E-Paper
Advertisement

Family Star Twitter Review: ఫ్యామిలీ స్టార్ ట్విట్టర్ రివ్యూ.. విజయ్‌కి మరోసారి గట్టి దెబ్బ పడినట్లు ఉందే..?

Family Star Twitter Review: ఫ్యామిలీ స్టార్ ట్విట్టర్ రివ్యూ.. విజయ్‌కి మరోసారి గట్టి దెబ్బ పడినట్లు ఉందే..?
Advertisement
Family Star Twitter Review
Family Star Twitter Review

Vijay Deverakonda and Mrunal thakur Starrer Family Star Movie Twitter Review: విజయ్ దేవరకొండ ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే లక్ష్యంతో ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ప్రీమియర్స్ ఆల్రెడీ యూఎస్‌లో పడ్డాయి. దీంతో ఫ్యామిలీ స్టార్ రచ్చ సోషల్ మీడియాలో స్టార్ట్ అయింది.

ఈ మూవీ గురించి రకరకాలుగా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే కాస్త పాజిటివ్, కాస్త నెగెటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఫ్యామిలీ స్టార్ మూవీ ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా వారి రివ్యూలను పంచుకుంటున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉందో వారి రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

Advertisement

Also Read: Family Star: విజయ్ కన్నా ముందు ఫ్యామిలీ స్టార్ కు అనుకున్న హీరో ఎవరో తెలుసా.. ?

Advertisement

ఓ ఆడియన్ సోషల్ మీడియా ద్వారా ఇలా రాస్తూ.. ఫ్యామిలీ స్టార్ మూవీ ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉంది. అంతేకాకుండా ప్రీ ఇంటర్వెల్ వరకు సీరియల్‌లాగా అనిపిస్తుందని.. సెకండ్ హాఫ్ మరింత ఎనర్జిటిక్‌గా స్టార్ అవుతుంది కానీ ఏ మాత్రం కొత్తగా ఆసక్తికరంగా లేదని అంటున్నారు.

ఇదొక రొమ్ కామ్ మూవీ అని ట్వీట్లు చేస్తున్నారు. అంతేకాకుండా రియల్ ఎమోషన్ కానీ, ఆడియన్స్ కనెక్ట్ అవ్వడం కానీ ఏ విధంగా జరగలేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మ్యూజిక్ కూడా అంతబాగా లేదని చెబుతున్నారు.

Also Read: Vijay Devarakonda: ఐరన్ వంచలేదు మావా.. గట్టిగా దించాడు..?

సర్కారు వారి పాట మూవీలో కీర్తి సురేష్ ఫస్ట్ హాఫ్‌లో చాలా సింపుల్‌గా పూర్ గర్ల్‌గా కనిపించింది. అయితే అలాంటిదే ఫ్యామిలీ స్టార్‌లోనూ ఉంది. ఫస్ట్ హాఫ్‌లో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పూర్ గర్ల్‌గా నటించింది. దీంతో ఈ మూవీ పేట్ల యూనివర్స్ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

ఫ్యామిలీ స్టార్ మూవీ ఫస్ట్ పార్ట్ ఏం బాగోలేదు. దానికంటే రెండవ పార్టు మరింత చెత్తగా ఉంది అని మరొకరు రాసుకొచ్చారు. ఇందులోని ఏ ఒక్క సన్నివేశం ఆకట్టుకోలేదని అంటున్నారు. ప్లాట్, పాయింట్‌ ఏది ప్రత్యేకంగా లేదని.. నటీనటుల పెర్ఫామెన్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదని చెబుతున్నారు. దీని కంటే లైగర్ సినిమా బెటర్ అని ట్వీట్లు చేస్తున్నారు.

https://twitter.com/Vivek5716616397/status/1776035566955475413?

మరొకరేమో.. ఇటీవల టైంలో నేను చూసిన అతి వరెస్ట్ మూవీ ఇదే అని రాసుకొచ్చారు. సెకండాఫ్ చాలా వరెస్ట్‌గా ఉంది. విజయ్ ఓన్లీ ఓ బొమ్మలా ఉన్నాడేమో. విజయ్‌లో స్టఫ్ లేదేమో అన్నట్లుగా కనిపించింది. విశ్వక్ సేన్ లాంటోడు.. గామి వంటి కొత్త సినిమాలు ట్రై చేస్తుంటే.. విజయ్ మాత్రం స్టార్ మా సీరియల్స్ చేస్తున్నాడంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: రేప్ సీన్.. ఆ నటుడుతో చేయనని ఏడ్చిన హీరోయిన్.. చివరికి..

దీన్ని కూడా సినిమా అంటారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. మృణాల్ వంటి అందమైన అమ్మాయి ఇలాంటి బఫూన్ సినిమాలో ఎలా నటించిందని అంటున్నారు. ఆమె మంచి మంచి కథలు సెలెక్ట్ చేసుకుంటుంది. కానీ ఈ సారి ఓ ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకుంటుందని కామెంట్లు చేస్తున్నారు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×