారని మంత్రి చెప్పారు. సన్న బియ్యం పంపిణీలో అవకతవకలు లేకుండా పకడ్బందీగా అమలు చేస్తామని మంత్రి చెప్పుకొచ్చారు.
ALSO READ: KTR: కేటీఆర్ సభలో బుల్లెట్ కలకలం.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు..
నీటి పారుదల శాఖా మంత్రి ఉండడం తాను అదృష్టంగా భావిస్తున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కృష్ణా జలాల్లో కొంచెం నీటి కొరత ఉండడం నిజమేనని.. శ్రీశైలం నుంచి కరెంట్ తయారు చేసేందుకు నీటిని రిలీజ్ చేసి.. వాటిని సాగర్ ప్రాజెక్ట్ లోకి విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. దీని కారణంగా కొంత నీటి కొరత తగ్గే అవకాశం ఉంటుందని మంత్రి చెప్పుకొచ్చారు. వీలైనంత వేగంగా.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీటి పారుదల ప్రాజెక్టుల కింద ఒక్క ఎకరం పంట ఎండినా రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అయితే బోర్ల కింద పంటలు ఎండితే ప్రభుత్వానికి మాత్రం సంబంధం లేదని తెలిపారు. ఈ ఎండా కాలంలో వరి ఎంత వేయాలో రైతులకు తెలుసునని మంత్రి చెప్పారు. ప్రాజెక్టుల కింద వరి పంటలకు సాగు నీరు అందేలా చూసేందుకు వారానికి ఒకసారి సమీక్ష చేస్తున్నామని మంత్రి తెలిపారు.
ALSO READ: BOI Recruitment: మంచి అవకాశం.. డిగ్రీ అర్హతతో 400 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు