BigTV English
Advertisement

Vettaiyan Day 2 Collections: జైలర్ మేనియా షురూ.. రజినీ మాస్ కుమ్ముడు..!

Vettaiyan Day 2 Collections: జైలర్ మేనియా షురూ.. రజినీ మాస్ కుమ్ముడు..!

Vettaiyan Day 2 Collections.. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ టీ.జే. జ్ఞానవేల్ (TJ Gnanavel)దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth)తాజాగా నటించిన చిత్రం వేట్టయాన్ (Vettaiyan). భారీ అంచనాల మధ్య అక్టోబర్ 10వ తేదీన దసరా పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకొని కలెక్షన్లు సునామి సృష్టిస్తోంది.. నిజానికి ఈ సినిమాకు ఎటువంటి ప్రమోషన్స్ చేపట్టలేదు. ఒకవైపు చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉండగా.. మరొకవైపు రజినీకాంత్ అనారోగ్య సమస్యతో ప్రమోషన్స్ కి దూరమయ్యారు. దీంతో సినిమా విజయం సాధించడం కష్టమే అంటూ కొంతమంది కామెంట్లు చేశారు.


జైలర్ మేనియా షురూ..

అదే సమయంలో గతంలో జైలర్ సినిమా సమయంలో కూడా ఇదే వార్తలు వినిపించాయి. జైలర్ సినిమాకి కూడా ఎటువంటి ప్రమోషన్స్ చేపట్టలేదు. కానీ నెమ్మదిగా పుంజుకుంటూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు వేట్టయాన్ పరిస్థితి కూడా అదే అని కొంతమంది కామెంట్లు చేశారు. అయితే అందరూ చెప్పినట్లుగానే వేట్టయాన్ కూడా ఎటువంటి ప్రమోషన్స్ లేకుండానే విడుదలయ్యి ఇప్పుడు భారీ కలెక్షన్లు అందుకుంటూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే రెండవ రోజు కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అనే విషయం ఇప్పుడు చూద్దాం.


మొదటి రోజు కలెక్షన్స్..

టీ.జే . జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన యాక్షన్ డ్రామా సినిమాలో రజనీకాంత్ సోలో హీరోగా నటించగా.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి , ఫహాద్ ఫాజిల్ , మంజు వారియర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. పాన్ ఇండియా మూవీగా వచ్చిన ఈ సినిమా విడుదలైన రోజు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది . కానీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. రజనీకాంత్ 170 చిత్రం గా వచ్చిన ఈ సినిమా తెలుగు ,తమిళ్, కన్నడ , హిందీ, మలయాళం భాషలో విడుదల అయింది. ఇక ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ,ట్రైలర్, ఫస్ట్ లుక్ పోస్టర్, బీజీఎం అన్నీ కూడా మరో లెవెల్ కి సినిమాను తీసుకెళ్లాయని చెప్పవచ్చు. ఈ సినిమాలో ప్రధానంగా రజనీకాంత్ మేనరిజం ఓ లెవెల్ లో ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆయన మాస్ లుక్ అందర్నీ ఆకట్టుకుంది ఇక కలెక్షన్ల పరంగా చూసుకుంటే మొదటిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ .68.4 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. తమిళ ఇండస్ట్రీలో విడుదలైన సినిమాలలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన మూవీ జాబితాలో సెకండ్ ప్లేస్ దక్కించుకుంది.

రెండవ రోజు కలెక్షన్స్..

రెండవ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. తమిళనాడులో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ కాస్త పడిపోయాయి తమిళనాడులో రూ.13.31 కోట్లు వసూలు చేయగా.. కర్ణాటకలో రూ .2.5 కోట్లు, కేరళలో రూ.2.25 కోట్లు, తెలంగాణలో రూ .99 లక్షలు, ఆంధ్రప్రదేశ్లో రూ.91 లక్షలు మాత్రమే వసూలు అయ్యాయి. ఇక హిందీలో రూ.32 లక్షలు మాత్రమే వసూలు చేసింది ఈ సినిమా.. మొత్తంగా ఇండియా వైడ్ చూసుకున్నట్లయితే రూ.20.49 కోట్లు నెట్ కలెక్ట్ వసూలు చేసింది. ఇక రెండవ రోజు దాదాపు రూ.36 కోట్ల గ్రాస్ వసూలు చేసి హిట్ జాబితాలో చేరి దూసుకుపోతోంది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×