BigTV English

Rakul Preeth Singh: మాట మీద నిలబడవా స్వామీ? వేణు స్వామిపై నెటిజనుల ట్రోలింగ్స్

Rakul Preeth Singh: మాట మీద నిలబడవా స్వామీ? వేణు స్వామిపై నెటిజనుల ట్రోలింగ్స్

Venu Swamy telling future of Rakul preeth Singh might be divorce


వివాదాల బ్రాండ్ అంబాసిడర్ వేణు స్వామి మరో సారి జోస్యం చెప్పారు. ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి హీరోల విషయాలలో వేణు స్వామి చెప్పిన జాతకాలు తిరగబడ్డాయి.ప్రభాస్ కు ఇక సినిమా రంగంలో హిట్ ఉండదని జోస్యం చెప్పారు. రీసెంట్ గా కల్కి బ్లాక్ బస్టర్ మూవీగా ఇండియాలో అన్ని సినిమాల రికార్డులు బద్దలు కొడుతోంది. సినిమా హిట్ అవడంతో వేణు స్వామి మీద నెటినజన్స్, ప్రభాస్ ఫాన్స్ విరుచుకుపడ్డారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఎన్నికలలో ఓడిపోతారని చెప్పి తర్వాత తన జోస్యం ఫలించకపోవడంతో మీడియా ముఖంగా ఇకపై తాను జోస్యం చెప్పనని..సెలబ్రిటీల విషయంలో అస్సలు ఓపెన్ కానని ప్రగల్భాలు పలికారు. మళ్లీ మాట మార్చేసి మరో హీరోయిన్ ను టార్టెట్ చేశారు.

పీకల్లోతు కష్టాల్లో రకూల్


కెరటం అనే మూవీతో యువ కెరటంలా సినీ రంగానికి దూసుకొచ్చింది ఈ రకూల్ ప్రీత్ సింగ్. ఆ సినిమా అంతగా విజయవంతం కాలేదు. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీ ఛాన్స్ దక్కించుకుంది. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ , రామ్ చరణ్ లతోనూ నటించి కమర్షియల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తాయని ఆశపడింది. బాలీవుడ్ లో విజయావకాశాలు దక్కక మళ్లీ టాలీవుడ్ కే ఎంట్రీ ఇద్దామనుకుంది. ఇటీవల ఆమె నటించిన భారతీయుడు-2 సినిమా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. రకూల్ టాలీవుడ్ నిర్మాతను ప్రేమించి వివాహం చేసుకుంది. భర్తతో కలిసి సొంత నిర్మాణ సంస్థలో భాగస్వామి అయింది. అయితే ఆ సినిమా ఆర్థికంగా నష్టాలను తెచ్చిపెట్టింది. చోటే మియాన్ బడే మియాన్ సినిమాను సొంతంగా భర్తతో కలిసి ప్రొడ్యూస్ చేసింది. అయితే అది కాస్తా బయ్యర్లకు రూ.250 కోట్ల నష్టం తెచ్చిపెట్టింది. ఇటీవల కమల్ హాసన్ తో కలిసి శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు 2 చేసింది. ఆ మూవీ తో మళ్లీ సౌత్ ఛాన్సులు రాబట్టుకోవచ్చని భావించింది. అయితే భారతీయుడు డిజాస్టర్ కావడంతో రకూల్ ఆశలన్నీ ఆవిరయ్యాయి. మరో పక్క డ్రగ్స్ కేసులో పట్టుబడిన తమ్ముడి వ్యవహారం ఇలా ఫ్యామిలీ, బయట సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది రకూల్.

రకూల్ ను టార్గెట్ చేశాడు

సెలబ్రిటీల జాతకాల స్వామిగా చెప్పుకుంటున్న వేణు స్వామి రకూల్ పర్సనల్ లైఫ్: పై బాంబు లాంటి వార్త పేల్చాడు. రకూల్ కు పెళ్లి కాకముందే తాను అనేక సమస్యలు వస్తాయని చెప్పానని..ఇప్పుడు అదే నిజమయిందని..రకూల్ భర్త అనేక ఆర్థిక సమస్యలలో చిక్కుకుని చివరకు తన సినిమా యూనిట్ సభ్యులకు కూడా జీతాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వేణు స్వామి మరో ఆరు నెలలలో ఈ జంట విడిపోబోతోందని జాతకం చెప్పారు. అప్పుడెప్పుడో సమంత, నాగచైతన్య విషయంలో వేణు స్వామి చెప్పిన జాతకం నిజం కావడంతో వేణు స్వామి ఒక్కసారిగా సెలబ్రిటీ స్వామిగా మారిపోయాడు. ఆ తర్వాత ఆయన చెప్పే జాతకాలు ఏవీ వర్కవుట్ కావడం లేదు. ఏపీలో మరోసారి వచ్చేది జగన్ పాలనే అని కూడా చెప్పారు.

అప్పుడలా..ఇప్పుడిలా

నెటిజన్స్ ట్రోలింగులతో భయపడిపోయిన వేణుస్వామి ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో ఇకనుంచి తాను సెలబ్రిటీలకు జాతకాలు చెప్పనని..అప్పటి పరిస్థితులను బట్టి చెప్పాల్సి వచ్చిందని చెప్పారు. దానితో అందరూ హమ్మయ్య ఇక వేణు స్వామి సైలెంట్ అయిపోతాడని భావించారు. మళ్లీ మరోసారి రకూల్ ప్రీత్ సింగ్ మరో ఆరు నెలలో విడాకులు తీసుకోబోతోందని చెప్పడంతో ట్రోలింగులు మొదలు పెట్టారు. జాతకాలు చెప్పనని చెప్పి మళ్లీ ఇదేంటి వేణు స్వామి..మాట మీద నువ్వు అస్సలు నిలబడవా? నీకు ఇదేం పిచ్చి అంటూ బాహాటంగా ట్రోలింగులు చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×