BigTV English

Tollywood: చైన్ స్మోకర్ గా మారిన యంగ్ బ్యూటీ.. 2 గంటల్లోనే 15 సిగరెట్లు.. మామూల్ది కాదుగా!

Tollywood: చైన్ స్మోకర్ గా మారిన యంగ్ బ్యూటీ.. 2 గంటల్లోనే 15 సిగరెట్లు.. మామూల్ది కాదుగా!

Tollywood:సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే కచ్చితంగా టాలెంట్, అందంతో పాటు కూసింత అదృష్టం కూడా ఉండాలి. టాలెంట్ ఎంత ఉన్నా అదృష్టం లేక అవకాశాలు రాకపోతే అది వేస్టే. అలాగే అదృష్టం ఉన్నా.. టాలెంట్ లేకపోతే అది కూడా సినీ ఇండస్ట్రీలో పనికిరాదు. అలా సినిమాల్లో కొనసాగాలంటే అందం, టాలెంట్, బ్యాక్ గ్రౌండ్, అదృష్టం ఇవన్నీ ఉండాలి. అయితే కొంతమంది ఇవన్నీ ఉన్నా కూడా రాణించలేరు. కానీ కొంతమంది ఓవర్ నైట్ లో స్టార్స్ అయిపోతారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరోయిన్ ను మాత్రం అందంగా లేదు, లావుగా ఉంది అనే కారణంతో దాదాపు 10, 12 సినిమాల నుండి హీరోయిన్ గా అవకాశం ఇచ్చి మరీ తొలగించారట. కట్ చేస్తే రూ.100 కోట్ల సినిమాలో హీరోయిన్ గా చేసింది. అయితే అలా ఫేమ్ వచ్చిందో లేదో ఏకంగా చైన్ స్మోకర్ గా మారి 2 నిమిషాల్లోనే 15 సిగరెట్లు కాల్చే స్థాయికి చేరుకుంది . మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? చైన్ స్మోకర్ గా మారడం వెనుక అసలు కారణం ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..


చైన్ స్మోకర్ గా మారిన బాలయ్య బ్యూటీ..

పది సినిమాల్లో హీరోయిన్ గా తొలగించి, అవమానించి, రూ.100 కోట్ల సినిమాతో పేరు తెచ్చుకున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు బాలీవుడ్ నటి విద్యా బాలన్ (Vidya Balan).. హీరోయిన్ విద్యాబాలన్ అంటే కేవలం బాలీవుడ్ లోనే కాకుండా తమిళ,తెలుగు ఇండస్ట్రీలో కూడా ఫేమస్ నటి.ముఖ్యంగా తమిళంలో సినిమాలు చేసిన ఈమె.. సిల్క్ స్మిత (Silk Smita) బయోపిక్ గా తెరకెక్కిన ‘ది డర్టీ పిక్చర్’ అనే మూవీలో చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమాతో విద్యాబాలన్ కెరీర్ హై రేంజ్ కి వెళ్ళిపోయింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన ఒక వ్యసనం తనకు ఇప్పటికీ అలాగే ఉంది అంటూ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది విద్యా బాలన్.. సిల్క్ స్మిత బయోపిక్ గా తెరకెక్కిన ది డర్టీ పిక్చర్ సినిమా కోసం విద్యాబాలన్ బాడీలో ఎన్నో మార్పులు చేసుకుందట. ఈ సినిమా కోసం దాదాపు 12 కిలోల బరువు పెరిగి అలాగే అసలు ధూమపానమే అలవాటు లేని విద్యాబాలన్ ఈ సినిమా కోసం ఏకంగా చైన్ స్మోకర్ గా మారిందట. అలా సినిమా షూటింగ్లో భాగంగా రెండు గంటల్లో దాదాపు 15 సిగరెట్లు కాల్చి అందరినీ ఆశ్చర్యపరిచిందట. అయితే సిల్క్ స్మిత రియల్ లైఫ్ లో సిగరెట్లు కాలుస్తుంది కాబట్టి తన బయోపిక్ లో సిగరెట్లు తాగే సీన్ ఉంటుంది.అలా ఈ సీన్ కోసం విద్యాబాలన్ 15 సిగరెట్లు రెండు గంటల్లో తాగి షూటింగ్ సెట్ లో ఉన్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందట.


ఆ నరకం నుండి ఇప్పటికీ బయటపడలేకపోతున్నా – విద్యాబాలన్

ఇక ఈ విషయం గురించి విద్యాబాలన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరమని నాకు కూడా తెలుసు. కానీ ఈ సినిమా తర్వాత నేను చైన్ స్మోకర్ గా మారిపోయాను. అయితే సినిమా షూటింగ్ వరకే చైన్ స్మోకర్ గా ఉండాలి అనుకున్నాను. కానీ ఆ తర్వాత ఈ వ్యసనాన్ని వదులుకోలేకపోయాను. ఇప్పటికి నేను చైన్ స్మోకర్ గానే ఉన్నాను. కానీ రోజుకి 3 సిగరెట్లు మాత్రమే తాగుతాను” అంటూ విద్యాబాలన్ చెప్పుకొచ్చింది. అలా సినిమా వల్ల వచ్చిన వ్యసనం అలాగే ఉండిపోయిందని విద్యాబాలన్ చెప్పింది. ఇక 40 ప్లస్ ఏజ్ లో ఉన్నా కూడా బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.

ALSO READ:Star Heroine: ఈమెతో నటిస్తే ఫ్లాప్ గ్యారెంటీ..ఆ హీరోల పాలిట యమగండం.. ఎవరంటే?

Related News

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

×