BigTV English

Havya Vahini Engagement : దగ్గుబాటి వారింట పెళ్లిసందడి షురూ.. సైలెంట్ గా ఎంగేజ్ మెంట్

Havya Vahini Engagement : దగ్గుబాటి వారింట పెళ్లిసందడి షురూ.. సైలెంట్ గా ఎంగేజ్ మెంట్

Havya Vahini Engagement : దగ్గుబాటి వారింట పెళ్లి సందడి మొదలైంది. విక్టరీ వెంకటేశ్ -నీరజ దంపతుల రెండో కూతురు హవ్యవాహిని వివాహం జరగనుందని రెండురోజులుగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ముందుగా ప్రచారం జరిగినట్లుగా కీరవాణి కొడుకుతో కాదు.. విజయవాడకు చెందిన ఓ డాక్టర్ ఫ్యామిలీలో అబ్బాయితో హవ్యవాహిని పెళ్లి జరగనుందని నిన్ననే క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలో చాలా సింపుల్ గా, వెరీ సైలెంట్ గా హవ్యవాహిని నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. టాలీవుడ్ అగ్రహీరోలైన మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.


పెద్దగా ప్రచారం లేకుండా.. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా నిశ్చితార్థం జరిపించడంతో.. వెంకీ అభిమానులు ఆశ్చర్యపోయారు. చిన్న అప్డేట్ కూడా ఇవ్వకుండా ఇలా చేయడంపై కాస్త అసంతృప్తిగానే ఉన్నారు. వెంకటేష్ తన ఫ్యామిలీ వ్యవహారాలను ప్రైవేట్ గా ఉంచేందుకే ఇష్టపడుతాడు.కూతురి ఎంగేజ్ మెంట్ విషయంలోనూ అదే పాటించాడు. అయినా ఎంగేజ్ మెంట్ ఫొటోలు బయటికొచ్చాయి. వచ్చే ఏడాది మార్చి నెలలో హవ్యవాహిని వివాహం జరుగుతుందని తెలుస్తోంది. అయితే.. పెళ్లికొడుకు కుటుంబానికి సంబంధించిన వివరాలు మాత్రం ఎక్కడా తెలియకుండా గోప్యంగా ఉంచారు.

వెంకటేష్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సైంధవ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెరెమియా, సారా కీలక పాత్రల్లో నటించారు. నిహారిక ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో జనవరి 13న విడుదల కానుంది. వెంకటేష్ కెరియర్ లో తొలి పాన్ ఇండియా మూవీ ఇదే.


Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×