BigTV English

Star Heroine: ఈమెతో నటిస్తే ఫ్లాప్ గ్యారెంటీ..ఆ హీరోల పాలిట యమగండం.. ఎవరంటే?

Star Heroine: ఈమెతో నటిస్తే ఫ్లాప్ గ్యారెంటీ..ఆ హీరోల పాలిట యమగండం.. ఎవరంటే?

Star Heroine:సాధారణంగా ఏ సినీ ఇండస్ట్రీలోనైనా సరే ఒక జంట తెరపై కనిపించి, ఆడియన్స్ ను ఆకట్టుకుంది అంటే కచ్చితంగా మళ్ళీ అదే జంటను రిపీట్ చేస్తూ ఉంటారు. పైగా కొంతమంది దర్శకులకు, హీరోలకు కొంతమంది హీరోయిన్స్ లక్కీగా మారుతూ ఉంటారు. అలాంటి వారితో నటిస్తే హిట్ పక్కా అని నమ్మేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇంకొంతమంది హీరోయిన్స్ మాత్రం ఎంత మందితో నటించినా.. ఆ హీరోలకి ఫ్లాప్ ని మాత్రమే అందిస్తూ ఉంటారు. అందుకే మళ్ళీ ఆ హీరోయిన్ తో నటించాలంటే హీరోలు కూడా వెనుకడుగు వేస్తూ ఉంటారు. అలా ఇప్పుడు కూడా ఈమెతో నటిస్తే ఫ్లాప్ గ్యారెంటీ అని, ఈమె హీరోల పాలిట శాపంగా మారింది అంటూ ఒక హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. మరి ఆమె ఎవరు ? ఎవరితో సినిమా చేసింది? ఆ సినిమాల ఫలితాలు నిజంగానే ఫ్లాప్ గానే నిలిచాయా? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.


టాలీవుడ్ లో ఫ్లాప్ హీరోయిన్ గా మారిన బాలీవుడ్ బ్యూటీ..

ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్(Kriti Sanon). సాధారణంగా “ఇంట గెలిచి రచ్చ గెలవాలి” అంటారు. కానీ ఈమె మాత్రం ముందుగా తెలుగులో రచ్చ చేసినా పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఆ తర్వాత సొంత ఇల్లు అయిన హిందీలో సత్తా చాటి టాప్ హీరోయిన్గా పేరు సొంతం చేసుకుంది. అంతేకాదు ఇప్పుడు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. నిజానికి బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ ను అందుకున్నా.. టాలీవుడ్ లో మాత్రం ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది.


టాలీవుడ్ హీరోల పాలిట శాపంగా..

ఇకపోతే ఈమె తెలుగులో మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా, సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేనొక్కడినే’ వన్ చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా అట్టర్ ప్లాఫ్ గా నిలిచింది. ఆ తర్వాత ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ (Om Raut)దర్శకత్వంలో ప్రభాస్(Prabhas ) శ్రీరాముడిగా నటించిన చిత్రం ‘ఆది పురుష్ ‘. ఇందులో జానకి పాత్రలో నటించింది. అయితే ఈ సినిమాని పూర్తిగా వక్రీకరించి తెరకెక్కించిన నేపథ్యంలో బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఇక నాగచైతన్య (Naga Chaitanya) హీరోగా నటించిన ‘దోచేయ్’అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది. ఇలా తెలుగు హీరోలతో ఈమె చేసిన సినిమాలేవి కూడా కృతి సనన్ కి కలిసి రాలేదు. అటు సెంటిమెంట్ పరంగా కూడా వర్క్ అవుట్ కాలేదు. ఒక రకంగా చెప్పాలి అంటే ఈమెతో తెలుగు హీరోలు నటిస్తే ఫ్లాప్ పక్కా అనే ముద్ర కూడా పడిపోయింది. అంతేకాదు ఈమెను ఐరన్ లెగ్ అని, తెలుగు హీరోల పాలిట యమగండం అని కూడా కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.

బాలీవుడ్ లో మాత్రం నేషనల్ అవార్డ్స్..

ఇకపోతే కృతి సనన్ తెలుగులో నటించకపోయినా.. ఇప్పుడు బాలీవుడ్ లో మాత్రం వరుస సినిమాలు చేస్తూ నంది అవార్డులు కూడా అందుకుంటూ, లగ్జరీ బంగ్లాలను కూడా కొనుగోలు చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. 2021లో నేషనల్ అవార్డు అందుకున్న ఈ బ్యూటీ.. 2023లో ముంబైలోని బాంద్రాలో రూ. 35 కోట్లు వెచ్చించి, 4BHK అపార్ట్మెంట్ కూడా కొనుగోలు చేసింది. ఇక ప్రస్తుతం ‘తేరే ఇష్క్ మే’ అనే సినిమాలో నటిస్తోంది. మరి ఈ సినిమా ఈమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×