BigTV English

Vettaiyan: మూవీ బజ్ లేదు.. మళ్లీ జైలర్ మ్యాజిక్ జరిగేనా..?

Vettaiyan: మూవీ బజ్ లేదు.. మళ్లీ జైలర్ మ్యాజిక్ జరిగేనా..?

Vettaiyan.. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ టీ.జే జ్ఞానవేల్ (TJ.Gnanavel ) దర్శకత్వంలో సౌత్ సూపర్ స్టార్ హీరో రజనీకాంత్ (Rajinikanth)హీరోగా నటిస్తున్న చిత్రం వేట్టయాన్ (Vettaiyan). అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి ఏకంగా రూ.160 కోట్ల బడ్జెట్ కేటాయించారు. అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) సత్యదేవ్ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు సమాచారం. మరొకవైపు మంజు వారియర్ , దుషారా విజయన్, రితికా సింగ్ , రాణా దగ్గుబాటి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇకపోతే అక్టోబర్ 10 వ తేదీన సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. కానీ ఇప్పటివరకు ఈ సినిమాపై ఎటువంటి బజ్ కనిపించకపోవడం అభిమానులలో ఆందోళనలు కలిగిస్తోంది.


మూవీ పై బజ్ కనిపించడం లేదే..

సాధారణంగా ఒక సినిమా విడుదల తేదీ దగ్గర పడుతోందంటే.. కచ్చితంగా సినిమా ప్రమోషన్స్ జోరుగా చేపట్టాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమా హీరో రజనీకాంత్ ఇటీవలే అనారోగ్య సమస్యతో బయటపడ్డారు. ఇటీవలే కడుపులో ప్రధాన రక్తనాళం కి వాపు రావడంతో వైద్యులు చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు. మరో వారం రోజులపాటు ఆయనను విశ్రాంతి తీసుకోవాలని కూడా సూచించారు. ఇలాంటి సమయంలో ఆయన బయటకు వచ్చి తన సినిమాను ప్రమోట్ చేయడం అంటే అత్యంత సాహసంతో కూడుకున్న పని. దీనికి తోడు చిత్ర బృందం కూడా ప్రమోషన్స్ చేపట్టకుండా సైలెంట్ అయిపోయారు. ఒకరకంగా చెప్పాలి అంటే సినిమా ప్రమోషన్స్ చేయకపోవడం వల్లే.. ఈ సినిమా ఎక్కువగా ఆడియన్స్ కి రీచ్ అవ్వడం లేదు. ఒకరకంగా చెప్పాలి అంటే ప్రమోషన్స్ చేయకపోవడమే సినిమాకి మైనస్ గా మారుతోంది అని చెప్పవచ్చు.


అది కూడా మైనస్ గా మారనుందా..

దీనికి తోడు తెలుగు ఆడియన్స్ లో కూడా సినిమాపై ఆసక్తి కలగడం లేదు. ఎందుకంటే సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు కానీ తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా టైటిల్ మార్చకపోవడం కూడా సినిమాకు మైనస్ అనే చెప్పాలి. సాధారణంగా తమిళ్ సినిమా అయినప్పటికీ తెలుగులో విడుదల చేస్తున్నారు అంటే అందులోని డైలాగ్స్ ను మాత్రమే డబ్బింగ్ చేస్తే సరిపోదు టైటిల్ కూడా తెలుగు ప్రేక్షకులకు అర్థమయ్యేలా ఉండాలి. కానీ ఈ విషయంపై చిత్ర బృందం పట్టి పట్టనట్టుగా ఉండడంతో తెలుగు ఆడియన్స్ కూడా ఈ సినిమా పై ఆసక్తి చూపించడం లేదు. ఒకరకంగా చెప్పాలి అంటే తెలుగు మార్కెట్ కూడా కష్టమే అన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇన్ని మైనస్ల మధ్య రజనీకాంత్ మూవీ ఏ విధంగా ప్రేక్షకులను మెప్పిస్తుంది అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.

జైలర్ మ్యాజిక్ జరిగేనా..

అయితే మరొకవైపు జైలర్ మ్యాజిక్ జరుగుతుందేమో అని రజనీకాంత్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నిజానికి జైలర్ సినిమా విడుదల సమయంలో కూడా సినిమాపై ఎటువంటి బజ్ లేదు. కానీ కంటెంట్ ప్రేక్షకులకు మెచ్చడంతో సినిమా అనూహ్యంగా మంచి విజయం సాధించింది. ఇప్పుడు వేట్టయాన్ చిత్రంపై కూడా ఎటువంటి బజ్ కనిపించడం లేదు. ఒకవేళ ఈ సినిమా కూడా జైలర్ లాగే ఏదైనా మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×